Saturday, May 18, 2024

Exclusive

Modi: మోదీ ‘కిసాన్’దుకాణ్ బంద్ ?

  • కిసాన్ సమ్మాన్ పథకానికి గండి కొడుతున్న మోదీ సర్కార్
  • తెలంగాణలో అర్థంపర్దంలేని నిబంధనలతో రైతులకు అన్యాయం
  • ప్రతి సంవత్సరం తగ్గిపోతున్న పథకం లబ్దిదారులు
  • 10 లక్షల అర్హులయిన రైతులకు కిసాన్ సాయం నిలిపివేత
  • 2019 ఫిబ్రవరి నాటికి ఎన్ రోల్ చేయించుకున్న రైతులకు మాత్రమే సాయం
  • 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టిపు చేస్తానన్న మోదీ
  • రైతుల అప్పలు మాత్రం రెట్టింపయ్యాయని ప్రతిపక్షాల విమర్శలు
  • ఎన్నికల వేళ రైతు ప్రేమ కురిపిస్తున్నారంటూ విపక్షాల ఎదురుదాడులు

Modi scheme for farmers kissan samman telangana 10 lakhs farmers pending:
పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ ప్రతి ప్రసంగంలో తాను రైతు జనబాంధవుడిగా చెప్పుకుంటూ ఊదరగొట్టేస్తున్నారు. వివిధ ప్రసార సాధనాలలో మోదీ గ్యారెంటీ అంటూ హోరెత్తించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అప్పట్లో మోదీ రైతుల గురించి మాట్లాడుతూ 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. అయితే వాళ్ల ఆర్తిక సమస్యలు రెట్టింపయ్యాయే తప్ప ఆదాయం మాత్రం అలానే ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తూ వస్తున్నారు. అయితే భారత్ లో 70 శాతం రైతుల ఆదాయం సంవత్సరానికి 15 వేలు కూడా మించడం లేదు. కేవలం పది శాతం రైతులే 30 వేల రూపాయలు ఆర్జిస్తున్నారని భారత వ్యవసాయ పరిశోధనా మండలి అధ్యయనం లో తేలింది. పదేళ్లలో రైతు ఆత్మహత్యలు కూడా రెట్టింపు అయ్యాయి. అయితే ప్రధాని మోదీ సంక్షేమ పథకాలను గొప్పగా అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా రైతు లకు వెన్నుదన్నుగా నిలుస్తున్నామని చెప్పుకుంటూ ఏకంగా రైతుల వెన్ను విరిచేస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కిసాన్ సమ్మాన్ పథకం అమలు తీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇప్పటికే దేశంలోని రైతులకు ఎన్నో రకాలుగా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన అత్యం ప్రతిష్టాత్మక పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోచన.

2019 లోపు ఎన్​రోల్ చేయించుకున్నవాళ్లకే..

కిసాన్ సమ్మాన్ పథకం కింద రైతులు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలను అంటుకుంటున్నారు. దీనినే మూడు విడతల్లో రైతుల ఖాతాలలో జమచేస్తూ వస్తోంది మోదీ సర్కార్. అక్కడదాకా బాగానే ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పైగా రైతులందరికీ ఈ పథకం వర్తించడం లేదు. దాదాపు 10 లక్షల మంది అర్హులైన రైతులకు మోదీ సర్కార్ కిసాన్ సమ్మాన్ సాయం నిలిపేసింది. ఎన్నికల తర్వాత అసలు మొత్తానికే ఈ పథకం ఎత్తేసే ఛాన్స్ ఉందని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు. రైతులకు రకకరాల నిబంధనలు అంటూ కొర్రీలు పెడుతూ ఏటా లబ్దిదారుల సంఖ్యను తగ్గించుకుంటూ పోతోంది. అది కూడా కేవలం 2019 ఫిబ్రవరి నాటికి ఎన్​రోల్ చేయించుకున్నవాళ్లకి మాత్రమే కేంద్రం సాయం అందిస్తోంది. మరి 2019 తర్వాత కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసినవారి పరిస్థితి ఏమిటని ప్రతిపక్షాలు మోదీ సర్కార్ ను నిలదీస్తున్నాయి. కేంద్రం లెక్కల ప్రకారం తెలంగాణలో 2020-21 నాటికి 36.36 లక్షల మంది లబ్దిదారులు ఉంటే రీసెంట్ గా ఆ సంఖ్య 30.39 లక్షలకు తగ్గించేసింది. కేవలం నాలుగేళ్ల పరిధిలో 6 లక్షల మంది పేర్లను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి జాబితా నుంచి తొలగించింది కేంద్రం. ఇక కొత్తగా చేర్చుకునే యోచనే లేదు.

10 లక్షల మంది రైతులకు ఝలక్

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా 6 వేలు సాయం కేంద్రం అందజేస్తున్నది. ఈ స్కీమ్ కు ఫ్యామిలీని యూనిట్ గా తీసుకుని కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి మాత్రమే వర్తింపజేస్తున్నది. ఇన్​కం ట్యాక్స్ చెల్లించేవారికి, ఆధార్‌‌‌‌ కార్డును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయని రైతులకు ఈ పథకం వర్తించడం లేదు. 2019 మార్చి తర్వాత వ్యవసాయ భూములు కొత్తగా కొనుగోలు చేసిన పట్టాదారులకు సాయం అందడం లేదు అలాగే తల్లిదండ్రులు చనిపోతే వారి భూమి వారసుల పేరిట మారిన తర్వాత.. సదరు వారసులకు సమ్మాన్ నిధి జమ కావడం లేదు. కొత్తగా భూములు కొనుగోలు చేసిన అర్హులైన లబ్ధిదారులు, విరాసత్ ద్వారా భూమి పొందిన వారు, భూములను భాగ పంపకాలు చేసుకుని కుటుంబాలు వేరైనవారు ఇలా సుమారు 10 లక్షల మంది అర్హులకు ఈ సాయం అందడం లేదని సమాచారం. కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులకు ఏటా ఒక సారి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇవ్వాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం అవేమి పట్టించుకోవం లేదు.

ఇవేం నిబంధనలు

కేంద్రం తీసుకొచ్చిన కిసాన్‌ సమ్మాన్‌ మాత్రం ఏడాదికేడాది బక్కచిక్కిపోతున్నది. 2019-20 సంవత్సరంలో 8.23 కోట్లు ఉన్న లబ్ధిదారుల సంఖ్య 2023-24లో 7.56 కోట్లకు పడిపోయినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఒక్క జగిత్యాల జిల్లాలోనే లబ్ధిదారుల సంఖ్య వేలల్లో పడిపోయింది. డిసెంబర్‌ 2018లో ఈ పథకం ప్రారంభం కాగా, జిల్లాలో 1,44,545 మంది రైతులకు రూ.28.91 కోట్ల పంటసాయం అందింది. నిరుడు ఆగస్టులో 15వ క్వార్టర్‌ నాటికి లబ్ధిదారులకు అందిన సాయం రూ. 14.23 కోట్లకు పడిపోయింది.అంటే ఈ మధ్యకాలంలో ఏకంగా 51 శాతం మంది లబ్ధిదారులను అంటే 73,405 మంది రైతులను వివిధ కారణలను సాకుగా చూపి పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పరిధి నుంచి తొలగించారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌లో అర్థంపర్థంలేని నిబంధనలు రైతులకు శాపంగా మారాయి. ఆధార్‌కార్డును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయని రైతులకు ఈ పథకం వర్తించడం లేదు. ఆదాయపన్ను చెల్లించేవారు కూడా పథకం నుంచి లబ్ధి పొందలేకపోతున్నారు. 2018 తర్వాత వ్యవసాయ భూమి పట్టదారులకు పథకాన్ని అందడం లేదు. రేషన్‌కార్డులో ఒక్కరికి మాత్రమే వర్తింపజేస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలోని వారికి వేర్వేరుగా భూములు ఉన్నప్పటికీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులను పథకం నుంచి మినహాయించారు. రూ. 10 వేల పెన్షన్‌ అందుకుంటున్నా ఇవ్వడం లేదు. చట్టసభ్యులకు, ప్రైవేటు రంగ సంస్థల్లో పెద్ద పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులను కూడా కిసాన్‌ సమ్మాన్‌ నిధికి పరిగణనలోకి తీసుకోవడం లేదు. త్వరలో జరగబోయే ఎన్నికలలో మళ్లీ మోదీ ప్రభుత్వం గెలిస్తే మొత్తానికే కిసాన్ సమ్మాన్ స్కీమ్ నిలిపివేస్తారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Publisher : Swetcha Daily

Latest

Hyderabad: జూన్ లో పదవుల జాతర

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ మంత్రి వర్గ...

Hyderabad: కేబినెట్ భేటీకి కోడ్ ఆటంకం!

no permission election commission conducting Telangana cabinet meeting: తెలంగాణలో నేడు...

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్...

Don't miss

Hyderabad: జూన్ లో పదవుల జాతర

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ మంత్రి వర్గ...

Hyderabad: కేబినెట్ భేటీకి కోడ్ ఆటంకం!

no permission election commission conducting Telangana cabinet meeting: తెలంగాణలో నేడు...

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్...

Hyderabad: జూన్ లో పదవుల జాతర

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఇప్పటికే అధిష్టానం అనుమతి తీసుకున్న రేవంత్ రెడ్డి ఆరుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఛాన్స్ నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలకు...

Hyderabad: బీఆర్ఎస్ ‘పవర్’గేమ్

బీఆర్ఎస్ హయాంలో యాదాద్రి పవర్ ప్లాంట్ అక్రమాలు ఓపెన్​ టెండర్లు లేకుండానే ఛత్తీస్ గడ్ తో కరెంట్ పర్చేజ్ రైతులకు సబ్సిడీ పేరుతో బలవంతంగా విద్యుత్ పరికరాలు బీఆర్ఎస్ విధానాలతో తీవ్రంగా...

Hyderabad:ఎవరి చేతికి కాంగి‘రేస్’ పగ్గాలు ?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ రేసులో సీనియర్ హేమాహేమీలు జూన్ నెలాఖరున జరగబోయే స్థానిక ఎన్నికలకు ముందే అధ్యక్షుని ఎంపిక పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలలో...