- బీజేపీ గ్రాఫ్ పెంచుతున్న కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలు
- భైంసాలో హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- కేటీఆర్ పై రాళ్లు, చెప్పులు, గుడ్ల తో దాడి
- రీసెంట్ గా కేటీఆర్ ను పబ్లిక్ లో నిలదీసిన మహిళా రైతు
- అధికారం లేకపోయినా అహంకారపు మాటలు
- పులిహోర, అక్లింతలు కడుపు నింపుతాయా అన్న కేసీఆర్
- కేసీఆర్ వ్యాఖ్యలకు మండిపడ్డ హిందూ సంఘాలు
- తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి బీజేపీ కి పరోక్ష సాయం
Ktr controversy coments on Hindus indirect support to BJP in Lok Sabha:
అధికారంలో ఉన్నప్పుడు చెప్పిందే వేదం..చేసిందే శాసనం అన్న తీరుగా ఉండేది గులాబీ నేతల తీరు. అధికారం కోల్పోయినా ఇంకా అహంకారపు మాటలు మాట్లాడుతూ ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నారు కేసీఆర్ అనునాయులు అంటూ ప్రతిపక్షాలు కేసీఆర్ విధానాలను తూర్పారబడుతున్నాయి. అయితే తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన అహంకారాన్ని పుణికిపుచ్చుకున్న కేటీఆర్ తీరుతో ఇప్పటికే పార్టీకీ తీవ్రమైన డ్యామేజ్ కలిగింది. అయినా పశ్చాత్తాప ధోరణి లేుండా ఉండేవాళ్లు ఉంటారు…పోయేవాళ్లు పోతారు అని మాట్లాడుతూ క్రమంగా పార్టీ క్యాడర్ ను కూడా దూరం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు పబ్లిక్ లోనూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కేటీఆర్ ప్రజాగ్రహాన్ని స్వయంగా చవిచూస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడే ప్రజాగ్రహాన్ని చూసిన కేటీఆర్ అధికారం లేకపోయినా తమ ఉనికిని చాటుకోవడానికి నోటికి వచ్చిందల్లా మాట్లాడుతున్నారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అయితే పబ్లిక్ లో ఉన్నామన్న సంగతి మరచి ఇష్టారీతిన మాట్లాడితే ఫలితాలు వేరేలా ఉంటాయి. అందుకు భైంసా సంఘటనే ఉదాహరణ. ఇప్పుడు తీరా ఎన్నికల ముందు కేటీఆర్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు బీజేపీకి అనుకూలించేవిగా ఉన్నాయంటున్నారు రాజకీయ విమర్శకులు.
మత విద్వేష వ్యాఖ్యలు
భైంసా ప్రచార సభలో కేసీఆర్ మత విద్వేషపరమైన వ్యాఖ్యలు చేయడంతో కొందరు హిందువులు ఆగ్రహించారు. కేటీఆర్ పై చెప్పులు, టమోటాలతో దాడి చేశారు. ఈ సంఘటనపై స్పందించిన కేటీఆర్
రాళ్ల దాడిలో తనకు ఎలాంటి గాయం కాలేదని ట్వీట్ చేశారు. తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానన్న కేటీఆర్.. మతం పేరుతో విషం చిమ్మడం, ద్వేషాన్ని వ్యాప్తి చేసే దుండగులతో తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..! గురువారం సాయంత్రం ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా నిర్మల్ జిల్లా భైంసాలో రోడ్ షో నిర్వహించారు కేటీఆర్. రోడ్ షో ప్రారంభ సమయంలో కొందరు హనుమాన్ భక్తులు అక్కడికి వచ్చి రోడ్ షోను అడ్డుకున్నారు. గతంలో కేటీఆర్ రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. భైంసా సున్నితమైన ప్రాంతం కావడంతో కొద్దిసేపు కేటీఆర్ రోడ్‌షోను పోలీసులు నిలిపివేశారు. అయితే కేటీఆర్ గతంలోనూ ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సివచ్చింది. గతంలో కేసీఆర్ కూడా పులిహోర, అక్లింతలు కడుపు నింపవు కదా అంటూ బీజేపీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దానిపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ అంశాలన్నీ బీజేపీ ఓటు బ్యాంకు పెరిగేలా చూస్తామంటున్నారు రాజకీయ విమర్శకులు.
రైతుల ఆగ్రహం
ఇటీవల తన సొంత ఇలాక అయిన సిరిసిల్ల పట్టణంలో ప్రచారం నిర్వహిస్తున్న కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. తమ భూమి తీసుకొని తమకు ఎటువంటి పరిహారం చెల్లించలేదని ఓ మహిళా రైతు కేటీఆర్ ను ప్రశ్నించింది. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన బోనాల లక్ష్మమ్మ అనే మహిళా రైతు తనకున్న రెండు ఎకరాల భూమి పెద్దూరు శివారులోని మెడికల్ కళాశాల కొరకు ప్రభుత్వం తీసుకోవడంతో పట్టణంలో కాయగూరలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా అటుగా వెళ్లిన కేటీఆర్ ను తన భూమి తనకు ఇప్పించాలని అడిగింది. తన భూమికి బదులుగా ప్లాట్ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదని ఎదురు ప్రశ్నించింది. ఊహించని రీతిలో కేటీఆర్ ఏదో సర్ధిచెప్పి అక్కడనుంచి తప్పించుకున్నారు. రైతుల ఆగ్రహం అలాగే మరో సంఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా జిల్లెల్ల గ్రామం అప్పట్లో మంత్రి హోదాలో వెళ్లిన కేటీఆర్ ను రైతులు పలు సమస్యలపై నిలదీశారు. కల్లాలు నిర్మించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎందుకు ఇవ్వలేదని, రంగనాయక సాగర్‌నుంచి కాల్వల నిర్మాణం ఏండ్లకేండ్లు ఆలస్యం కావడంపై ప్రశ్నించారు.. కల్లాలు నిర్మించుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ఈ సందర్భంగా రైతు లింగారెడ్డి అడిగారు. దీనిపై స్పందించిన కేటీఆర్ కల్లాల పైసల విషయంలో రూ.192 కోట్లు బలిమీటికి కేంద్రానికి వాపస్ ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కల్లాల పైసలు పీఎం మోడీ, బీజేపోళ్లను అడుగంటూ రైతుకు సూచించారు.
ఓట్లకు వచ్చినప్పుడు చెప్తం: మహిళలు
సమస్యలు చెప్పుకుందామని వస్తే కేటీఆర్ టైమ్ ఇవ్వలేదని జిల్లెల్ల గ్రామానికి చెందిన దళిత మహిళలు సైతం అప్పట్లో ఫైర్ అయ్యారు. అగ్రికల్చర్ కాలేజీలో భూములు కోల్పోయామని తమకు న్యాయం చేయాలని కేటీఆర్ ను కలవడానికి మహిళలు స్కూల్ వద్దకు వచ్చారు. బిల్డింగ్ఓపెన్ చేసిన తర్వాత కేటీఆర్ వీరిని కలవకుండానే నుంచి వెళ్లిపోయారు. తమ గోడు చెప్పుకుందామని వస్తే కలవకుండానే వెళ్లిపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు సంగతి చెప్తామంటూ మండిపడ్డారు.2022 లో అప్పట్లో పురపాలక, ఐటీ శాఖ మంత్రి గా ఉన్న కేటీఆర్.. ఆరోజు జగిత్యాల జిల్లాలో పర్యటించారు. కాగా.. ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరవాలంటూ చెరకు రైతులు కొంతకాలంగా అక్కడ ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. . ఏడేళ్లయినా.. అప్పటికీ ఫ్యాక్టరీ తెరవకపోవటం వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో మంత్రి కేటీఆర్.. జగిత్యాలలో పర్యటిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో మెట్పల్లిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ అటుగా వెళ్తున్నారు. స్టేషన్ ముందు నుంచి కేటీఆర్ వెళ్తుండటం గమనించిన నారాయణరెడ్డి.. పరిగెత్తుకుంటూ వెళ్లి మంత్రి కాన్వాయ్‌పై చెప్పు విసిరారు. అప్పటివరకు కాన్వాయ్‌పై దృష్టి పెట్టిన పోలీసులు.. వెనక నుంచి నారాయణరెడ్డి పరుగెత్తుకుంటూ రావటాన్ని గమనించలేకపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అతడ్ని అడ్డుకుని స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు.
ఇన్ని సంఘటనలు చవిచూసినా కేటీఆర్ లో అహంకారం ఏ మాత్రం తగ్గలేదంటున్నారు కాంగ్రెస్ వాదులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నారు కేటీఆర్ అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఒకరకంగా కేసీఆర్, కేటీఆర్ హిందూ ఓటర్లను రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనక అంతరార్థం మరోలా కనిపిస్తోంది. బీజేపీకి ఓటు శాతం పెంచేందుకే కేటీఆర్ అలా మాట్లాడుతున్నారని అందరూ అంటున్నారు.