Is The Politics Of Defection Justified In A Democratic System: భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల కోసం కాకుండా పవర్ కోసమే పథకాలు పుట్టుకొస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియను ఐదేళ్ల కాంట్రాక్ట్ గానే పార్టీలు చూస్తున్నాయి. కార్పొరేట్ విధాన రాజకీయాలని అన్ని పార్టీలు అనుసరిస్తున్నాయి. ఇంతకూ మన దేశంలో భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలను చదివిన నాయకులు ఎందరు. పార్లమెంటులో శాసనసభల్లో వందలాది మంది ఎలా కోట్ల ఆస్తులను పడగలెత్తారని ఏడీఆర్ నివేదికలు ప్రశ్నిస్తున్నాయి. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుంది. ధనిక వర్గాల సమాజాలు వారి వెంటనే నేర చట్టాల్ని, వాటిని సమర్థించే శక్తుల్ని ఎలా సృష్టించుకుంటూ పోతాయో కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఫిరాయింపులు కామన్ అయిపోయాయి. ఏ నేత ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకే, మార్పు రావాలి. ముందు జనం మారాలి. ఫిరాయింపుదారులను ప్రోత్సహించే పార్టీలను మార్చాలి. అలాంటి నాయకులకు బుద్ధి చెప్పాలి.
భారతదేశ రాజకీయ వ్యవస్థలో రాజకీయ పార్టీలు, ఎన్నికల సంఘం ఇచ్చిన సమాచారం ప్రకారంగా దేశంలో 6 జాతీయ పార్టీలు, 54 ప్రాంతీయ పార్టీలు, అదేవిధంగా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గుర్తింపు పొందని పార్టీలు 2, 597 ఉన్నట్లు తేలింది. నిన్న మొన్నటి దాకా సాధారణంగా ఉన్న ప్రపంచం మొత్తంగా మారిపోయింది. ఒక్కసారిగా వీఐపీగా మారిపోవడం అంటే మామూలు విషయం ఏమీ కాదు. అందరూ తెగ మర్యాదలు కుమ్మరిస్తున్నారు. మొన్నటిదాకా మా ఊర్లో నన్ను ఎవరు పెద్దగా పట్టించుకొనే వారు కాదు. కొన్ని రోజులుగా పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే, అర్థమవ్వడం లేదు. రోడ్డుపై వెళుతుంటే సర్పంచి కూడా పలకరించాడు. ఏమయ్యా బాగున్నావా ఇంట్లో అందరూ కులాసానే అని ఆప్యాయంగా అడిగాడు. రెండు చేతులూ జోడించి మరీ దండం పెట్టాడు. నాకే ఎందుకో చాలా సంతోషం వేసింది. మొన్నటిదాకా ఎదురుపడి సమస్కారం పెట్టి పలకరించినా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయేవారు, ఎక్కడికి వెళ్తున్నావ్, ఇంకా ఏంటి సంగతులు అంటూ దగ్గరికి వచ్చి పలకరిస్తున్నారు. అందరూ దగ్గరైనట్లుగా పలకరిస్తున్నారు. నా తోటి వాడికి అదొక మహా గొప్ప అనుభూతి. మాటల్లో చెప్పడం కష్టం. ఆస్వాదించాల్సిందే. భారత రాజకీయాలు దేశ రాజ్యాంగంలోని చట్రంలో పని చేస్తాయి. భారతదేశం పార్లమెంటరీ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. దీనిలో భారత రాష్ట్రపతి దేశాధినేత, భారతదేశ ప్రథమ పౌరుడు, ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత. రాజ్యాంగంలోనే ఈ పదాన్ని ఉపయోగించనప్పటికీ, ఇది ప్రభుత్వ సమాఖ్య నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. భారతదేశం ద్వంద్వ రాజకీయ వ్యవస్థను అనుసరిస్తుంది. అంటే ఫెడరల్ స్వభావం, ఇది కేంద్రంలో కేంద్ర అధికారం సరిహద్దులో రాష్ట్రాలను కలిగి ఉంటుంది. రాజ్యాంగం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంస్థాగత అధికారాలు పరిమితులను నిర్వచిస్తుంది. ఇది బాగా గుర్తించబడింది.
లోక్ సభలో 543 మంది సభ్యులు ఉన్నారు. వీరు 543 ఏక-సభ్య నియోజకవర్గాల నుండి బహుత్వ ఓటింగ్ (పదవికి ముందు) పద్ధతిని ఉపయోగించి ఎన్నికయ్యారు. రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 233 మంది రాష్ట్ర శాసనసభల సభ్యులచే బదిలీ చేయదగిన ఒకే ఓటు ద్వారా పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నికయ్యారు. 12 మంది ఇతర సభ్యులు భారత రాష్ట్రపతిచే ఎన్నుకోబడతారు. ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల ద్వారా ఆయా దిగువ సభలలో మెజారిటీ సభ్యులను పొందే పార్టీల ద్వారా ఏర్పడతాయి. భారతదేశం 1951లో మొదటి సార్వత్రిక ఎన్నికలను నిర్వహించింది. ఇందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలుపొందింది. ఇది స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిన 1977 వరకు తదుపరి ఎన్నికలలో ఆధిపత్యం వహించిన రాజకీయ పార్టీ. 1990వ దశకంలో ఒకే పార్టీ ఆధిపత్యం ముగిసింది. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 17వ లోక్‌సభ ఎన్నికలను భారత ఎన్నికల సంఘం 11 ఏప్రిల్ 2019 నుండి 19 మే 2019 వరకు ఏడు దశల్లో నిర్వహించింది. భారతీయ జనతా పార్టీ లోక్ సభలో మెజారిటీని సాధించగలిగడంతో ఆ ఎన్నికలు మరోసారి దేశంలో ఒకే పార్టీ పాలనను తీసుకొచ్చాయి.
Also Read:ప్రాథమిక విద్యను ఇకనైనా పట్టించుకోరూ..!
1967లో భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి ప్రాంతీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం. భారత జాతీయ కాంగ్రెస్ కాకుండా ఒక రాష్ట్రంలో స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి పార్టీ ఇది. భారతదేశం బహుళ-పార్టీ వ్యవస్థను అనుసరిస్తుంది. అంటే దేశంలో జాతీయ స్థాయిలో రెండు కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు ఉన్నాయి. భారతదేశంలో, జాతీయ స్థాయిలో ప్రాంతీయ రాజకీయ పార్టీలలో అనేక పార్టీలు ఉన్నాయి. భారత ఎన్నికల సంఘం వాటిని గుర్తించింది. ఒక పార్టీ లోక్ సభ ఎన్నికల్లో లేదా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లను సాధించి, లోక్ సభలో కనీసం నాలుగు సీట్లు గెలుచుకున్నప్పుడు అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది. ఒక రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికలలో మొత్తం ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లను సాధించి కనీసం రెండు స్థానాలను గెలుచుకున్న పార్టీ, రాష్ట్ర పార్టీ లేదా ప్రాంతీయ పార్టీగా గుర్తించబడుతుంది. భారతదేశంలో రాజ్యాధికారం, గుర్తింపు, స్వయం ప్రతిపత్తి అభివృద్ధి ఆధారంగా ప్రాంతీయ పార్టీలు సృష్టించబడ్డాయి.
దేశంలోని రాజకీయ వ్యవస్థలో నెలకొన్న పరిస్థితులను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రజాస్వామిక పాలన యంత్రాంగం పూర్తిగా రాజకీయ నాయకుల జేబులో చిల్లర డబ్బులుగా భావిస్తున్నారు. అయితే, ఇటీవల పాలన సాగించే సివిల్ సర్వెంట్లను ప్రచార సాధనాలుగా ఉపయోగించుకునేలా, దేశంలో 765 జిల్లాలకు జాయింట్ సెక్రెటరీ లేదా అంతకన్నా తక్కువ స్థాయి అధికారులను ప్రచారకులుగా నామినేట్ చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంపై కేంద్ర మంత్రిమండలి మాజీ కార్యదర్శి కేఎం చంద్రశేఖర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను పాలకులు తమ సొంత ఆస్తులుగా పరిగణిస్తూ వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తే దేశంలో, రాష్ట్రాలలో, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో నెలకొన్న పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అయితే, పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని నిరోధించలేని ప్రజాస్వామ్య వ్యవస్థ అధికార రాజకీయ పార్టీలకు బంగారు బాతుగా మారుతుంది. అసలే రాజకీయాలను విలువలు లేకుండా అడుగంటుతున్న సమయంలో ఫిరాయింపుల వ్యవస్థ రోజురోజుకు పెరిగిపోతోంది. దీన్ని బట్టి చూస్తే ఏ రాజకీయ వ్యవస్థలో డబ్బు అధికంగా ఉండి ఆర్థికంగా బలమైన రాజకీయ పార్టీగా చెప్పుకోబడడం కాకుండా ప్రచారంలో ఉంటే చాలు అన్నట్లుగా రాజకీయ వ్యవస్థను మారింది. ఒక సామాన్యుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో పోటీ చేసి గెలిచే అవకాశం లేకుండా పోయింది. ఖరీదైన రాజకీయ వ్యవస్థ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే, పార్టీ జంపింగ్‌లను ప్రోత్సహిస్తున్న రాజకీయాలను, పార్టీలను ప్రజలు పూర్తిగా ప్రజాస్వామ్యం నుండి దూరం చేయాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఈ విషయంపై స్పష్టమైన అవగాహనతో ఓటు హక్కును వినియోగించుకోవాలని, లేదంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల వ్యవస్థ అంగట్లో సరుకు అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు నిజాయితీపరులకు, నిబద్ధత గల వ్యక్తులకు రాజకీయాలలో అవకాశం కల్పించాలి. అప్పుడే ప్రజాస్వామ్య మనుగడ సాగుతుంది.
-డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి (కాకతీయ విశ్వవిద్యాలయం)