Saturday, May 18, 2024

Exclusive

Kaleshwaram : శనీశ్వరంగా మారిన కాళేశ్వరం..!

Kaleswaram Turned Into Saturn : దేశంలో గత మూడున్నర దశాబ్దాల కాలంలో రాజకీయంగా అనేక మార్పులు వచ్చాయి. ఈ కాలంలో కొన్ని రాష్ట్రాల్లో పలు ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. పూర్తిగా కేంద్రీకరించిన కుటుంబ పాలన, జవాబుదారీ లేకపోవటం, అంతులేని అక్రమ సంపాదనకు ఈ పార్టీలు చిరునామాగా మారాయి. ముఖ్యంగా బీహార్ , ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాలలో ఇలాంటి ప్రాంతీయ పార్టీల హవా సాగింది. రైతు పేరుతో రాజకీయం చేసే ఈ పార్టీలు అక్రమ ఆర్జన కోసం భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రకటించటం, వాటి నిర్మాణానికి ప్రభుత్వ హామీతో అప్పులు తీసుకోవటం, ఆనక ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఇష్టంవచ్చినట్లు పెంచి, అందినకాడికి దోపిడీకి అలవాటు పడ్డాయి. రుణాలను ప్రభుత్వం సొంత పూచీకత్తు మీద తీసుకోవటంతో ప్రజలమీద నేరుగా ఆ రుణభారం వెంటనే పడదు. కాంట్రాక్టులన్నీ అయిన వారికే దక్కుతాయి గనుక అందులో తమకు నచ్చినంత దోచుకోవచ్చు. ఇదేంటని ప్రశ్నించిన విపక్షాలను, మేధావులను ద్రోహులుగా చిత్రీకరించే రోత రాజనీతి ప్రాంతీయ పార్టీలున్న చోట ప్రబలిపోయింది.

నూతన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో సరిగ్గా ఇదే కథ నడిచింది. గోదావరి నదిపై అప్పటికే ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పక్కనబెట్టి నాటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం అనే కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అంతకు పూర్వం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద రూ.38 వేల కోట్ల ఖర్చుతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించింది. దీనికోసం రూ. 10 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టి పనులూ ప్రారంభించింది. అయితే, దీనిని పనికి రాని ఆలోచనగా నాటి సీఎం తీసిపారేసి, స్వయంగా నీటిపారుదల నిపుణుడి అవతారమెత్తారు. రూ. లక్షా నలభై వేల కోట్ల ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. 2018 ముందస్తు ఎన్నికల నాటికి అత్యధిక భాగం నిర్మాణాన్ని పూర్తి చేసి అఖండ గోదావరికి నడక నేర్పిన ఘనత నాదేనంటూ ప్రకటించుకున్నాడు. ఆయన అనుయాయులు ఆయనను గంగను భూమ్మీదికి తెచ్చిన అపర భగీరథుడిగా పొగిడారు. 2018 ఎన్నికల ముందు ప్రగతి భవన్‌లో ఆశ్రయం పొందిన కొందరు తెలంగాణ మేధావులు కొందరు, ఈ ప్రాజెక్టును సందర్శించి ‘ఆహా ఓహో’ అంటూ తెగ హడావుడి చేశారు. నాటి తెరాస నేతలు, ప్రజాప్రతినిధులు సొంత డబ్బుతో కిరాయి బస్సులు పెట్టి రోజూ వందల మంది జనాన్ని తీసుకుపోయి ప్రాజెక్టు చూపించి అరచేతిలో స్వర్గాన్ని చూపారు. ఆకాశాన్నంటిన వందిమాగధుల పొగడ్తలు, అబద్ధాలను పరమ సత్యాలుగా వల్లించిన ఆయన చేతిలోని మీడియా జోరు, ఇరిగేషన్ పేరుతో అడ్డగోలుగా కొల్లగొట్టిన అవినీతి సొమ్ము ధాటికి గందరగోళానికి గురైన ప్రజలు ‘ఇదంతా తెలంగాణ పునర్నిర్మాణమే కాబోలు’ అనుకుని 2018 నాటి ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్‌ను మరోమారు సీఎంగా ఎన్నుకున్నారు. అయితే, ఈ ప్రాజెక్టు పేరుతో ఆయన కుటుంబం, అనుయాయులు వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు.

Read More: వెలుగు తెచ్చిన వందరోజుల పాలన..!

అయితే.. కేసీఆర్ ఒకటి తలిస్తే, కాలం మరొకటి తలచింది. ప్రాజెక్ట్ వారంటీ కాలం పూర్తికాకముందే బ్యారేజీ నిలువునా నెర్రెలిచ్చింది. అయితే దీనిని రహస్యంగా ఉంచేందుకు కేసీఆర్ అండ్ కో విశ్వప్రయత్నాలు చేశారు. విపక్ష సభ్యుల మొదలు నరమానవుడిని అక్కడికి వెళ్లనీయకుండా పోలీసు కాపలా పెట్టారు. కాదని ముందుకు పోయే యత్నం చేసిన వారిని అరెస్టు చేశారు. ఈ ప్రాజెక్టు ఆర్థికంగా లాభదాయకమైనది కాదని, ఈ ప్రాజెక్టుకి అవసరమైన కరెంటు ఖర్చు, నిర్వహణా వ్యయం, తెచ్చిన అప్పులకు కట్టాల్సిన వడ్డీలన్నీ కలిసి తడిసి మోపెడై అంతిమంగా ఈ ప్రాజెక్టు తెల్ల ఏనుగుగా మారనుందని నీటి పారుదల నిపుణులు నెత్తీనోరు బాదుకుని చెప్పుకున్నా నాటి సీఎం చంద్రశేఖర రావు తనదైన శైలిలో దబాయించి వారి నోళ్లు మూయించాడు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 97 వేల కోట్ల రూపాయలను 11% వడ్డీకి అప్పు తెచ్చారు. మరో రూ. 40 వేల కోట్ల ఖర్చు ప్రతిపాదనలు గత ప్రభుత్వం దగ్గర ఉన్నాయి.

ఈ ప్రాజెక్టు ప్రకటన రాగానే సీఎం గారి బంధుమిత్రుల్లో చాలామంది బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తారు. అయితే ఈ విషయాన్ని ఏ దశలోనూ బయటికి పొక్కకుండా ఆయన మేనేజ్ చేయగలిగారు. ఇక, ప్రాజెక్టులో పని చేసిన అనేకమంది అధికారులూ తమ వంతు ప్రయోజనాన్ని పొందారని నేడు బయటికొస్తున్న వార్తా కథనాలు తెలియజేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కనీసం 20 ఏళ్ల పాటు తెలంగాణ ప్రభుత్వానికి గుదిబండగా మారనుందని, దీనివల్ల కీలక ప్రాధాన్యతలను పక్కనబెట్టాల్సిన దుస్థితి తెలంగాణ ప్రభుత్వాలకు తప్పదని అనేకమంది నిపుణులు నేడు చెబుతున్నారు. కనుక అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో బాటు విపక్షాలు రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి వాస్తవికత ఆధారంగా ఈ ప్రాజెక్టు వ్యవహారాన్ని నిపుణుల చేత మదింపు చేయించి, రాబోయే రోజుల్లో దీనివల్ల సంభవించనున్న పరిణామాల మీద ఒక అంచనాకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ ప్రాజెక్టు కోసం రూ. లక్ష కోట్లకు పైగానే ఖర్చు జరిగిందనీ, ఇంతా చేస్తే దీనివల్ల అదనంగా కేవలం 59 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకే సాగునీరు అందనుందని, ఈ పనులు సాగిన తీరు చూస్తుంటే, బయటికి కనిపించకుండా, తెలివిగా డబ్బు కొట్టేసేందుకే దీనిని ప్రతిపాదించారని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే, దీని నిర్మాణం వల్ల రంగరాయ ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రాంతాలకు కొంతమేర ప్రయోజనం జరిగిందని కొందరు అధికారులు చెబుతున్నారు. అయితే దీని కరెంటు ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చులు, వడ్డీల కోసం ఏటా తెలంగాణ బడ్జెట్‌లో ఏటా రూ.20 వేల కోట్ల వరకు పక్కనబెట్టక తప్పదని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. అదే నిజమైతే తెలంగాణ సమాజం మీద అది మోయలేని భారంగా పరిణమిస్తుందని సదరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More: పొడుస్తున్న పొద్దు… నడుస్తున్న చరిత్ర!

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రిపేర్లు చేసి, తాత్కాలికంగా సాగునీరు అందించినా, అదంతా ‘చారానా దావత్‌కు బారానా టాంగా కిరాయి’ చందాన మారుతుందని, అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం అపఖ్యాతిని మూటగట్టుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం, తెచ్చిన అప్పులు, పెట్టిన ఖర్చు, నిర్మాణ సంస్థ వివరాలు వంటి అన్ని అంశాలను తెలంగాణ ప్రభుత్వం కేంద్ర నీటిపారుదల నిపుణుల కమిటీ చేత విచారణ చేయించి ప్రజల ముందు వాస్తవాలను పెట్టి, ఇందులోని అవనీతి, అనైతిక వ్యవహారాలకు పాల్పడిన వారి మీద తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకొని, ఆ సొమ్మును బాధ్యుల నుంచి రికవరీ చేయాలని మేధావులు సూచిస్తున్నారు. కొందరు స్వార్థపూరితమైన ఆలోచనలతో ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే, ఆ భారాన్ని తెలంగాణ సమాజం మీద మోపటం సరికాదని, కనుక రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని నేడు తెలంగాణ సమాజం ఆకాంక్షిస్తోంది.

-కూరపాటి వెంకట్ నారాయణ (విశ్రాంత ఆచార్యులు) కాకతీయ యూనివర్సిటీ

Publisher : Swetcha Daily

Latest

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Don't miss

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Freebies: ఉచితాల రాజకీయం ఇంకెన్నాళ్లో?

Welfare Schemes: తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు విపక్షాలు ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం పోతూపోతూ ఖాళీ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఈ పదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ విజయాలను సాధించిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం....

Israel: ఈ భీకర యుద్ధం ఆగేదెప్పుడో…?

Israel Hamas War Palestine Conflict Gaza Air Strikes Bombings Land Operations: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య మొదలైన యుద్ధం బుధవారం నాటికి 222 రోజులకు చేరింది. ఈ ఏడున్నర...