ipl 2024 Bhumra and kohli
స్పోర్ట్స్

IPL 2024: ప్లేయర్స్ హిట్..టీమ్స్ ఫట్

IPL 2024 Players getting Orange , purple caps but Teams least performance: సంచలనాలకు వేదికగా మారిన ఐపీఎల్ 2024 లో ఓ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. విషయం ఏమిటంటే ప్లేయర్స్ మెరుగైన ఆట తీరు కనబరుస్తుంటే టీమ్ మాత్రం అడ్డగోలుగా ఫెయిలవుతూ వస్తోంది. ఆటగాళ్లు హిట్ టీమేమో ఫట్ అన్నట్లు గా తయారయింది. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ల విషయంలో పాయింట్స్ టేబుల్ పట్టికలో క్యాప్స్ కు అర్హత పొందిన ఆటగాళ్లు ఉన్న జట్టు మాత్రం పాయింట్స్ పట్టికలో చివరి స్థానాలలో కొనసాగడం విచిత్రంగా ఉందంటున్నారు క్రికెట్ క్రీడాభిమానులు. . KKR జట్టు ఇప్పుడు నంబర్ వన్‌గా మారింది. ఇది కాకుండా, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, జట్లు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కాగా, పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ వంటి జట్లు అట్టడుగున ఉన్నాయి. ఆర్సీబీ ప్రస్తుతం 7వ స్థానంలో ఉండగా, ముంబై 10వ స్థానంలో ఉంది.

ఆరెంజ్ క్యాప్‌లో విరాట్, పర్పుల్ క్యాప్‌లో బుమ్రా అగ్రస్థానం..

ఇప్పుడు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ జాబితాను పరిశీలిద్దాం. ఆరెంజ్ క్యాప్‌లో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ అతనే. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన అతను 542 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన పర్పుల్ క్యాప్ అంటే బౌలర్ల జాబితాలో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 11 మ్యాచ్‌ల తర్వాత 18 వికెట్లు సాధించాడు. 16.11 బౌలింగ్ సగటుతో తీశాడు. హర్షల్ పటేల్ 17 వికెట్లను బుమ్రా తర్వాత స్థానంలో ఉన్నాడు. అయితే అతని బౌలింగ్ సగటు 21.29గా మారింది. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆటగాళ్లు, వారి జట్లు ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో దారుణంగా తయారయ్యాయి. విరాట్ కోహ్లి పేరు మీద అత్యధిక పరుగులు ఉన్నప్పటికీ అతని జట్టు ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. అదేవిధంగా, బుమ్రా, హర్షల్ పటేల్ అత్యధిక వికెట్లు తీసిన ఇద్దరు బౌలర్లు అయితే ఐపీఎల్ 2024లో, వారి జట్లు 10 మరియు 8 స్థానాల్లో ఉన్నాయి. అంటే, ఆటగాళ్ళు విజయవంతమయ్యారు. కానీ, వారి జట్ల ప్రదర్శన చాలా బలహీనంగా ఉంది. దీంతో ఐపీఎల్ 2024 నుంచి నిష్క్రమించే ప్రమాదంలో ఆయా జట్లు నిలిచాయి.