– బీఆర్ఎస్‌లో ప్రకంపనలు రేపిన కేకే కామెంట్స్
– బుజ్జగించే ప్రయత్నం చేసిన కేసీఆర్
– సమావేశం మధ్యలోనే అలిగి వెళ్లిన కేకే
– కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్టు స్పష్టం
KK Doubt, KCR Who Tried To Appease : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఇది ఎన్నోసార్లు రుజువైంది. నిన్నటిదాకా ప్రత్యర్థి పార్టీని తన మాటలతో చెడుగుడు ఆడుకున్న నేత, తర్వాతి రోజే పొగడ్తల వర్షం కురిపించిన సందర్భాలు ఎన్నో చూశాం. సొంత పార్టీపైనా, అధినేతపైనా తిరగబడ్డ నేతలు ఎందరో. మరోమారు ఇలాంటి సీనే తెలంగాణ రాజకీయాల్లో తాజాగా కనిపించింది. సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కే కేశవరావు. ఈ మాటలను బట్టి త్వరలోనే కేసీఆర్‌కు షాకిస్తారనే అంచనాకొచ్చారు రాజకీయ పండితులు. అనుకున్నట్టే ఆయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్టు ప్రకటించారు.
కేకే ఏమన్నారంటే..?
‘‘ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓట్లు పడే ఛాన్స్ లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. లాస్ట్ ప్లేస్ మాత్రం బీఆర్ఎస్‌దే. సీఎం రేవంత్ పాలనపై ప్రజల్లో సంతృప్తి ఉంది. బీఆర్ఎస్‌లో ముగ్గురు నలుగురు నేతలు మినహా ఎవరికీ ప్రాధాన్యత లేదు. ఎప్పుడూ కేటీఆర్, కవిత, హరీశే కనిపించారు. పార్టీలో పరిస్థితులను కేసీఆర్‌కు చెప్పినా పట్టించుకోలేదు. కాళేశ్వరం డిజైన్ అంశంలో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారు. ఎవరు చేసే పని వాళ్లు చేస్తే బాగుండేది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడం మామూలే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది పార్టీలోకి వచ్చారు. అయితే పార్టీ మారే ముందు రాజీనామా చేయడం నైతికంగా, రాజకీయంగా ఓ బాధ్యత’’ అని కేకే అభిప్రాయపడ్డారు.
Read Also :ఓటేసిన సీఎం
కేసీఆర్ చర్చలు విఫలం
కేకే మాటలను బట్టి పార్టీ మారడం కన్ఫామ్ అనుకున్నారంతా. ఈమధ్య కాంగ్రెస్‌తో ఆయన కుమార్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి చర్చలు జరిపారు. అన్నీ సానుకూలంగానే సాగాయి. రేపోమాపో చేరిక ఉంటుందని అంటున్నారు. తండ్రి ఆదేశం లేకుండా కుమార్తె పార్టీ మారకుండా ఉండరు. అంటే, కేకే కూడా జంప్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ పైనా, కేసీఆర్ పైనా ఈ వ్యాఖ్యలు చేశారని తెగ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన్ను ఆపేందుకు కేసీఆర్ కూడా ప్రయత్నించారు. గురువారం ఎర్రవల్లి ఫాంహౌస్‌కు పిలిపించుకున్నారు. కానీ, చర్చలు విఫలం అయ్యాయి. పదేళ్లు గౌరవించాం.. కష్ట సమయంలో వెళ్తారా? అని కేసీఆర్ అడగ్గా.. తనకు వయసు అయిపోయిందని తన పాత పార్టీకి వెళ్లిపోతున్నానని చెప్పేశారు. కేసీఆర్ సముదాయించినా వినకుండా కేకే మధ్యలోనే వచ్చేశారని సమాచారం. గ్రేటర్ పరిధిలో బలోపేతం కావాలంటే, కేకే ఫ్యామిలీ సపోర్ట్ అవసరమని భావిస్తోంది కాంగ్రెస్.
కాంగ్రెస్‌తో అనుబంధం
కేశవరావు కాంగ్రెస్‌లోనే రాజకీయ ఓనమాలు దిద్దారు. ఉపాధ్యాయుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన, జర్నలిస్టుగా కూడా పని చేశారు. తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేశారు. కాంగ్రెస్‌లో చేరి అనేక ఉన్నత పదవులు నిర్వహించారు. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. 2009లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, తర్వాత ఏఐసీసీ సభ్యుడిగా చేశారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, అసోం, అండమాన్‌లో కాంగ్రెస్ బలోపేతానికి కష్టపడ్డారు. ఏపీలో వరుసగా మూడుసార్లు మంత్రిగా కొనసాగారు. మండలి డిప్యూటీ చైర్మన్‌గానూ కొనసాగారు. 2006-12 మధ్య రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అయితే, రాష్ట్ర విభజన, కాంగ్రెస్ ప్రాభవం తగ్గడం వంటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ గూటికి చేరారు. 2014లో బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు మళ్లీ హస్తం గూటికి చేరుతున్నారు.
Read Also : వేల కోట్ల ‘వ్యాట్’.. హాంఫట్
కేసీఆర్ అలా.. కేకే ఇలా..!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. చివరకు కేసీఆర్ ఫ్యామిలీ మాత్రమే పార్టీలో మిగులుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. వరుసబెట్టి వరదలా నేతలు జంప్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో అగ్నిపరీక్షలా మారిన పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. 14 సీట్ల దాకా సాధిస్తామని కేసీఆర్ ధీమాగా చెప్తున్నారు. కానీ, కేకే చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ పరిస్థితికి అద్దం పడుతోందనే చర్చ జరుగుతోంది. అనేక కారణాలతో పార్టీ ఇమేజ్ దెబ్బతిన్నదని ఆయన బహిరంగంగానే ఒప్పేసుకున్నారు. ఓవైపు రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని కేసీఆర్, కేటీఆర్ అంటుంటే, కేకే మాత్రం అలాంటిదేం లేదన్నట్టు మాట్లాడడం పార్టీ మార్పు సంకేతాలుగా భావించారు. అయితే, బుజ్జగింపులు వర్కవుట్ కాలేదు. కేసీఆర్ తో మీటింగ్ తర్వాత కుమార్తెతో కలిసి కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్టు కేకే ప్రకటించారు.
కేకే ఏమన్నారంటే..?
‘‘ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓట్లు పడే ఛాన్స్ లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. లాస్ట్ ప్లేస్ మాత్రం బీఆర్ఎస్‌దే. సీఎం రేవంత్ పాలనపై ప్రజల్లో సంతృప్తి ఉంది. బీఆర్ఎస్‌లో ముగ్గురు నలుగురు నేతలు మినహా ఎవరికీ ప్రాధాన్యత లేదు. ఎప్పుడూ కేటీఆర్, కవిత, హరీశే కనిపించారు. పార్టీలో పరిస్థితులను కేసీఆర్‌కు చెప్పినా పట్టించుకోలేదు. కాళేశ్వరం డిజైన్ అంశంలో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారు. ఎవరు చేసే పని వాళ్లు చేస్తే బాగుండేది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడం మామూలే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది పార్టీలోకి వచ్చారు. అయితే పార్టీ మారే ముందు రాజీనామా చేయడం నైతికంగా, రాజకీయంగా ఓ బాధ్యత’’ అని కేకే అభిప్రాయపడ్డారు.