IPL 2024 RCB logo change, understand Raja
స్పోర్ట్స్

RCB Logo : ఆర్‌సీబీ లోగో ఛేంజ్, అర్థమైందా రాజా..?

RCB Logo Change Video Viral : ఐపీఎల్‌ 2024కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ సీజన్‌లో తమ ఫ్రాంచైజీ పేరులో మార్పులు చేయనున్నట్లుగా క్లూ ఇచ్చింది. ఈ మేరకు కాంతారా ఫేమ్‌ రిషబ్ శెట్టి చేసిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ లీగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు ఆర్‌సీబీ. దీంతో ఆర్‌సీబీ పేరు మారుస్తే లక్‌ కలిసొస్తుందా అంటూ ఫ్యాన్స్ రకరకాలుగా పేర్కొంటున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఇందులో ఏమాత్రం అనుమానం అవసరం లేదు. ఎందుకంటే లీగ్ స్టార్టింగ్‌ నుండి పాల్గొంటున్న ఈ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్‌ని గెలవలేకపోయింది. అయితేనేం.. ఆ జట్టు ఫ్యాన్స్‌ తీరే వేరు. తమ అభిమాన జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడినా.. ఫుల్‌ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్‌లోనూ ఈ ప్రాంఛైజీ జట్టుకు అదే రేంజ్‌లో సపోర్ట్ లభిస్తోంది.

Read More: హార్ధిక్‌ పాండ్యాపై భారత మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

అయితే గత 16 ఏళ్లుగా ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినా ఆర్‌సీబీ.. ఈసారి మాత్రం పేరులో మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హీరో రిషబ్‌ శెట్టితో ఓ వీడియోని చేయించినట్లు తెలుస్తోంది.ఇంతకీ ఈ యాడ్‌లో ఏముందనే కదా మీ డౌట్‌…ఆర్‌సీబీ రిలీజ్ చేసిన వీడియోలో రిషబ్‌శెట్టి అచ్చమైన కన్నడ యువకుడిగా కనిపిస్తాడు.

అందులో మూడు దున్నపోతులు కూడా మనకి కనిపిస్తాయి. వాటిలో ఒకదానిపై రాయల్ అని ఉండగా.. మరొక దానిపై బెంగళూరు అని రాసి ఉన్న దున్నను అక్కడి నుండి తీసుకెళ్లాలని ఈ వీడియోలో చెబుతాడు. అక్కడున్న వారు ఆ దున్నపోతును తీసుకెళ్లిన తరువాత.. మీకు అర్థమైందా అని నవ్వుతూ అడుగుతాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్న ఆర్‌సీబీ.. రిషబ్‌శెట్టి ఏం చెబుతున్నాడో మీకు కూడా అర్థమైందా అనే పోస్ట్‌ ట్యాగ్‌ని ఇందులో యాడ్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాల పోస్ట్‌లు పెడుతూ ఆర్‌సీబీకి ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నారు.