Friday, November 8, 2024

Exclusive

Huge Scam | వేల కోట్ల ‘వ్యాట్’.. హాంఫట్

– తెలంగాణ మద్య అమ్మకాల్లో భారీ కుంభకోణం
– ఏళ్ల తరబడి సాగిన అవినీతి వ్యవహారం
– నేతలు, అధికారులు కుమ్మక్కు
– అమ్మకాలు పెరిగినా.. పెరగని వ్యాట్
– రెండు డిస్టిలరీల్లోనే రూ. 500 కోట్ల లీకేజీ
– మిగిలిన 17 డిస్టిలరీలపై సర్కారు నజర్
– సగం మద్యం బ్లాక్‌లో అమ్మినట్లు అనుమానాలు?
– ప్రభుత్వం మారగానే ఎక్సైజ్ పోర్టల్‌లో లెక్కలు గాయబ్..
– పూర్తి స్థాయి విచారణకు సిద్ధమవుతున్న సర్కార్

Huge Scam in Sale of Alcohol in Telangana, Thousands Crores of VAT : తెలంగాణలో గత ఐదేళ్ల కాలంలో మద్యం అమ్మకాల వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని రుజువుచేసే అనేక వాస్తవాలు ఒక్కొక్కటే బయటికొస్తున్నాయి. మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన వేల కోట్ల పన్నులకు అక్రమార్కులు గండికొట్టారని తాజాగా జరిగిన ప్రాథమిక విచారణలో బయటపడింది. ఎంత మద్యం తయారు చేశారు? ఎంత అమ్మారు? వంటి గణాంకాలు గల్లంతు కావటం, దీనిపై వాణిజ్య పన్నుల శాఖ కూడా మౌనం వహించటం అనేక అనుమానాలకు తావిస్తోంది. నేతలు, వ్యాపారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు కలిసి ఒక పథకం ప్రకారం ఏళ్ల తరబడి ఈ అవినీతి వ్యవహారాన్ని నడిపించారని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది.

సాధారణంగా మద్యం అమ్మకాలు పెరిగే కొద్దీ, ప్రభుత్వానికి పన్నుల రూపంలో సమకూరే మొత్తం కూడా పెరుగుతుంది. కానీ, తెలంగాణలో ఇది రివర్స్ అయింది. అమ్మకాలు ఆకాశంలో ఉండగా, వాటి ద్వారా ఖజానాకు చేరాల్సిన వ్యాట్ మాత్రం నేల చూపులు చూసింది. 2021 నవంబరు, డిసెంబరు మాసాల్లో రూ.1,007 కోట్లు, రూ.1,536 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వ్యాట్‌ రూపంలో చేరాయి. కానీ, 2023 నవంబరు, డిసెంబరు మాసాల్లో కేవలం రూ.1,021 కోట్లు, రూ.1,388 కోట్లు మాత్రమే వ్యాట్‌ రూపంలో ఖజానాకు చేరింది. సాధారణంగా పండుగలు, ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతుంటాయి. ముఖ్యంగా ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచీ మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగినా, పన్ను ఎందుకు తగ్గిందనే కోణంలో ప్రభుత్వం చేయించిన ప్రాథమిక విచారణలో పలు అనుమానాస్పద విషయాలు బయటికి వచ్చాయి.

Read Also : తెలంగాణలో ఎన్నికల ‘తీన్‌’మార్

విచారణలో భాగంగా రాష్ట్ర వాణిజ్య శాఖ అధికారులు రెండు డిస్టిలరీల్లోని రికార్డులను తనిఖీ చేశారు. మొత్తం ఎంత మద్యం తయారు చేశారు? తయారీకి వాడిన ముడిపదార్ధాలు, డీ.. మినరలైజ్డ్ వాటర్ పరిమాణం వంటి లెక్కలను పరిశీలించగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే 123.82 లక్షల లీటర్ల మద్యాన్ని పన్ను చెల్లించకుండా బయటి మార్కెట్‌లో అమ్మేశారని నిర్ధారణ అయింది. ఈ రెండు డిస్టిలరీల్లో జరిగిన అక్రమాల కారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 528.75 కోట్ల వ్యాట్ ఖజానాకు చేరకుండా పోయిందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు లెక్కతేల్చారు. ఈ రెండు ఈ రెండు డిస్టిలరీల్లో ‘ఓవర్‌టైం రిలాక్సేషన్‌’(మినహాయింపు) ఇచ్చి అదనపు మద్యం తయారీకి గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన విషయమూ తాజాగా బయటపడింది. దీంతో ఆ రెండు డిస్టిలరీల్లో తయారైన మద్యం మీద వ్యాట్‌ ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.
అమ్మకాలతో పొంతనే లేదు.

మరోవైపు.. 2018లో తెలంగాణ ప్రభుత్వానికి మద్యం అమ్మకాల మీద వచ్చిన ఆదాయం రూ. 20,012 కోట్లు కాగా, 2021 నాటికి రూ. 30,222 కోట్లకు చేరింది. అంటే నాలుగేళ్లలో 50 శాతం అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. ఈ లెక్కన వ్యాట్ కూడా అదే నిష్పత్తిలో పెరగాల్సి ఉన్నా, అది జరగలేదు. 2018 జులైలో మద్యం అమ్మకాల ద్వారా ఖజానాకు చేరిన వ్యాట్ మొత్తం రూ. 1200 కోట్లు కాగా, 2023 జులైలో మద్యం అమ్మకాలపై సర్కారుకు చేరిన వ్యాట్ మొత్తం రూ. 1260 కోట్లు మాత్రమేనంటే ఏ స్థాయిలో వ్యాట్‌ని లూటీ చేశారోనని అధికారులు ఆశ్చర్యపోతున్నారు.

మద్యం మీద వ్యాట్‌ను వసూలు చేస్తున్న ప్రభుత్వం, మిగిలిన అన్ని రకాల వస్తుసేవల మీద జీఎస్టీని విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణలో ఏటా జీఎస్టీ కింద వసూలవుతున్న మొత్తం 18 శాతం మేర పెరుగుతూ పోతోంది. మరోవైపు ఏటికేటు మద్యం తయారీ, అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నా వాటి ద్వారా ఖజానాకు చేరాల్సిన వ్యాట్ మాత్రం ఐదారు శాతానికి మించకపోవటంతో ఈ వ్యవహారంలో లోతుగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను ఆదేశించింది. దీంతో తెలంగాణలోని మిగిలిన 17 డిస్టిలరీల మీద సర్కారు దృష్టి సారించి, అక్కడి గణాంకాలను ఆరా తీస్తోంది.

Read Also : బయటకొస్తున్న బాధితులు

డిస్టిలరీలో తయారైన మద్యాన్ని రాష్ట్ర బేవరేజెస్ సంస్థ.. గోదాములకు చేర్చుతుంది. తరలింపుకు ముందు మద్యం విలువ, దాని మీద పడే వ్యాట్ ఎంత అనే వివరాలను బిల్లు మీద స్పష్టంగా రాసి, పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో మద్యం సీసా మీద వేసే లేబుల్, ఇతర సర్వీసుల మీద ప్రభుత్వానికి విడిగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఈ పద్ధతిని అమలు చేయకుండానే మద్యం గోదాములకు చేరుతోందనీ, డిస్టిలరీలు, బేవరేజెస్ సంస్థ అధికారులు, నేతల సమన్వయం లేకుండా ఇన్నేళ్ల పాటు ఈ వ్యవహారం సాగే అవకాశమే లేదని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారం మీద ప్రభుత్వం విచారణకు దిగే సరికి ఏటా ఎన్ని లీటర్ల మద్యం అమ్మారనే గణాంకాలను పబ్లిక్‌ డొమైన్‌(పోర్టల్‌) నుంచి ఎక్సైజ్‌ శాఖ తొలగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వివరాలు ఇవ్వండంటూ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయానికి ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాసినా అటు నుంచి మౌనమే సమాధానంగా ఉంది. ప్రభుత్వం మారగానే ఎక్సైజ్ అధికారులు ఈ లెక్కలను ఎందుకు దాస్తున్నారనే అనుమానాలూ ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర పోషించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌‌ ఇటు పాలిటిక్స్‌లో అటూ మూవీస్‌లో రాణిస్తున్నారు. రాజకీయాల్లో, సినిమాల్లో రెండింటిలో పవన్ కళ్యాణ్‌కు...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా ఈటలకు ప్రేమ తగ్గినట్టు లేదు - పార్లమెంట్‌లో బీఆర్ఎస్‌ను జీరో చేశామన్న రేవంత్ రెడ్డి Eatala Rajender: ఫిరాయింపులపై బీజేపీ ఎంపీ ఈటల...