Wednesday, September 18, 2024

Exclusive

CMRF Cheques Scam : రోగుల సొమ్ము కాజేశారు..

– సీఎం రిలీఫ్ ఫండ్‌‌ చెక్కుల్లో అవినీతి
– రూ.200 కోట్లు కొట్టేసిన నేతలు, అనుచరులు
– ఏ వివరాల్లేకుండానే రూ. 85 కోట్ల చెక్కులు
– రాజకీయ లబ్దికోసం సీఎంఆర్ఎఫ్ నిధుల వాడకం
– సీబీసీఐడీ, సీసీఎస్ గుర్తించినా.. పట్టించుకోని నాటి సర్కారు
– నియోజకవర్గంలో 30 మందికి చెక్కులిచ్చిన నేతలు
– దరఖాస్తు చేయని వారి పేరిటా చెక్కులు
– హరీష్ పీఏ అరెస్టుతో వెలుగులోకొస్తున్న వాస్తవాలు
– నాటి అక్రమాలపై నేటి సర్కారు నజర్

CMRF Cheques Scam : పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల పుట్టలు ఒక్కొక్కటే పగులుతున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ అంశం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుండగా, తాజాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో జరిగిన భారీ అవినీతి బట్టబయలవుతోంది. మాజీ ఆరోగ్య శాఖామంత్రి టి. హరీష్ రావు మాజీ పీఏ నరేష్ ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు ఆధారాలతో సహా బయటపడటంతో జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ గలీజు దందాలో అతడితో చేయికలిపిని మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

తీగ లాగితే డొంకంతా కదిలింది…

2022 నవంబరులో మెదక్ జిల్లా పీర్ల తండా అబెండకు చెందిన పి. రవి నాయక్ తన భార్య లలితాబాయి పాము కాటుకు గురికావటంతో ఆమెను సంగారెడ్డిలోని బాలాజీ హాస్పిటల్‌లో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అమీర్​పేటలోని వెల్‌నెస్​ఆసుపత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. చికిత్స కోసం రూ.5 లక్షలు వెచ్చించిన రవి నాయక్ తర్వాత సీఎం రిలీఫ్‌ఫండ్​కోసం హరీశ్ రావు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా అది ప్రాసెస్ అయింది. అయితే, ఇటీవల ఆ చెక్కు గురించి రవి తెలంగాణ సెక్రటేరియట్‌లోని సీఎం రిలీఫ్ ఫండ్ విభాగంలో ఎంక్వైరీ చేయగా, రూ. 87,500 మంజూరైందనీ, 707447, 707487 నంబర్ల చెక్కులను హైదరాబాద్​జూబ్లీహిల్స్​పరిధిలోని జోగు నరేష్ కుమార్ అనే వ్యక్తి దానిని మార్చుకున్నట్లు తేలింది. తన చెక్కును ఎవరో మార్చేసుకున్నారని గ్రహించిన రవి.. దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా హరీష్ మాజీ పీఏ నరేష్ కుమార్‌తో బాటు అతనికి సహకరించిన వెంకటేశ్ గౌడ్, కొర్లపాటి వంశీ, ఓంకార్‌ను అరెస్టు చేశారు. వారిపై417, 419, 420, 120(b) r/w 34 IPC, సెక్షన్ 66(B) & 66(C) IT యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

2014 నుంచే నడిచిన దందా

హరీష్ రావు పీఏ పేరు రావటతో సీఎంఆర్ఎఫ్ వ్యవహారం ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది గానీ, 2014 నుంచే ఈ పథకాన్ని బీఆర్ఎస్ నేతలు ఏటీఎం మాదిరిగా వాడుకోవటం మొదలైంది. 2018 ముందస్తు ఎన్నికల నాటికి ఈ అవినీతి తారస్థాయికి చేరింది. అప్పట్లో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోన్న ఫోరం ఎగైనెస్ట్ కరప్షన్ వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ అప్పట్లో దీనిపై స.హ చట్టం కింది సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలు కోరారు. దీనిపై ప్రభుత్వం ఆయనకు 700 పేజీల సమాచారాన్నిచ్చింది. 2014 జూన్ నుంచి 2015 ఆగష్టు మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.86.6 కోట్ల విలువైన 12,462 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు క్లియరెన్స్ ఇచ్చింది. కానీ, వాటిలో కేవలం రూ.1.69 కోట్ల విలువైన 182 చెక్కులు పొందిన వారి వివరాలు మాత్రమే ప్రభుత్వం వద్ద ఉన్నాయని ఆ పిటీషన్ ద్వారా వెల్లడైంది. మిగిలిన 12,280 చెక్కులకు సంబంధించిన లబ్దిదారు పేరు మాత్రమే తమ రికార్డుల్లో ఉందనీ, వారి చిరునామా, ఫోన్ నంబర్‌తో సహా మరే వివరాలూ తమ వద్ద లేవని సర్కారు నుంచి జవాబొచ్చిందని అప్పట్లో విజయ్ గోపాల్ మీడియాకు వెల్లడించారు. తమ ప్రభుత్వం గత 46 నెలల్లో 1.2 లక్షల కుటుంబాలకు ఈ పథకం కింద లబ్ది చేకూర్చిందని నాటి ఆపద్దర్మ మంత్రి హోదాలో 2018 ఏప్రిల్‌లో కేటీఆర్ దీనిపై ట్వీట్ చేశారని కూడా విజయ్ గోపాల్ గుర్తుచేశారు.

నో రూల్స్

సీఎం రిలీఫ్ ఫండ్ కింద దరఖాస్తుదారుల ఫోన్ నెంబర్లు, గుర్తింపు వివరాలు, చికిత్స పొందే హాస్పిటల్ వివరాలు, చికిత్స దేనికి? వంటి మొత్తం 15 ప్రశ్నలకు జవాబిస్తూ దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఆ దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది. కానీ పేరు తప్ప ఏ ఒక్క వివరమూ లేకుండా ప్రభుత్వ అధికారులు నిధులు ఎలా విడుదల చేశారని విజయ్ గోపాల్ ప్రశ్నించారు. అంతేగాక.. ఒకే నెంబరుతో ఉన్న చెక్కులను చాలామందికి ఇచ్చినట్లు కూడా తన దృష్టికి వచ్చిందని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల వ్యవహారంలో జరిగిన అవినీతిని బయటికి తీయాలంటూ 2018లోనే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అప్పట్లో సీబీ సీఐడీకి ఫిర్యాదు కూడా చేసింది. ఈ క్రమంలో 54 కార్పొరేట్ ఆస్పత్రులకు ఈ అవినీతి వ్యవహారంలో సంబంధాలున్నట్లు నిర్ధారించటమే గాక, నకిలీ బిల్లులు, లెటర్ హెడ్‌లతో లూటీకి దిగిన హైదరాబాద్‌, వరంగల్, కరీంనగర్‌లోని 20 కార్పోరేట్ ఆస్పత్రులకు నోటీసులు కూడా ఇచ్చింది. తన విచారణలో 1,251 దరఖాస్తులపై అప్పట్లో సీఐడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఖమ్మంలోని వినాయక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు.. మిర్యాలగూడలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌పై కేసులు కూడా నమోదు కాగా, నల్గొండకు చెందిన జ్యోతి, లక్ష్మి, దిరావత్, శివపై పోలీసులు కేసులూ నమోదు చేశారు.

తొలి టర్మ్‌లోనే రూ. 150 కోట్లకు పైగా లూటీ

2018లోనే రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేల సన్నిహిత అనుచరులకు నియోజకవర్గానికి 30 మంది చొప్పున ఎలాంటి మెడికల్‌ బిల్లులు లేకుండా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు చెక్కులను అందించారు. దీంతో ఈ వ్యవహారంలో రూ.200 కోట్లు దుర్వినియోగం అయినట్టు అంచనా వేశారు. అప్పట్లో రాజకీయ లబ్దికోసం తమ నియోజక వర్గంలోని లీడర్ హోదాను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెక్కులిచ్చారు. తమకు ముఖ్యులు అనుకున్నవారికి రూ.10 లక్షలు రూ.15 లక్షల దాకా చెక్కులు అందాయి. ఇలా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో సుమారు 30 మంది నేతలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందాయనీ, రాష్ట్రం మొత్తం మీద ఇలా రూ. 150 కోట్లు దోచేశారనే వార్తలూ వచ్చాయి. బీఆర్ఎస్ లీడర్ల పేరుతో వచ్చిన అప్లికేషన్లలో ఆస్పత్రి బిల్లులు లేకపోయినా ఎమౌంట్ చెక్కు రూపంలో రెడీ కావటాన్ని నాడు సీబీ సీఐడీ గుర్తించింది. దీనిపై అప్పట్లో సీఎంఓ కొంత ఆరా తీసే ప్రయత్నం చేసినా, నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో దాన్ని మేనేజ్ చేశారు.

చక్రం తిప్పింది అతనేనా..

సీఎం రిలీఫ్ ఫండ్ అవినీతి వ్యవహారంలో నాటి సీఎం వద్ద ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన పెంటపర్తి రాజశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా జరిగిన సహారా కుంభకోణం తర్వాత రాజశేఖర్ రెడ్డి తన ప్రభుత్వ ఉద్యోగం నుండి VRS తీసుకోవటం, ఆ తర్వాతి రోజుల్లో సీఎం కాగానే కేసీఆర్ ఆయనకు ప్రత్యేక కార్యదర్శిగా నియమించినట్లు తెలుస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల వ్యవహారమంతా ఈయనే పర్యవేక్షించారని, ఎమ్మెల్యేలు సైతం చెక్కుల కోసం ఈయననే ఆశ్రయించేవారని తెలుస్తోంది.

ఎవరు అర్హులంటే..

పేదరికాన్ని అనుభవిస్తూ, దురదృష్టవశాత్తూ అనారోగ్యం పాలై, చికిత్స చేయించుకునేందుకు తగిన ఆర్థిక స్తోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చేస్తూ వస్తోంది. సాధారణంగా ఆరోగ్యశ్రీలో కవర్ కాని వ్యాధుల బారిన పడి, అప్పోసప్పో చేసి ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న వారికి ప్రభుత్వం తనవంతుగా కొంత ఆర్థిక సాయం చేయటం ద్వారా వారిని ఆదుకోవటం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇలా చికిత్స చేయించుకున్న వారు సదరు ప్రైవేటు హాస్పిటల్ బిల్లులను స్థానిక ఎమ్మెల్యేకు సమర్పిస్తే, వారు అక్కడి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపుతారు. అక్కడి త్రీమెన్ కమిటీ ఆ బిల్లులు పరిశీలించి, ఎంత సాయం చేయవచ్చనే అంశాన్ని పరిశీలించి, నిర్ణీత మొత్తం ఆర్థికసాయాన్ని ఆమోదిస్తుంది. తర్వాత ఆ సాయం మొత్తాన్ని చెక్కురూపంలో తయారుచేసి, స్థానిక ఎమ్మెల్యేకు పంపగా, ఆయన చేతుల మీదగా రోగి కుటుంబ సభ్యులకు అందిస్తారు. తెల్లరేషన్‌ కార్డు కలిగిన వ్యక్తుల ఉన్న పేదలు స్తోమతకు మించి ప్రయివేటు హాస్పిటళ్లలో ఖర్చు పెట్టి చికిత్స చేయించుకుంటే.. అందుకు సంబంధించిన పూర్తి బిల్లులను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ముందుగా బాధితులు ఎమ్మెల్యేకు దరఖాస్తు చేసుకుంటే వారు సీఎంవోకు పంపుతారు. అక్కడ సీఎంఆర్‌ఎఫ్‌ సెక్షన్‌లోని త్రీమెన్​కమిటీ దీనిని పరిశీలించి, ఆర్థిక సాయం మంజూరు చేస్తుంది. ఆ తరువాత ఆ చెక్కులను ఎమ్మెల్యేల చేతుల మీదుగా బాధితులకు అందజేస్తారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...

Hyderabad: గుండె ‘చెరువు’ అవుతోంది

దురాక్రమణదారుల కబ్జా కోరల్లో నగర చెరువులు టీ.సర్కార్ వెబ్ సైట్ లో కేవలం 19,314 చెరువుల సమాచారం చెరువుల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించిన గత పాలకులు ఉన్న చెరువులనైనా కాపాడుకోవడానిక...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...