– ఎర్రవెల్లిలో నేతలతో కేసీఆర్ చర్చలు
– కంటోన్మెంట్ సీటు నివేదితకే..!
– వరంగల్ ఎంపీ సీటుకు కొత్త అభ్యర్థే..
KCR Emergence Debate on MP Seats at Erravelli Farm House: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఆదివారం పార్టీ ముఖ్యనేతలతో ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో భేటీ అయ్యారు. వరంగల్ ఎంపీ, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై వారితో ఈ సందర్భంగా చర్చించిన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల నుంచి బరిలో దిగే అభ్యర్థులను ఎంపిక చేసి వారి పేర్లు.. ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నారని సమాచారం. ఈ భేటీకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు.
ఈ భేటీలో కంటోన్మెంట్ స్థానానికి సాయన్న కుమార్తె నివేదిత పేరును కేసీఆర్ ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనిపై ఆయన ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేయనున్నారు. మరోవైపు కంటోన్మెంట్ ఉప ఎన్నికల బరితో తాను నిలవనున్నట్లు నివేదిత కూడా ఇప్పటికే ప్రకటించారు.
Read Also: బీజేపీని ఒక్క సీటూ గెలవనివ్వమన్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గం
స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. కాగా, వరంగల్ సీటుకు ఎవరిని నిలబెట్టాలన్న అంశంపై ఈ భేటీలో ఏదీ తేలలేదని సమాచారం. కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య పేరును ప్రకటించినా, ఆమె పోటీ నుంచి వైదొలగి కాంగ్రెస్‌లో చేరి సీటు దక్కించుకోవటంతో దీటైన అభ్యర్థి కోసం కేసీఆర్ అన్వేషిస్తున్నారు.