KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్లే తేదీలతోపాటుగా హామీలను ప్రకటించారు కదా.. ఆ తేదీలు దాటిపోయినా ఇంకా ఎందుకు హామీలను అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఖజానా గురించి మొత్తం తెలుసు అని ఎన్నికలకు ముందే వారు చెప్పారని, హామీలు గుమ్మరించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఊడ్చేశారనే సాకు చెప్పడం ఏమిటీ? అని అడిగారు. మహిళలకు రూ. 2,500 ఎప్పుడు వేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ కేటీఆర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ అమలు చేయని హామీలతో ప్రజలను మోసపుచ్చిందని మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. దళితులకు భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళిత బంధు, నిరుద్యోగ భృతి.. ఇలా ఎన్ని హామీలను బీఆర్ఎస్ ఇచ్చిందని గుర్తు చేశారు. మూడెకరాల భూమి నుంచి మూడు వేల నిరుద్యగో భృతి వరకు ఆ పార్టీ 100 వరకు హామీలను ఇచ్చిందని వివరించారు. వాటిని నెరవేర్చనేలేదని ఆగ్రహించారు.
Also Read: బీజేపీ మ్యానిఫెస్టోపై ఖర్గే ఏమన్నారు?
కానీ, కాంగ్రెస్‌కు అలాంటి సంస్కృతి లేదని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. తమ పాలన చూసి బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని, వారు ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎవరూ ఆగడం లేదని పేర్కొన్నారు. అందుకే కేటీఆర్ ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్లుతున్నారని, అందుకే అలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
మంత్రి కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేయగా.. అందుకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేయడంతో కేటీఆర్ ఇంకా విరుచుకుపడ్డారు.