Neha Sharma: తెలంగాణ రాజకీయాల్లో సినీ గ్లామర్ తగ్గింది. క్యాంపెయిన్‌లోనూ సినీ తారలు కానరావడం లేదు. కానీ, తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. యూపీలో పొలిటికల్ క్యాంపెయిన్‌ను గ్లామరస్‌గా మార్చేశారు. చిరుత సినిమాతో తెరంగేట్రం చేసిన బ్యూటీ నేహా శర్మ తండ్రి గెలుపు కోసం ప్రచారంలో మునిగితేలుతున్నారు. నేహా శర్మ ప్రచారంతో తండ్రికి జన సమీకరణ టెన్షన్ సగం తగ్గిపోయింది.
నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ యూపీలో భగల్‌పూర్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ పై బరిలో దిగారు. జేడీయూ అభ్యర్థి అజయ్ కుమార్‌తో పోటీ పడుతున్నారు. తండ్రి ఎన్నికల సంగ్రామంలో ఉండటంతో తనయ కూడా తన వంతు సహాయం చేయడానికి నడుం కట్టారు. కిషన్ గంజ్, బంకా, కటీహరా, పూర్నియా సహా పలు ప్రాంతాల్లో నేహా శర్మ క్యాంపెయిన్ చేస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఆమె తళుక్కుమంటున్నారు. కార్యక్రమానికి వచ్చిన అందరికీ అభివాదం చేస్తూ.. తన తండ్రికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.
They say when someone gives you a place in their heart , you live there forever .My heart is full from all the love and support you have given me.Thank you for the warm welcome Pirpainti and kahalgaon.Aapka pyar sar ankhon par.Eternally grateful ❤️💫🙏 pic.twitter.com/1c11Zj7ywq
— Neha Sharma (@Officialneha) April 23, 2024
Also Read: కమలంలో కుమ్ములాటలు.. సిట్టింగ్ ఎంపీకి వ్యతిరేకంగా నామినేషన్
ఈ వీడియోలను, ఫొటోలను నేహా శర్మ స్వయంగా తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేస్తున్నారు. ఆ పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. నేహా శర్మనే రాజకీయాల్లోకి వస్తున్నారంటూ తొలుత ప్రచారం జరిగింది. తండ్రి అజిత్ శర్మ కూడా ఆమెను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని కోరారట. కానీ, ఆమె సినీ కెరీర్‌నే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.