Kiara Advani participating prestige opportunity Canes Film Festival event:
అందరూ ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్ కు హాజరయ్యే అవకాశం అంత తేలికగా దొరకదు అందరికీ. ఈ ఫెస్టివల్ కు హాజరవ్వడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తారు సినీ సెలబ్రిటీలు. పైగా భారతీయ సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్లకు ఇలాంటి అవకాశం దొరకడం చాలా అరుదు. గతంలో దీపికా పదుకొనె, అనుష్క శర్మ ,ఐశ్వర్యారాయ్ వంటి టాప్ స్టార్ల తో బాటు సోనమ్ కపూర్, సారా అలీఖాన్ లు కూడా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరయ్యారు. అలాంటిది భరత్ అను నేను మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ కియారా అద్వానీ కి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో జరిగే ఈవెంట్స్ కు హాజరయ్యే అరుదైన అవకాశం దొరికింది. ఇప్పటిదాకా అతి తక్కువగా అవకాశం దక్కించుకున్న హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు కావడం విశేషం. 2024లో కేన్స్ ఫెస్టివల్కు సంబంధించి రెడ్ సీ ఫిలిం ఫౌండేషన్ నిర్వహించే ఉమెన్ ిన్ సినిమా గాలా డిన్నర్ కు అటెండ్ అయ్యే ఛాన్స్ కొట్టేసింది కియారా. వానిటీ ఫెయిర్ హోస్ట్ చేస్తున్న ఈ ఈవెంట్‌లో ప్రపంచ నలుమూలల నుండి ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఆరుగురు మహిళలు ఈ ఈవెంట్‌లో పాల్గోనున్నారు. అంతే కాకుండా ప్రపంచంలోని సినిమా విశేషాలను పంచుకోవడానికి ఒక సమావేశం కూడా జరగనుందట.
భారత్ పర్వ్ ఈవెంట్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా 2024 మే 18న లా ప్లేగ్ డేస్ పాల్మ్స్‌లో రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానెల్ ఏర్పాటు కానుంది. ఇందులో ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన సినీ సెలబ్రిటీలు.. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. ఈ ప్యానెల్‌లో కియారా అద్వానీ కూడా భాగంకానుంది. ఈ ఏడాది ఐశ్వర్య రాయ్, అదితి రావు హైదరీ కూడా లారియల్ బ్రాండ్‌కు సంబంధించిన కొత్త అంబాసిడర్స్‌గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గోనున్నారు. ఐశ్వర్య రాయ్.. కేన్స్ ఫెస్టివల్‌కు రెగ్యులర్ అయినా అదితి మాత్రం 2022లో మొదటిసారి ఈ రెడ్ కార్పెట్‌పై నడిచింది. ఈ ఏడాది ‘హీరామండి’ లాంటి బ్లాక్‌బస్టర్ రిలీజ్‌తో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తనే ట్రెండింగ్‌లో కనిపిస్తోంది. మే 14 నుండి 25 మధ్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 77వ ఎడిషన్ జరగనుంది. అందులో పలువురు ఇండియన్ సినీ సెలబ్రిటీలు కలిసి ‘భారత్ పర్వ్’ అనే ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలా సహాయపడుతుందని ఇందులో చూపించనున్నారు. సినీ సెలబ్రిటీలు మాత్రమే కాదు.. పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గోనున్నారు. భారత్ పర్వ్ లాంటి ఈవెంట్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరగడం ఇదే మొదటిసారి అని ఇండస్ట్రీ నిపుణులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. మొత్తానికి ఈ ఏడాది జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియన్ సెలబ్రిటీలు హైలెట్ అవ్వనున్నారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈమె నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ను ఇదే ఏడాది లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో నిర్మాత దిల్ రాజు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ మధ్య ఉండే సన్నివేశాలు సినిమాకి అత్యంత కీలకంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.