– 43 డిగ్రీలు క్రాస్ అయిన ఉష్ణోగ్రతలు
– ఎండవేడికి అల్లాడుతున్న జనాలు
– మిట్ట మధ్యాహ్నం ఖాళీగా రోడ్లు
– ఆరెంజ్ అలర్ట్‌లో 15 జిల్లాలు
– ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా వడగాడ్పులు
– నెక్స్ట్ నాలుగైదు రోజులూ ఇదే పరిస్థితి
High Temperatures In Telangana Yellow Alert For 13 Districts: ఎండాకాలం వచ్చేసింది. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిజానికి మార్చిలోనే మొదలైన ఎండలు, ఇప్పుడు ఏప్రిల్ అలా మొదలైందో లేదో మరింత మంట పుట్టిస్తున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. కాలు బయట పెట్టేందుకు జనం జంకుతున్న పరిస్థితి. ప్రస్తుతం సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా భానుడు భగభగ మండుతున్నాడు. దీంతో జనం అల్లాడిపోతున్నారు.
తెలంగాణలో నెక్స్ట్ నాలుగైదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. వడగాల్పుల ముప్పు తీవ్రంగా ఉంటుందని అంటున్నారు. నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ లలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు ఏదైనా అవసరమైతేనే మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలని సూచిస్తున్నారు.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసులో గుట్టురట్టు చేసిన రాధా కిషన్ రావు
రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పుల నేపథ్యంలో ఉక్కపోతతో జనం ఇబ్బంది పడుతున్నారు. గాలిలో తేమ శాతం క్రమేపీ తగ్గడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈసారి ఎండాకాలంలో ఈ తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎండలో ఎక్కువ సమయం ఉండొద్దని సూచిస్తున్నారు. వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు అధికారులు.