Tuesday, December 3, 2024

Exclusive

BRS : బీ ‘కామ్‌’.. గులాబీ అభ్యర్థుల్లో ఒకటే టెన్షన్!

– బీ ఫా‌మ్ అందుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు
– ఒక్కొక్కరికి రూ.95 లక్షల చెక్కులు అందజేసిన కేసీఆర్
– గెలవాలంటే ఒక్కో అభ్యర్థికి కనీసం రూ.50 కోట్ల ఖర్చు
– తీరా ఖర్చు పెడితే గెలుస్తామనే గ్యారెంటీ నిల్
– తీవ్ర ఆందోళనలో గులాబీ అభ్యర్థులు
– బీ ఫామ్ అందుకున్నా బీ కామ్‌గా ప్రవర్తన

హైదరాబాద్, స్వేచ్ఛ: ఒక్క ఐడియా జీవితాన్ని మర్చేస్తుందంటారు. ఒక్క ఓటమి బీఆర్ఎస్ మనుగడనే ప్రశ్నార్థకంగా మర్చింది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడ్డ నేతలు, క్యాడర్‌కు పార్లమెంట్ ఎన్నికలు పెద్ద అగ్నిపరీక్షగా మారాయి. సెంట్రల్‌లో అధికారంలో ఉన్న బీజేపీని, స్టేట్‌ని రూల్ చేస్తున్న కాంగ్రెస్‌ని తట్టుకుని నిలబడడం అంటే మామూలు విషయం కాదు. అందుకే, గులాబీ నేతలు తట్టాబుట్టా సర్దేసుకుంటున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. బడా నేతలు జంప్ అవ్వడం, ఉన్న కీలక నేతలు పోటీకి నహీ అనడంతో చివరకు ఎలాగోలా సీట్ల కేటాయింపును ముగించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తాజాగా వారికి బీ ఫామ్ అందజేశారు. కానీ, అభ్యర్థులను గెలుస్తామా? లేదా? అనే టెన్షన్ వెంటాడుతోంది.

95 లక్షలు ఏ మూలకు సరిపోతాయి..!

రాష్ట్రంలో నామినేషన్ల సందడి నెలకొంది. ఈనెల 25 దాకా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తాంబూలాలు ఇచ్చేశాం ఇక తన్నుకు చావండి అన్న సామెతలా బీఆర్ఎస్ అభ్యర్థుల పరిస్థితి. ఎన్నికల నియమావళిని అనుసరించి ఒక్కో అభ్యర్థికి కేసీఆర్ ఖర్చుల నిమిత్తం రూ.95 లక్షల చెక్కులు అందజేశారు. ఈ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి కనీసం రూ.50 కోట్లయినా ఖర్చు పెట్టనిదే ఓట్లు రాబట్టుకోవడం కష్టం. ఒకప్పడు కేసీఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడయితే అభ్యర్థులు 50 కాకుంటే 100 కోట్లు ఖర్చు పెట్టడానికైనా వెనకాడేవారు కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటేనే జనం మొహం చాటేస్తున్నారు. కనీసం ప్రచారానికి రప్పించాలన్నా కోట్లలో ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే సమస్య వీరిని వేధిస్తోంది.

Also Read: బెంగళూరు వద్దు…మంగళూరే ముద్దు

పార్టీ వీడేవారే ఎక్కువ

ఇటీవలి కాలంలో గులాబీ పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పార్టీలోకి వచ్చేవారి కన్నా వీడేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఎక్కువగా అధికార కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్నది. విజయంపై అనుమానం వ్యక్తమవుతున్నది. అందుకే ప్రచారాన్ని ముమ్మరం చేయలేదనే చర్చ జరుగుతున్నది. కేవలం నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలతోనే సరిపుచ్చుతున్నారనే ప్రచారం ఉన్నది. వాటిలో సైతం కీలక నేతలను కలుపుకొని వెళ్లకపోవడం, ఫ్లెక్సీల్లో సీనియర్ల ఫొటోలు పెట్టకపోవడం, సమావేశాల్లో తమ పేర్లను చెప్పకపోవడంతో చాలా మంది అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది.

వెంటాడుతున్న ఖర్చులు

లోక్‌ సభ సెగ్మెంట్ల పరిధిలో కనీసం ఆరేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అసెంబ్లీ ఎలక్షన్స్‌లోనే ఒక్కో అభ్యర్థి సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో లోక్‌ సభలో పోటీ చేసే అభ్యర్థులు ఏ మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, పోటీ చేసినా గెలుస్తామనే నమ్మకం లేకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఓడిపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుందని భావించి ఖర్చు పెట్టడం లేదని సమాచారం. ఖర్చులన్నీ పార్టీయే భరిస్తుందని అధినేత కేసీఆర్ చెప్పినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని తెలుస్తోంది. అందుకే, అభ్యర్థులు గ్రామాల్లోకి వెళ్లకుండా నియోజకవర్గ కేంద్రాలకే పరిమితమవుతున్నట్టు టాక్.

రూ.50 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే!

బహిరంగ సభలు, రోడ్ షోల‌కు జన సమీకరణ, ప్రచారానికి రోజువారీ ఖర్చులు తప్పించుకోలేని ప‌రిస్థితి. ఇక సోషల్ మీడియా, ఎన్నికల ప్రకటనల ఖర్చు త‌ప్పవు. భోజనాలు, మద్యం, పార్టీల్లో చేరిన వారికి, యువజన సంఘాలు, మహిళా సంఘాలకు ఇలా చెప్పుకుంటూ పోతే అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రచారానికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికల రథం, దానికి డీజే సౌండ్‌ బాక్స్‌లు, పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్స్‌, ఫ్లెక్సీలకు తప్పనిసరిగా ఖర్చుపెట్టాలి. అలాగే ర్యాలీలు నిర్వహిస్తే ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లకు అయ్యే పెట్రోల్‌, డీజిల్‌ వ్యయాన్ని భరించాలి. వీటితోపాటు ఓటర్లకు తాయిలాలతో పాటు లెక్కకు రాని ఖర్చులు సైతం పోటీలో ఉండే వారి చేతి చమురును వదిలించేలా ఉన్నాయి. అలా చేయకపోతే వెంట నడిచేవారు జారిపోతారనే భయం నెలకొంది. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల్లో రూ.50 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసి, ఆ మేరకు ఫండ్స్‌ రెడీ చేసుకుంటున్నారు. ఇందులో కొంత పార్టీ భరించనుండగా, మరికొంత అభ్యర్థులు సొంతంగా అడ్జెస్ట్‌ చేసుకోనున్నారు. ఇప్పటికే కొందరు ఆయా చోట్ల డంప్‌ చేసే ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇక అనుకున్న దాని కన్నా కొంత మేర అదనంగా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది.

డబ్బులు లేకుంటే ముఖం చాటేయడమే!

తమ సమస్యలు విన్నవించుకుందామని వచ్చే నేతలకు అభ్యర్థులు ముఖం చాటేస్తున్నట్లు తెలిసింది. కుల సంఘాలు సైతం కలిసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పార్టీ సమావేశం ఉందని, అక్కడికి వస్తే మాట్లాడుకుందామని చెబుతున్నట్లు సమాచారం. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత, చూద్దాం చేద్దామంటూ దాటవేస్తున్నారని, సమస్యలను విన్నవించుకుందామని, సాయం అడుగుదామని అనుకున్నవారికి నిరాశే ఎదురవుతోంది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థుల తీరుపై సొంత కేడర్ ఆగ్రహంతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో గులాబీ పార్టీ సత్తా చాటడం కష్టమనే టాక్ వినిపిస్తోంది.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర పోషించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌‌ ఇటు పాలిటిక్స్‌లో అటూ మూవీస్‌లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో, సినిమాల్లో రెండింటిలో పవన్ కళ్యాణ్‌కు...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా ఈటలకు ప్రేమ తగ్గినట్టు లేదు - పార్లమెంట్‌లో బీఆర్ఎస్‌ను జీరో చేశామన్న రేవంత్ రెడ్డి Eatala Rajender: ఫిరాయింపులపై బీజేపీ ఎంపీ ఈటల...