Kamakshi Bhaskarla decide to act naked if character or situation demanded:
తెలుగు సినిమా రంగంలో కామాక్షి భాస్కర్ల ఇప్పుడిప్పుడే మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది. ఇట్లు మారేడుమిల్లి మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మిస్ తెలంగాణ తర్వాత విరూపాక్ష, ప్రియురాలు, మా ఊరి పొలిమేర, పొలిమేర-2 వంటి సినిమాలలో నటించి మెప్పించింది. అంతేకాదు రీసెంట్ గా 14వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు అందుకోవడంతో అమాంతం కామాక్షి క్రేజ్ పెరిగిపోయింది. ఓవర్ నైట్ స్గార్ గా మారిపోయింది. వాస్తవానికి ప్రియురాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది కామాక్షి. అయితే ఆ సినిమా వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు. కామాక్షి భాస్కర్ల చైనాలో ఎంబీబీఎస్ చేసి అపోలో హాస్పిటల్‌లో కొంతకాలం డాక్టర్‌గా పని చేసింది. ఆ తర్వాత మోడల్ రంగంలో అడుగుపెట్టి 2018 ఏడాదికి గాను మిస్ తెలంగాణగా ఎంపికైంది. 2018 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకుంది. వృత్తి రీత్యా డాక్టర్ అయిన కామాక్షి భాస్కర్ల.. హీరోయిన్‌గా మారి వచ్చిన ప్రతీ ఛాన్సును యూజ్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఈమె నటించిన విరూపాక్ష, పొలిమేర 2, మంగళవారం లాంటి చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి.
ఇమేజ్ గురించి పట్టించుకోను
అలాగే కామాక్షి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తోంది. ఇటీవల ఈ అమ్మడు సైతాన్ వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కామాక్షి షాకింగ్ చేసి వార్తల్లో నిలిచింది. ‘‘ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ రోల్ పండించడం నటిగా నా కర్తవ్యం. సన్నివేశం డిమాండ్ చేస్తే బట్టలు లేకుండా నగ్నంగా నటించడానికి అయినా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు ఉండి రేపు ఊడిపోయే ఇమేజ్, అందం గురించి నేను పెద్దగా పట్టించుకోను. కాబట్టి దర్శకులు గుర్తుంచుకుని నాకు సినిమాల్లో క్యారెక్టర్స్ ఇవ్వండి’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కామాక్షి కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.