Canada's attacks on Pakistan's temples, a key decision in the United Nations
అంతర్జాతీయం

UN : కెనడా, పాక్ దేవాలయాల దాడులపై భారత్‌ రియాక్షన్

India’s Voice on Attacks on Canadian and Pakistani Temples : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఇస్లామోఫోభియాపై పోరాడాలనే తీర్మానంపై అన్ని దేశాలతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ తన గొంతును గట్టిగానే వినిపించింది. కేవలం అబ్రహమిక్‌ మతాలకు సంబంధించిన వ్యక్తులు, మతపరమైన ప్రదేశాలే టార్గెట్‌గా కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బౌద్ధ ఆరామాలు, హిందూ దేవాలయాలు, సిక్కు గురుద్వారులపై దాడులు జరుగుతున్నాయని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోచ్ ఆరోపించారు. మత ప్రాతిపదికన వివక్ష గురించి మాట్లాడటం ద్వారా కెనడా పాకిస్థాన్‌ల గురించి భారతదేశం వెల్లడించింది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ కెనడాలో పెద్ద సంఖ్యలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ. మొదటి ప్రపంచ యుద్దం తరువాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించుటలో విఫలమగుటచే దానికి ప్రత్యామ్నాయముగా 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతం 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్ళకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు.

Read More: ఐరన్‌ లంగ్స్‌ వ్యక్తి అకాల మృతి, శోకసంద్రంలో ఫ్యాన్స్

ఇక ఇదిలా ఉంటే….ఇస్లామోఫోబియాను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక తీర్మానాన్ని తీసుకువచ్చారు. 115 దేశాలు ఈ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశాయి. అయితే 44 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇస్లామోఫొబియాతో పాటుగా అన్ని మతాలను ప్రస్తావిస్తూ.. భారత్‌దేశం అన్ని మతాలకు అండగా నిలుస్తుందని భారతదేశం తరపున రుచిరా కాంబోచ్ పేర్కొంది. ఇస్లామోఫోబియాతో పోరాటానికి మాత్రమే చర్యలు తీసుకుంటే.. ఇతర మతాలపై దాడులను విస్మరిస్తే.. అది అందరిని కలుపుకొని సమానంగా పరిగణించబడిందన్నారు. ఈరోజు తీసుకొచ్చిన ప్రతిపాదన ప్రకారం… అన్ని మతాలపై జరుగుతున్న అకృత్యాలపై దృష్టి సాధించేందుకు వివిధ దేశాలతో కలిసి ఓ నిర్ణయం తీసుకునేందుకు ఎంతగానో అవకాశం ఉందని రుచిరా కాంబోచ్ చెప్పుకొచ్చారు.