Prithviraj-Prabhas | టాలీవుడ్ లో టాప్ పారితోషికంతో బాటు టాప్ కలెక్షన్లు సాధించే హీరో ప్రభాస్. ఈ పాన్ ఇండియా స్టార్ హీరోకు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడూ తన లైఫ్ స్టయిల్ విషయాలను ఎవ్వరితోనూ పంచుకోరు. కాకపోతే సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ‘సాహో’ విడుదలకు ముందు ఇన్‌స్టాలో అడుగుపెట్టిన ఈ హీరోను ప్రస్తుతం 13 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. తాజాగా ప్రభాస్ ఇన్‌స్టా అకౌంట్‌పై నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర విషయం వెల్లడించారు.
‘‘అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ప్రభాస్ (Prabhas) చాలా సింపుల్‌గా ఉంటాడు. స్టార్డమ్ గురించి అసలు ఆలోచించరు. సోషల్ మీడియాపై ఆసక్తి ఉండదు. డార్లింగ్ పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చే పోస్టులు ఏవీ ప్రభాస్ షేర్ చేయరట. ఈ మాట చెప్పి మీ అందరినీ నిరాశ పరిచినందుకు క్షమించండి. అతడికి చిన్న చిన్న ఆనందాలంటే ఇష్టం. ఫామ్‌హౌస్‌లో సంతోషంగా ఉంటాడు. ఎక్కడైనా మొబైల్ పనిచేయని ప్రాంతానికి వెళ్దాం అని ఎప్పుడూ అడుగుతుంటాడు. అంత పెద్ద పొజిషన్ లో ఉన్న హీరో చాలా సింపుల్ గా, డిగ్నిఫైడ్ గా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంటాను” అని పృథ్వీరాజ్ (Prithviraj) చెప్పారు.