Tuesday, December 3, 2024

Exclusive

K.Kannarao : కబ్జాల కన్నారావు

  • కల్వకుంట్ల కన్నారావుపై మరో కేసు నమోదు
  • ఇప్పటికే భూకబ్జా కేసులో జైలు శిక్ష
  • సాఫ్ట్ వేర్ ఉద్యోగిని నిర్భంధించి, కొట్టాడని ఫిర్యాదు
  • 97 తులాల బంగారం దోచుకున్న కన్నారావు
  • గత ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇష్టారాజ్యం
  • కలిసొచ్చిన ధరణి లొసుగులు
  • ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ కన్నారావు ప్రమేయం
  • మాజీ మంత్రి తలసాని మనిషికి బెదిరింపులు
  • కన్నారావును ప్రశ్నించేందుకు రెడీ అవుతున్న ఈడీ

Kalvakuntla Kanna rao Land Grab At Adibatla: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట. ప్రభుత్వ పెద్దలే మనవాళ్ళు. ఇక మనకేం అడ్డు. గత బీఆర్ఎస్ హయాంలో ఇలా సాగింది కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావు వ్యవహారం. ఆయన కన్ను బడితే ఆ భూమి కబ్జానే. అధికారం మనదే ఇక దానిని అడ్డుబెట్టుకొని అందినకాడికి దోచుకునుడే అనేది ఆయన నైజం అని పలు పోలీస్ స్టేషన్ లలో ఆయనపై నమోదు అయిన భూకబ్జా కేసులు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ శివార్లలోని మన్నెగూడ ల్యాండ్ కబ్జా కేసులో కన్నారావును ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసందే…
ల్యాండ్ కబ్జా ఆరోపణలతో ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇవ్వగా.. అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ పిటీషన్‌ దాఖలు చేయగా దాన్ని న్యాయస్థానం కొట్టేసింది. దీంతో.. పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కన్నారావుపై ఐపీసీ సెక్షన్లు 307, 447, 427, 436, 148, 149 కింద ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

దౌర్జన్యం కేసు..

తాజాగా కన్నారావుతో సహా మరో ఐదుగురి మీద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయం కోసం కన్నారావు వద్దకు వెళ్లిన సాప్ట్‌వేర్ ఉద్యోగి విజయ వర్ధన్ రావును నిర్బంధించి…కొట్టి 60 లక్షల రూపాయల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నారు. బిందు మాధవి అలియాస్ నందిని చౌదరి అనే మహిళతో కలిసి కన్నారావు ఈ అరాచకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతే కాదు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న టాస్క్ ఫోర్స్ ఆనాటి అధికారులు భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తమకు క్లోజ్ అంటూ జనార్దన్ రావును బెదిరించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కన్నారావుతోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

ధరణి పేరుతో కోట్లు కొల్లగొట్టి..

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ తరుణంలో ప్రతిపక్ష బీఆర్ ఎస్ గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయింది. ఇప్పడు కల్వకుంట్ల కన్నారావు మరో కేసులో అరెస్ట్ కావడం పెద్ద చర్చనీంయాంశంగా మారింది. ధరణి పేరుతో కోట్ల విలువ చేసే భూములు బీఆర్ఎస్ నేతలు మింగేశారని, భూ కబ్జాలకు పాల్పడ్డారని ఇప్పటికే తూర్పూరబడుతోంది అధికార కాంగ్రెస్. ఈ తరుణంలో బీఆర్ఎస్ నేతలు ఇలా అక్రమాలకు పాల్పడటం, వారిపై కేసులు నమోదు కావడం సర్వత్రా చర్చనీయాంశమౌతుంది. దీనిపై పోలీసులు మరింత విస్తృతంగా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వ నాయకుల అండతో ఇస్టారీతిగా భూకబ్జాలకు పాల్పడిన కల్వకుంట్ల కన్నారావు అరాచకాలు అన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి.

ఫాంహౌస్ కేసులో…

ఎమ్మెల్యే ల కొనుగోలు కేసు తీగ లాగితే బయటపడ్డ మాణిక్‌చంద్‌ గుట్కా కేసులో త్వరలోనే మరికొందరికి నోటీసులు జారీ చేసేందుకు ఈడీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ కేసు లో అభిషేక్‌ను విచారించిన సమయంలో బయటపడ్డ పేర్ల ప్రకారం ఆ నోటీసులు జారీ చేయనుంది. ముఖ్యం గా, కల్వకుంట్ల కుటుంబానికి చెందిన కల్వకుంట్ల తేజేశ్వర రావు అలియాస్‌ కన్నారావుతోపాటు అధికార పార్టీకి చెందిన కొంతమంది చిన్న నాయకులకు ఈడీ పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. కన్నారావు తనను తాను సీఎం కేసీఆర్‌కు బంధువుగా ప్రచారం చేసుకుం టూ రియల్‌ ఎస్టేట్‌, ఇతర వ్యాపారాలు చేస్తుంటారని సమాచారం.ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏ2గా ఉన్న నందకుమార్‌తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతరులతోనూ కన్నారావు వ్యాపార లావాదేవీలు జరిపినట్లు ఈడీ గుర్తించింది. నందకుమార్‌తోపాటు ఇంకా ఎవరెవరితో అభిషేక్‌ ఆర్థిక లా వాదేవీలు జరిపారు? వ్యాపార లావాదేవీలు మరెవరితో ఉన్నాయనే వివరాలను విశ్లేషిస్తోంది.

తలసాని మనిషికి వార్నింగ్

గతంలో అప్పటి బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మనిషికి ఒక విషయంలో ఫోన్ చేసి వార్నింగ్ యిచ్చాడంటూ సోషల్ మీడియాలో కన్నారావు వాయిస్ అంటూ వైరల్ అయిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది.నార్సింగ్ ప్రాంతంలో కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి. మేడ్చల్ జిల్లాలో కూడా భూ కబ్జా ఆరోపణలు వున్నాయి. గతంలో అనేక పోలీస్ స్టేషన్ లలో కన్నారావుపై ఫిర్యాదులు అనేకం వున్నాయి. కానీ అధికారం లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండటంతో అతను ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Crime news: విజయ్ మాల్యా పై నాన్ బెయిలబుల్ వారెంట్

ఆదేశాలు జారీ చేసిన ముంబై స్పెషల్ కోర్టు రూ.180 కోట్ల రుణం ఎగవేత కేసులో ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాలు సీబీఐ సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకొని జారీ ఉద్దేశపూర్వకంగానే రుణ...

Land Encroachment: కాస్ట్లీ ఏరియాలో ఖతర్నాక్ కబ్జా!

ఫేక్ మనుషులు.. ఫోర్జరీ డాక్యుమెంట్లు..! - జూబ్లీహిల్స్‌లో భారీ భూ మాయ - 6 ఎకరాల ల్యాండ్.. కబ్జాకు ప్లాన్ - దొంగ వారసులు, ఫేక్ డాక్యుమెంట్లతో స్కెచ్ - నిందితుల్లో సాహితీ లక్ష్మినారాయణ బంధువు - గులాబీల పాలనలో...

MLC Kavitha: బెయిల్ ఇవ్వలేం..

- కవిత కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు - రెండు బెయిల్ పిటీషన్ల కొట్టివేత - సుప్రీం మెట్లేక్కే ఆలోచనలో కవిత Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్...