Hero Vikram Movie Thangalaan Aug 15th Release On Pan India Wide
Cinema

Vikram Movie: విక్రమ్‌ మూవీపై సాలిడ్‌ అప్‌డేట్

Hero Vikram Movie Thangalaan Aug 15th Release On Pan India Wide: కోలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా ఆడియెన్స్‌ ఈగర్‌గా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో తంగ‌లాన్ మూవీ ఒక‌టి. త‌మిళ హీరో చియాన్ విక్ర‌మ్ మెయిన్‌ రోల్‌లో యాక్ట్ చేస్తున్న ఈ మూవీకి పా రంజిత్ డైరెక్షన్ వహిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి టీజ‌ర్ రిలీజ్‌ చేయ‌గా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీపై ఆడియెన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేశాయి.

ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడంటూ ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని జ‌న‌వ‌రి 26న రిలీజ్‌ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని రీజన్స్ కారణంగా వాయిదా ప‌డింది. ఇక ఆ త‌ర్వాత ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్‌ చేద్దామనుకున్నారు మేకర్స్. కానీ అప్పుడు కూడా ఈ మూవీకి టైమ్ కలిసి రాలేదు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ఒక సాలిడ్ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.ఈ మూవీని ఆగ‌ష్టు 15న రిలీజ్‌ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు టాక్‌. ఇప్ప‌టికే ఆగ‌ష్టు 15 రేసులో ఉన్న పుష్ప 2 డిసెంబ‌ర్‌కు వాయిదా ప‌డ‌గా, హీరో రామ్ మూవీ డ‌బ‌ల్ ఎంట్రీ ఇస్తోంది.

Also Read: గ్లామర్‌ డోస్‌తో రచ్చ చేస్తోన్న నటి

ఇక ఆగ‌ష్టు 15కి తంగలాన్ కూడా వ‌స్తే బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడే ఛాన్స్ ఉంది. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ బాణీలు అందిస్తున్నాడు. ఈ మూవీలో మాళవికా మోహనన్‌, పార్వతి తిరువొతు ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేస్తుండగా, స‌ర్ప‌ట్ట ప‌రంప‌ర ఫేమ్ పశుపతి, డానియెల్‌ కల్టగిరోన్‌ కీ రోల్స్‌ పోషిస్తున్నారు.