Congress Manifesto: తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి నాయకులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వలస వెళ్లుతున్నారు. పార్టీ వీడొద్దని అధినేత కేసీఆర్ ఆదేశిస్తున్నా ఆగని పరిస్థితులు ఉన్నాయి. తమ పార్టీ నేతలను ప్రలోభపెడుతున్నారని కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నిన్న విడుదల చేసిన లోక్ సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఓ హామీని మెచ్చుకున్నారు. ఒక వైపు విమర్శిస్తూనే మరోవైపు మంచి మార్పే జరుగుతున్నట్టున్నదని పేర్కొన్నారు.
కేటీఆర్ ఎక్స్ వేదికగా ఇలా స్పందించారు. ‘మన దేశంలో ఆయా రామ్, గయా రామ్ అనే పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి కాంగ్రెస్ తల్లి వంటిది. అలాంటి పార్టీ ఒక మంచి మార్పుకు శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తున్నది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే, ఎంపీలు ఆటోమేటిక్‌గా అనర్హులు అయ్యేలా పదో షెడ్యూల్‌ను సవరించాలనే వారి ప్రతిపాదనను మేం స్వాగతిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
Also Read: తెలంగాణ సరిహద్దులో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి
‘కానీ ఎప్పటిలాగే కాంగ్రెస్ చెప్పొదకటి చేసేదొకటి. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ఇచ్చారు. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పార్టీలోకి చేర్చుకున్నారు. ఆ ఇద్దరు ఇప్పటికీ వారి పదవుల్లోనే ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఇతర కపట పార్టీలకు మీ పార్టీ భిన్నమైనదని ఎందుకు చేసి చూపించరు? ఈ ఇద్దరు ఫిరాయింపుదారులను రాజీనామా చేయించండి లేదంటే స్పీకర్‌తో అనర్హత వేటు వేయించండి. తద్వారా మీరు చెప్పేదే ఆచరిస్తారని ఈ దేశానికి నిరూపించి చూపించండి’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
Congress party, which is the mothership that promoted the “Aaya Ram, Gaya Ram” culture of political defections in India seems to have had a Big change of heart
Welcome their noble proposal of on amending 10th schedule to ensure automatic disqualification of MLAs/MPs if they… pic.twitter.com/gKzhERg1bK
— KTR (@KTRBRS) April 6, 2024
Also Read: పాక్ టెర్రరిస్టులకు అర్థమయ్యే భాషలోనే..! భారత్ వ్యతిరేక ఆలోచన పుడితే చాలు!!
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్‌కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్, కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్‌ను ఇచ్చింది. వీరిద్దరిపై ఎమ్మెల్యేలుగా అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఇది వరకే అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ సెక్రెటరీలకు ఫిర్యాదు చేశారు.