Wednesday, September 18, 2024

Exclusive

Hyderabad:మల్లన్న ల్యాండ్ లడాయి!

– జీడిమెట్లలో 1.29 ఎకరాల స్థలం
– తమదేనంటున్న మాజీ మంత్రి మల్లారెడ్డి
– 15 మంది కలిసి కొన్నామంటున్న శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు
– పరస్పర ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు
– మల్లారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి సహా పలువురిపై కేసులు
– సర్వే నెంబర్ 82లో ఉన్న డాక్యుమెంట్స్‌ను పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు
– ల్యాండ్‌కి 200 మీటర్ల దూరంలో బారికేడ్లు

Telangana: భూవివాదంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. జీడిమెట్ల డివిజన్‌ పరిధి సుచిత్ర కూడలి సమీపంలో సర్వే నెంబర్ 82లో ఎకరా 29 గుంటలు, సర్వే నంబరు 83లో 3 వేల గజాల స్థలాన్ని 2011లో కొన్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి చెబుతున్నారు. అప్పటినుంచి ఈ స్థలం వీరి అధీనంలోనే ఉంది. అందులో షెడ్లు వేసి అద్దెకు ఇచ్చారు. జీహెచ్‌ఎంసీకి పన్నులు సైతం చెల్లిస్తున్నారు. సర్వే నెంబరు 82లోని ఎకరా 29 గుంటల స్థలం తాము కొనుగోలు చేశామంటూ శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి అక్కడకు వెళ్లి సీసీ కెమెరాలు, షెడ్లను తొలగించి స్థలం చుట్టూ రేకులతో కంచె ఏర్పాటు చేయించారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి, భద్రారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డిలు తొలుత పేట్‌ బషీరాబాద్‌ ఠాణాకు వెళ్లారు. సీఐ, ఎస్‌ఐలు అందుబాటులో లేకపోవటంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ భూమి తమదంటే తమదంటూ ఇరువర్గాలు వాగ్వాదం చేసుకున్నాయి. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ స్థలంలో కొత్తగా చేపట్టిన రేకుల కంచెను మల్లారెడ్డి అనుచరులు తొలగించడంతో గొడవ పెద్దదైంది.

పోలీసుల రంగప్రవేశం

పేట్‌ బషీరాబాద్‌ ఏసీపీ రాములు, సీఐలు విజయవర్ధన్, శ్రీనాథ్, రాహుల్‌ దేవ్‌ అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. శ్రీనివాస్‌ రెడ్డి, మల్లారెడ్డిల వద్ద ఉన్న పత్రాలను పోలీసులు పరిశీలించారు. అదే సమయంలో స్టేషన్‌ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి, ఆయన అనుచరులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గేటు బయట బైఠాయించారు. పరస్పర ఫిర్యాదులతో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డిలతో పాటు శేరి శ్రీనివాస్‌ రెడ్డి, బషీర్, సుధామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదానికి కారణమైన స్థలాన్ని సర్వే చేయించాలని కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌ రహమాన్‌ను పోలీసులు కోరారు.

రెవెన్యూ సర్వే

వివాదం ముదరడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. వివాదాస్పద భూమిపై సర్వే చేశారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇది కొనసాగింది. ఇరు వర్గాల సమక్షంలో పూర్తిగా హద్దులను సర్వే చేశారు అధికారులు. సర్వే నెంబర్ 82, 83 విస్తీర్ణాన్ని గుర్తించారు రెవెన్యూ అధికారులు. ఇప్పుడు సర్వే రిపోర్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇరు వర్గాలకు చెందినవారు ల్యాండ్ తమదేనంటుండడంతో, రెవెన్యూ అధికారులు ఏం రిపోర్టు ఇస్తారనేది కీలకంగా మారింది.

రాజీనామాకు సిద్ధం

2011లో రెండున్నర ఎకరాల భూమిని తాను, కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డి కొనుగోలు చేసినట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అప్పటి నుంచి మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నామన్నారు. విద్యుత్‌ మీటర్లు కూడా తమ పేర్లపై ఉన్నాయని చెప్పారు. స్థలంలో షెడ్లు వేసి అద్దెకు ఇచ్చామన్నారు. శ్రీనివాస్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి దౌర్జన్యంగా షెడ్లను ధ్వంసం చేశారన్నారు. తన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. శేరి శ్రీనివాస్‌ రెడ్డి, బషీర్, సుధామ అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తమకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే రెవెన్యూ అధికారులు భూమిని సర్వే చేశారన్నారు. అధికారుల తీరు చూస్తే ఈ భూమి తమది కాదు అని చెప్తారని అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఫోర్జరీ చేసి తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని, డాక్యుమెంట్స్‌తో సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ ఉన్నతాధికారాలను కలుస్తానని చెప్పారు. ఈ భూమి తనది కాదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే లక్ష్మణ్ రాజీనామా చేస్తారా? అని సవాల్ చేశారు మల్లారెడ్డి.

కోర్టు చెప్పినా వినరా?

జీడిమెట్లలోని సర్వే నెంబరు 82లో సుధామ నుంచి 2016లో 1.29 ఎకరాలు కొనుగోలు చేశామని శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. సుమారు 15 మంది కలసి 300, 400, 500 గజాల చొప్పున కొన్నట్లు చెప్పారు. అప్పటినుంచి స్థలం తమ అధీనంలో ఉన్నా, అప్పటి ప్రభుత్వం అండతో తమను బయటకు పంపారని ఆరోపించారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. ఆ స్థలంలోకి మల్లారెడ్డి కుటుంబ సభ్యులెవరూ ప్రవేశించవద్దంటూ 2016లో న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని వివరించారు. తమ స్థలం కావడం వల్ల తాము అందులోకి వెళ్లామన్నారు. 2011లో మల్లారెడ్డి, తాను రాజకీయాల్లో లేమని, కావాలని కొందరు భూమిపై వివాదం సృష్టిస్తున్నారన్నారు. ఏదైనా ఉంటే లీగల్‌గా రమ్మని చెప్పామని, కానీ దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Crime news: విజయ్ మాల్యా పై నాన్ బెయిలబుల్ వారెంట్

ఆదేశాలు జారీ చేసిన ముంబై స్పెషల్ కోర్టు రూ.180 కోట్ల రుణం ఎగవేత కేసులో ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాలు సీబీఐ సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకొని జారీ ఉద్దేశపూర్వకంగానే రుణ...

Land Encroachment: కాస్ట్లీ ఏరియాలో ఖతర్నాక్ కబ్జా!

ఫేక్ మనుషులు.. ఫోర్జరీ డాక్యుమెంట్లు..! - జూబ్లీహిల్స్‌లో భారీ భూ మాయ - 6 ఎకరాల ల్యాండ్.. కబ్జాకు ప్లాన్ - దొంగ వారసులు, ఫేక్ డాక్యుమెంట్లతో స్కెచ్ - నిందితుల్లో సాహితీ లక్ష్మినారాయణ బంధువు - గులాబీల పాలనలో...

MLC Kavitha: బెయిల్ ఇవ్వలేం..

- కవిత కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు - రెండు బెయిల్ పిటీషన్ల కొట్టివేత - సుప్రీం మెట్లేక్కే ఆలోచనలో కవిత Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్...