Wednesday, October 9, 2024

Exclusive

Hyderabad : అంతేగా.. అంతేగా..!

– క్రెడిట్ వస్తే మనదే ఇదంతా..
– తేడా వస్తే పక్కోడి మీదకు తోసేయడమే
– తప్పించుకునే ధోరణి మారని కేసీఆర్
– ఫోన్ ట్యాపింగ్‌ తప్పంతా ఇంటెలిజెన్స్ మీదకు తోసే ప్రయత్నం
– కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్‌ బాధ్యత అంతా ఇంజనీర్లదేనట
– అప్పులు తేవడం బడ్జెట్‌లో భాగమేనంటూ వ్యాఖ్యలు
– టచ్‌లో ఉన్న కాంగ్రెస్ నేతలపై నో క్లారిటీ
– ఆనాడు కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనంపైనా యూటర్న్

Kcr private channal interview fals statements: తప్పులెన్నువారు తమ తప్పులెరగరు అనే సామెత అక్షరాలా కేసీఆర్‌కు వర్తిస్తుందేమో. ఏదైనా క్రెడిట్ వస్తే తాను తీసుకుంటారు. తేడా వస్తే ఎదుటివారిపై నెట్టేస్తుంటారు. దీనికి ఎన్నో ఉదాహరణలున్నాయి. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన మాటలు చూశాక ఇది మరోసారి రుజువైంది. కాళేశ్వరం నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాకా తప్పించుకునే ధోరణే తప్ప, తప్పు చేశాననే భావన ఎంత మాత్రం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఇప్పటికీ అవే అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని ఇతర పార్టీల నుంచి వినిపిస్తున్న మాట. పదేళ్ల పాలనలో ఎక్కడా తన తప్పు లేదనట్టుగా సాగిన ఇంటర్వ్యూ అంతా అబద్ధాలేనంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కాంగ్రెస్‌లో విలీనంపై డబుల్ టంగ్

తెలంగాణ ప్రజలు బాధలు చూడలేక సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కాంగ్రెస్ నేతలు చెబుతుంటారు. కానీ, కేసీఆర్ కష్టం వల్లే తెలంగాణ ఏర్పాటైందనేది బీఆర్ఎస్ వాదన. ఈ గొడవ ఎటు వెళ్లినా, విలీనం అంశం మాత్రం ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. ఆనాడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే బీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ అన్నారు. కానీ, చివరి నిమిషంలో రివర్స్ గేర్ వేశారు. దీనిపై తాజా ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి విలీనం చేస్తానన్న మాట వాస్తవమని, అప్పట్లో కాంగ్రెస్ వాళ్లే తన మాటను వినలేదంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవిలోకి రాక ముందు సోనియాగాంధీని దేవత అని పొగిడారు కేసీఆర్. తీరా అధికారం దక్కించుకున్నాక కాంగ్రెస్ పార్టీని లేకుండా చేద్దామనే కుట్రలు చేశారు. కానీ, చివరకు బీఆర్ఎస్‌నే కష్టాలు వెంటాడుతున్నాయి. ఇక, రాష్ట్రం అప్పుల పాలు ఎందుకయిందని ప్రశ్నిస్తే, బడ్జెట్‌లో భాగంగా అప్పులు తెచ్చుకోవడం సహజమే అని సమర్థించుకోవడంలో కేసీఆర్ అహంకారం కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫోన్ ట్యాపింగ్‌‌లోనూ తన తప్పేం లేదట!

కొన్ని రోజులుగా రాష్ట్రాన్ని పొలిటికల్‌గా షేక్ చేస్తోంది ఫోన్ ట్యాపింగ్ అంశం. దీనిపై కొద్ది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. కానీ, ఆ ప్రెస్ మీట్ జరిగింది లేదు. తాజా ఇంటర్వ్యూలో మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కొత్త విషయం కాదన్నారు. గూఢచారి వ్యవస్థ, వేగులు అనేవి అనాదిగా వస్తున్నాయని పేర్కొన్నారు. ఏ దేశానికి, రాష్ట్రానికైనా నిఘా వ్యవస్థ అనేది అవసరం అని అన్నారు. అందుకు సమాచార సేకరణ కోసం ఇంటెలిజెన్స్ విభాగం ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు. ట్యాపింగ్ అనేది పరిపాలన సంబంధమైన వ్యవహారమని తెలిపారు. ఆ పని ప్రభుత్వం చేయదని, పోలీసులే చేస్తారంటూ సమాధానమిచ్చారు. ఫోన్లు ట్యాపింగ్ చేయాలని సీఎం, మంత్రులు చెప్పరని అన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వదా అని ప్రశ్నించారు. మొత్తానికి ట్యాపింగ్ అంశం ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌ బాధ్యత అని, తమ ప్రభుత్వానిది కాదంటూ మాట్లాడారు కేసీఆర్. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ కనుసైగ లేనిదే అధికారులు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు.

కాళేశ్వరం లోపాలు ఇంజినీర్ల మీదకు నెట్టే ప్రయత్నం!

కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్‌ పైనా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్‌ను రీడిజైన్ చేయాలని ఇంజినీర్లకు సూచించినట్లు తెలిపారు. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని వ్యాప్కో వాళ్లే చెప్పారని వెల్లడించారు. అందుకే, ఏడాది పాటు గోదావరిని సజీవంగా ఉంచే ప్రయత్నం చేశామని అన్నారు. అనుకోకుండా కొన్ని లోపాలు జరిగాయని, ఇదంతా సహజమే అన్నట్టు మాట్లాడారు. డిజైన్ తాను చేయలేదని స్పష్టం చేశారు. ఇక్కడ కూడా ఇంజినీర్లదే తప్పు అన్నట్లుగా మాట్లాడారు కేసీఆర్. కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయగానే, అపర భగీరథుడు, పేదల దేవుడు అంటూ గప్పాలు కొట్టించుకున్న కేసీఆర్, లోపాలను మాత్రం అధికారులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇతర పార్టీల నేతలు మండిపడుతున్నారు.

టచ్‌లో ఉన్న కాంగ్రెస్ వారెవరో నో క్లారిటీ

ముఖ్యమంత్రే పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంటే, ఇంతవరకూ ఖండించలేదని అన్నారు కేసీఆర్. నిజానికి, రేవంత్ రెడ్డి మొదటి రోజే దీనిపై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం జోలికి వస్తే తాటతీస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఉన్న కొందరు మీరు, మేము కలిసి గవర్నమెంట్‌ ఫామ్‌ చేద్దామని తమ నేతల వద్దకు ప్రతిపాదనలు వచ్చాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కానీ, వాళ్లు ఎవరనేది మాత్రం నోరు విప్పలేదు. దీన్నిబట్టి ఇదంతా డ్రామాగా అర్థం అవుతోందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఉన్న కొంతమంది లీడర్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని చురకలంటిస్తున్నారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

Telangana:పేరు మారనున్న ‘ములుగు’

ములుగు జిల్లా పేరు మార్పు కు కసరత్తు మొదలు పెట్టిన అధికారులు ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చాలని ప్రతిపాదన మంత్రి సీతక్క విజ్ణప్తితో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...