Monday, October 14, 2024

Exclusive

National news:ఈ సారి మార్పు తప్పదా?

  • మోదీ హ్యాట్రిక్ ఆశలకు గండి కొడుతున్న ఇండియా కూటమి
  • ఎన్నికల ముందు తక్కువ అంచనా వేసిన మోదీ
  • క్రమంగా కాంగ్రెస్ కు పెరుగుతున్న ప్రాంతీయ పార్టీల మద్దతు
  • ఎన్నికలలో ప్రభావం చూపనున్న రాహుల్ గాంధీ జోడో యాత్ర
  • 2014 కన్నా.. 2024 లో రాహుల్ గాంధీలో పెరిగిన ఆత్మవిశ్వాసం
  • ఉత్తరాది, దక్షిణాదిలోనూ భారీగా పుంజుకుంటున్న కాంగ్రెస్
  • ఆరు విడతల ఓటింగ్ లో మార్పు కోరుకుంటున్న ఓటర్లు
  • మోదీ వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారని భయపడుతున్న ప్రజలు

Indian voters wants to change the leadership of country Rahul:
రెండు పర్యాయాలు మోదీకి ఛాన్స్ ఇచ్చిన దేశ ప్రజలు ఈ సారి రాహుల్ వైపు చూస్తున్నారా? రాహుల్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామా అనే భావనలో ఉన్నారా? గతంలో కన్నా ఈ సారి కాంగ్రెస్ లో కదనోత్సాహం కనిపిస్తోందా? ఇండియా కూటమి సీట్ల విషయంలో సర్ధుబాట్లు చేసుకోకపోయినా..పరోక్షంగా కాంగ్రెస్ కు అండగా ఉంటామని చెబుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మోదీ వెర్సెస్ రాహుల్ అనే చర్చ మొదలయింది. జూన్ 1న తుది విడత ఎన్నికలు పూర్తి కాగానే ఎవరెవరికి ఎంతెంత రావచ్చనేది ఎగ్జిట్ పోల్స్ చెప్పనున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్పేవాటిని పూర్తిగా విశ్వసించలేము. తుది ఫలితాల దాకా వేచిచూడాల్సిందే.

రాహుల్ లో పెరిగిన ఆత్మవిశ్వాసం

ఇప్పటికే రెండు సార్లు బీజేపీకి ఛాన్స్ ఇచ్చిన దేశం ఈసారి రాహుల్ వైపు చూస్తుందా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. భారత్ జోడో యాత్రలో రాహుల్ సామాన్య ప్రజల్లో కనెక్ట్ అయిన విధానం ఆ మీదట ఆయన ప్రసంగాలలో వచ్చిన మార్పు, 2014తో పోలిస్తే 2024 నాటికి రాహుల్ లో కనిపిస్తున్న ఆత్మవిశ్వాసం స్సష్టంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. అలాగే ప్రసంగాలలో సైతం పరిపక్వత కనిపిస్తోంది. ముఖ్యంగా మోదీని రాజకీయంగా ప్రచారాస్త్రాలతో ఢీ కొట్టిన తీరులో వచ్చిన మౌలికమైన మార్పులు ఇవ్వన్నీ జనంలో చర్చగా ఉన్నాయి. ఈసారి ఇండియా కూటమికి ఒక్క చాన్స్ ఎందుకు ఇవ్వకూడదు అన్నది ఉత్తరాదిన కొంత వినిపిస్తుంది అని అంటున్నారు. సౌత్ ఇండియాలో ఎటూ ఇండియా కూటమికి బలం ఉంది. కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాళాలో కలుపుకుంటే ఇండియా కూటమికి 80కి పైగా ఎంపీ సీట్లు రావచ్చు అని ఒక అంచనా ఉంది.

గట్టిపోటీ ఇవ్వనున్న ఇండియా కూటమి

ఇక ఉత్తరాదిన మహారాష్ట్ర, బీహార్ యూపీ ఉత్తరాఖండ్ రాజస్థాన్ లలో కూడా కూటమికి ఆదరణ మొదలైంది అని అంటున్నారు. యూపీలో ఈసారి కనీసంగా ఇరవై నుంచి పాతిక దాకా ఎంపీ సీట్లు ఇండియా కూటమి సాధిస్తుంది అని లెక్క వేస్తున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ మహారాష్ట్రలలో కూడా బీజేపీకి గట్టి దెబ్బ పడుతుందని అంటున్నారు. మరో వైపు చూస్తే యూపీలో బీజేపీకి 2019 నాటికే 80 సీట్లకు 62కి నంబర్ పడింది. ఇది 2014లో వచ్చిన 71 సీట్లకు తొమ్మిది తక్కువ. ఈసారి కూడా తగ్గుతుంది అని అంటున్నారు. బీహార్ లో కూడా 2019 నాటికే సీట్లు తగ్గాయి. ఈసారి ఇండియా కూటమి సవాల్ చేస్తోంది అని అంటున్నారు. ఇవన్నీ చూసిన మీదట ఇండియా కూటమికి 200 కంటే ఎక్కువ ఎంపీలు వచ్చే చాన్స్ ఉంది అని అంటున్నారు.

గతంలో కన్నా మరిన్ని సీట్లు

ఢిల్లీ పంజాబ్ హర్యానా రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో కూడా ఇండియా కూటమికి కొంత అనుకూలంగా ఉందని అంటున్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గత ఏడాది అధికారంలోకి వచ్చింది. ఆ హవా కొనసాగుతోంది. అసోం లో బీజేపీ వ్యతిరేకత కాంగ్రెస్ కి అనుకూలం కానుంది. ఇవన్నీ చూసినపుడు కాంగ్రెస్ సెంచరీ ని కొట్టడం ఖాయమనే అంటున్నారు. కాంగ్రెస్ వంద, కూటమిలోని ఇతర పార్టీలు మరో వందా సీట్లు తెచ్చుకుంటే మాత్రం ఈసారి ఢిల్లీ పీఠం మీద పందెం కాయడం ఖాయమని అంటున్నారు. మెల్లగా దేశంలో మార్పు కనిపిస్తోంది అని అది ఇండియా కూటమి విజయం మీద ప్రభావం చూపిస్తే ఎంపీ సీట్లు ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. దేశంలో మార్పు రావాలని కేంద్రంలో కొత్త ప్రభుత్వం రావాలన్నది అంతర్లీనంగా ఉన్న ఒక భావన అని అంటున్నారు. అది ఓట్ల రూపంలో ఎంతవరకూ టర్న్ అయింది అన్న దానిని బట్టే జూన్ 4 తరువాత దేశ రాజకీయ ముఖ చిత్రం మారుతుంది అని అంటున్నారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

Telangana:పేరు మారనున్న ‘ములుగు’

ములుగు జిల్లా పేరు మార్పు కు కసరత్తు మొదలు పెట్టిన అధికారులు ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చాలని ప్రతిపాదన మంత్రి సీతక్క విజ్ణప్తితో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...