Saturday, May 18, 2024

Exclusive

World : రగులుతున్న ఇరాన్-ఇజ్రాయెల్

  • ప్రతీకార దాడులకు పాల్పడిన ఇజ్రాయెల్
  • దమ్ముంటే తమ దేశాన్ని టచ్ చేసిచూడండన్న ఇరాన్ అధ్యక్షుడు
  • ఆ మర్నాడే క్షిపణులతో దాడులు మొదలు పెట్టిన ఇజ్రాజెల్
  • ఇస్ఫహాన్ ను టార్గెట్ చేసిన ఇజ్రాయెల్
  • ఇరాన్ అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్
  • మధ్యలోనే కూల్చివేసిన ఇజ్రాయెల్ డ్రోన్ల ను కూల్చివేసిన ఇరాన్ సైన్యం
  • గత వారం ఇరాన్ డ్రోన్ల దాడికి ప్రతీకారం తీర్చుకున్న ఇజ్రాయెల్
  • ఇజ్రాయెల్ డ్రోన్లు పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్న ఇరాన్ విదేశాంగ మంత్రి

 

Iran Israel Missile Drone Attacks : మొత్తానికి ఇజ్రాయెల్ అంతా ఊహించినట్లుగానే బాంబు పేల్చింది. ఇరాన్ పై వ్యూహాత్మక దాడులకు తెగబడింది. వరుసగా క్షిపణులు ప్రయోగించింది.  తెల్లవారుజాము నుంచే ఈ ఆపరేషన్ మొదలెట్టింది. భారీ శబ్దాలు వినిపించినట్లు స్థానిక ఇరాన్ మీడియా సైతం ఈ వార్తను బలపరిచింది. తమ దేశాన్ని ఇంచి మేర టచ్ చేసినా ఇజ్రాయెల్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్ ప్రధాని చెప్పారు. అలా స్టేట్ మెంట్ ఇచ్చిన మరుసటి రోజే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. రాన్ లోని ఇస్ఫహాన్ నగరంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఇస్ఫహాన్ ఇరాన్ అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది. అతిపెద్ద సైనిక శిబిరం కూడా ఈ నగరంలో ఉంది. మరోవైపు ఇరాన్ తన గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్టు అక్కడి అధికార మీడియా ఐఆర్ఎన్ఏ తెలిపింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను సైతం యాక్టివేట్ చేసింది.

మధ్యలోనే పేల్చివేసిన ఇజ్రాయెల్ డ్రోన్లు

ఇజ్రాయెల్ ప్రయోగించిన పలు డ్రోన్లను మధ్యలోనే కూల్చివేసినట్టు ఇరాన్ తెలిపింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ మిస్సైల్ ను ప్రయోగించలేదని వెల్లడించింది. ఇరాన్ పై దాడులకు సంబంధించి ఇప్పుడు ఎలాంటి ప్రకటన చేయలేమని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఉన్న ఖొమైనీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును పూర్తిగా మూసివేశారు. విమాన రాకపోకలను ఆపివేశారు. ఇరాన్ కు వస్తున్న ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ విమానాలు మార్గమధ్యంలోనే వెనక్కి తిరిగాయి. గత వారాంతంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ వందలాది డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. వీటన్నింటిని ఇజ్రాయెల్ నిర్వీర్యం చేసింది. ఈ దాడులకు ప్రతీకారంగానే ఈ తెల్లవారుజామున దాడులకు దిగింది. ప్రస్తుత పరిణామాలతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు యుద్ధానికి దారి తీస్తాయేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇరాన్‌ అణుకేంద్రాల భద్రత ప్రశ్నార్థకం

ప్రపంచంలో మెరుగైన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఎస్‌-300 ఒకటి. ఎలాంటి క్షిపణినైనా పసిగట్టి కూల్చేయగల సామర్థ్యం దీని సొంతం. అలాంటి వ్యవస్థనే ఇజ్రాయెల్‌ క్షిపణులు ధ్వంసం చేశాయని న్యూయార్క్‌ టైమ్స్‌ (ఎన్‌వైటీ) ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే వాస్తవమైతే ఇరాన్‌ అణుకేంద్రాల భద్రత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్‌ అణుకేంద్రాలకు ఎస్‌-300లే కాపలా. పత్రిక కథనం ప్రకారం.. దీని రాడార్‌ వ్యవస్థకే దొరకకుండా ఇజ్రాయెల్‌ క్షిపణి ప్రయోగించిందని, అది నతాంజ్‌ అణుకేంద్రానికి కాపలాగా ఉన్న ఎస్‌-300 వ్యవస్థను ధ్వంసం చేసిందని చెబుతోంది. రాడార్లకు దొరకకుండా ఇరాన్‌లోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించగల సామర్థ్యం తమకు ఉందని టెల్‌ అవీవ్‌ నిరూపించుకుందని రక్షణరంగ నిపుణులు అంటున్నారు. ఈ క్షిపణిని యుద్ధ విమానం నుంచి ప్రయోగించినట్లు ఆ పత్రిక పేర్కొంది.

ఆ డ్రోన్లు మాకు ఆటబొమ్మలు
ఇస్ఫహాన్‌ నగరంపై జరిగిన దాడిపై ఇరాన్‌ విదేశాంగమంత్రి హుసేన్‌ అమీర్‌ అబ్దుల్లాహియాన్‌ స్పందించారు. ‘‘గత రాత్రి జరిగింది దాడి కాదు. అవి డ్రోన్లు కూడా కాదు. మా పిల్లలు ఆడుకొనే ఆటబొమ్మల్లా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ‘ఎన్‌బీసీ’ న్యూస్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఇజ్రాయెల్‌ వ్యవహరిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

అమెరికా డబుల్ గేమ్

ఇరాక్‌లోని ఇరాన్‌ అనుకూల పాపులర్‌ మొబిలైజేషన్‌ ఫోర్సెస్‌(పీఎంఎఫ్‌) సైనిక స్థావరంపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరాన్‌ మద్దతు ఉన్న షియా మిలిటెంట్‌ సంస్థల్లో పీఎంఎఫ్‌ ఒకటి. ఇటీవల కాలంలో ఇరాక్‌, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై పీఎంఎఫ్‌ గ్రూప్‌ సభ్యులు దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా మాత్రం ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఇరాక్‌ విచారణ చేపట్టింది. యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌లకు అమెరికా భారీ ఆర్థిక సాయం అందించనుంది. అమెరికా చట్ట సభ 95 బిలియన్‌ డాలర్ల సాయానికి ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం సభలో డెమోక్రాట్లు, రిపబ్లికన్లు చేతులు కలిపారు. ఉక్రెయిన్‌కు 61 బిలియన్‌ డాలర్లు, ఇజ్రాయల్‌కు 26 బిలియన్‌ డాలర్లను, మిగిలిన వాటిని గాజాలో మానవతా సాయానికి అమెరికా అందించనుంది.

Publisher : Swetcha Daily

Latest

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్...

Vijayashanthi: కిషన్ రెడ్డిపై విజయశాంతి ట్వీట్ వైరల్.. రాములమ్మ ఏం చెప్పాలనుకున్నారు?

Telangana: విజయశాంతి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది....

Don't miss

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

BRS: కవితతో బాల్క సుమన్, ఆర్ఎస్పీ ములాఖత్.. ప్రభుత్వ పాలసీపై కేసు పెడితే..!

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్...

Vijayashanthi: కిషన్ రెడ్డిపై విజయశాంతి ట్వీట్ వైరల్.. రాములమ్మ ఏం చెప్పాలనుకున్నారు?

Telangana: విజయశాంతి చేసిన ఓ ట్వీట్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది....

United Kingdom:బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి

UK parliament candidate of Labour party Telangana region person participate: యునైటెడ్ కింగ్ డమ్ బ్రిటన్ లో ఎన్నికల సందడి మొదలయింది. అనూహ్యంగా ఈ సారి బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో...

World News: డెంగ్యూతో ఇక భయం లేదు

A new vaccine for dengue received prequalification from the WHO: ప్రతి ఏటా డెంగ్యూ బారిన పడి పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ కు డెంగ్యూ పెద్ద ప్రమాదకారిగా...

Pakistan:మండుతున్న పీఓకే

POK public fire on Pakistan government about Increase prices daily needs: మరోసారి పీవోకేలో హింస చెలరేగింది. నిరసనకారులు రెచ్చిపోయారు. పాక్ లో రోజురోజుకూ పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలతో కుదేలయిన జనం...