Indian Player Sehwag Emotional Post Goes Viral: టీ20 వరల్డ్ కప్ 2024 ఛాంపియన్‌గా భారత్ సరికొత్త హిస్టరీని నెలకొల్పింది. అయితే కప్‌ను కైవసం చేసుకున్న అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. నెక్స్ట్ తరానికి ఛాన్స్ ఇవ్వాలని డెసీషన్ తీసుకున్నట్లు రోహిత్, కోహ్లిలు ప్రకటించారు. దశాబ్దకాలం పాటు భారత విజయాల్లో ఈ ఇద్దరూ కీరోల్ పోషిస్తున్నారు.
అన్ని ఫార్మాట్లలో భారత బ్యాటింగ్‌కు మూలస్తంభాలుగా సేవలు అందిస్తున్నారు.ఈ క్రమంలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ గురించి మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఇద్దరిని కొనియాడుతూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. కోహ్లి ఇతర ఫార్మాట్లలో కూడా అదే జోరును కొనసాగించాలని ఆశించాడు. మరోవైపు రోహిత్ అన్ని టీ20 ప్రపంచకప్‌లు ఆడిన ఘనుడని, కెప్టెన్‌గా జట్టులో గొప్ప వాతావరణాన్ని సృష్టించాడని ప్రశంసించాడు. విరాట్ కోహ్లి గురించి ఏం చెప్పగలను? కోహ్లి అత్యుత్తమ టీ20 ప్రపంచకప్ బ్యాటర్.
Also Read: తుఫాన్‌లో చిక్కుకున్న టీమిండియా
2014,2016 టీ20 ప్రపంచకప్‌ల్లో క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. 2022లో మెల్‌బోర్న్‌లో టీ20 హిస్టరీలో నిలిచిపోయేలా పాకిస్థాన్‌పై ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లోనూ తన క్లాస్‌ను చూపించాడు. అతను సాధించిన రన్స్ కంటే ఆడే విధానం అతన్ని ప్రతిబింబిస్తోంది. తనకు మించిన రోల్స్ పోషించాడు. గురు దయ వల్ల ఇది సాధ్యమైంది. కోహ్లి టీ20 కెరీర్‌కు గొప్ప ముగింపు దక్కింది. మిగిలిన రెండు ఫార్మాట్లలో కూడా అతను గొప్ప ప్రమాణాలను కొసాగించాలని కోరుకుంటున్నాను. తనని తాను మలుచుకున్న తీరు పట్ల గర్వపడుతున్నా. భవిష్యత్‌లో కూడా అతనికి కలిసిరావాలని కోరుకుంటున్నానని సెహ్వాగ్ అన్నాడు.