Krithi sanon acting new movie with Siddardha Malhotra do patti:
తెలుగులో వన్ నేనొక్కడినే, ఆదిపురుష్ చిత్రాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది కృతిసనన్ . బాలీవుడ్ లోనూ సంచలన హిట్స్ సాధిస్తోంది. ‘క్రూ’ మూవీలో ఎయిర్ హోస్టెస్ గా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది కృతి. త్వరలో ‘దో పత్తి’మూవీతో వస్తోంది. ఈ ఏడాది ‘యోధ’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న సిద్దార్థ్ మల్హోత్రా తో జోడీ కడుతోంది కృతి. అయితే ఈ మూవీని తానే స్వయంగా నిర్మించడం విశేషం. ఇదొక రొమాంటిక్ ఎంటర్ టైనర్. సిద్దార్ధ్-కృతిసనన్ మధ్య ఘాటైన ఇంటిమేట్ సన్నివేశాలకు కొదవలేదని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఇద్దరి మధ్య కొన్ని సన్నివేశాలకు సంబంధించి టెస్ట్ షూట్ కూడా నిర్వహించారని సమాచారం. వాటిలో కృతిసనన్ ఫిట్ అయిన తర్వాతనే ఆమె ఎంట్రీ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ టెస్ట్ షూట్ సమయంలో సిద్దార్ద్ భార్య కియారా అద్వాణీ కూడా స్పాట్ లో నే ఉందిట. ఇద్దరి కాంబినేషన్ ఆన్ స్క్రీన్ పై అద్భుతంగా ఉంటుందని కితాబు ఇచ్చిందిట.
హద్దులు మీరిన రొమాన్స్
ఇప్పటివరకూ సిద్దార్ధ్-కృతిసనన్ కలిసి నటించింది లేదు. తొలిసారి ఆ జోడీ సెట్ అయింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ కి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ఓ ప్రముఖ దర్శకుడు పనిచేస్తున్నట్లు సమాచారం. అతని పేరును మాత్రం మడాక్ సంస్థ రివీల్ చేయలేదు. ప్రస్తుతం సిద్దార్ధ్ స్పైడర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూట్ పూర్తవ్వడానికి ఇంకా సమయం పడుతుందిట. అయినా ఆ షూట్ తో సంబంధం లేకుండా కొత్త చిత్రానికి సిద్దార్ధ్ డేట్లు కేటాయించనున్నాడుట. ఇంతవరకూ కృతిసనన్ ఇంటిమేట్ సన్నివేశాలు ఏ సినిమాలో చేయలేదు. కొన్ని లిమిటేషన్స్ మెయింటెన్ చేస్తూనే సినిమాలు చేసింది. తొలిసారి రొమాంటిక్ సీన్స్ విషయంలో ఛాన్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి కియారా హబ్బీతో రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో తెరపైనే చూడాలి. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలోనే అధికారికంగా ప్రాజెక్ట్ వివరాలు ప్రకటించనున్నారు.