Wednesday, May 22, 2024

Exclusive

Phone Tapping: డోంట్ వర్రీ.. ముస్తఫా..!! చిన్ననాటి మిత్రుడు వెంకట్రామిరెడ్డికి ఫుల్ సపోర్ట్

– నలుగురు బీఆర్ఎస్ నాయకుల ఆదేశాలతో నిఘా
– మూడేళ్లలో తొమ్మిది సార్లు డబ్బు పట్టివేత
– ఎస్కార్ట్‌ ఇచ్చి మరీ డబ్బు సరఫరా
– రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్‌లో సంచలన నిజాలు
– మరోసారి ‘సుప్రీమో’ పేరు ప్రస్తావన

హైదరాబాద్, స్వేచ్ఛ: రాధాకిషన్ రావు.. ప్రస్తుతం గులాబీ నేతల్లో వణుకు పుట్టిస్తున్న పేరు. ఫోన్ ట్యాపింగ్ గుట్టంతా విప్పుతున్న ఈయన, సంబంధం ఉన్న, లేకున్న అక్రమ దందాలను బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే బడా నేతల్లో వణుకు మొదలైంది. తాజాగా రిమాండ్ రిపోర్టులో మరోసారి సుప్రీమో పేరును పేర్కొన్నారు పోలీసులు. ఉప ఎన్నికల్లో ప్రత్యర్థుల డబ్బులను చాకచక్యంగా పట్టుకున్న ఘటనలను వివరించారు. మూడేళ్లలో 9 సార్లు డబ్బు పట్టుకున్నట్టు పేర్కొన్నారు. ప్రత్యర్థులకు డబ్బు చేరకుండా రాధాకిషన్ రావు అండ్ గ్యాంగ్ ప్లాన్స్ వేసి అడ్డుకుందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు వారి వివరాలను వింటూ ఎప్పటికప్పుడు సమాచారం చేరవేశారు. ప్రణీత్ ఇచ్చే సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావు ఆదేశాలతో రాధాకిషన్ రావు సిబ్బందిని పంపి మరీ డబ్బు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా అవుతున్నాయనే ప్రతీ విషయాన్ని ప్రభాకర్ రావుకు ప్రణీత్ రావు చేరవేశాడు.

ఎవరా నలుగురు..?

నలుగురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇచ్చిన ఆదేశాలతో రాధాకిషన్ రావు ప్రత్యర్థులపై నిఘా పెట్టినట్టు పోలీసులు తెలిపారు. మూడు ఉప ఎన్నికల సందర్భంలో కోట్ల రూపాయాలను రాధాకిషన్ గ్యాంగ్ పట్టుకుంది. టాస్క్ ఫోర్స్‌ను అక్రమాలకు ఉపయోగించుకున్నాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకు డబ్బును పట్టుకున్నారు.

పట్టుబడ్డ నగదు లిస్ట్ ఇదే!

2018లో ఎన్నికల్లో శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి ఆనంద్ ప్రసాద్‌కు చెందిన రూ.70 లక్షలను రాధాకిషన్ టీమ్ పట్టుకుంది. 2020లో దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో బేగంపేట వద్ద కోటి రూపాయాలను టాస్క్ ఫోర్స్ పట్టుకుంది. ఆ డబ్బులు దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుకు చెందిన చిట్ ఫండ్ కంపెనీవని పోలీసులు తెలిపారు. 2022 అక్టోబర్‌లో మునుగోడు ఉపఎన్నికల సమయంలో గాంధీ నగర్ వద్ద 3.50 కోట్ల రూపాయాలను టాస్క్ ఫోర్స్ పట్టుకుంది. ఆ డబ్బులు అప్పుడు మునుగోడు నుంచి బీజేపీ టికెట్ పై బరిలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డివని పోలీసులు పేర్కొన్నారు. 2023 అక్టోబర్‌లో బంజారాహిల్స్‌లో 3.35 కోట్ల రూపాయాలను పట్టుకోగా ఇవి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు ఏఎంఆర్ ఇన్‌ఫ్రాకి చెందిన మహేశ్ రెడ్డివని వివరించారు. అదే నెలలో తార్నాక వద్ద రూ.22 లక్షలు, మరో చోట రూ.15 లక్షలను టాస్క్ ఫోర్స్ టీమ్ పట్టుకుంది. ఇక భవానీ నగర్‌లో రాజకీయ నేత ముస్తఫా ఖాన్ నుంచి రూ.కోటి స్వాధీనం చేసుకుంది.

స్నేహితుడి కోసం అక్రమ మార్గాలు

చిన్ననాటి మిత్రుడు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి రాధాకిషన్ రావు పూర్తిస్థాయిలో సహాయం చేసినట్టు తన కన్ఫెషన్ స్టేట్మెంట్‌లో వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను రవాణా చేశారు. వెంకట్రామిరెడ్డి డబ్బులనూ సరఫరా చేశారు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్సైని ఉపయోగించి డబ్బులను ఎస్కార్ట్ ఇచ్చి మరీ డెలివరీ చేయించారు. తెల్లాపూర్‌లోని రాజ్‌ పుష్ప గ్రీన్ డెల్ విల్లాస్‌లో వెంకట్రామిరెడ్డి నివాసానికి దగ్గరగా ఉండే శివచరణ్ రెడ్డి వద్ద డబ్బును ఎస్సై తీసుకెళ్లి సికింద్రాబాద్‌లో ఉండే మాజీ డీఎస్పీ దివ్య చరణ్‌కు ఆ డబ్బులు అందించారు. ఈ వ్యవహారం బయటపడకుండా ఉండటానికి కొత్త సిమ్ కార్డు, ఐఫోన్ కొని ఎస్ఐకి రాధాకిషన్ రావు ఇచ్చారు. పలుమార్లు మొత్తంగా రూ.4 కోట్ల డబ్బు తరలించినట్టు గుర్తించారు. డబ్బు రవాణాలో రిటైర్డ్ ఎస్పీ దివ్యచరణ్ రావు కీలక పాత్ర పోషించారు.

Publisher : Swetcha Daily

Latest

Farm Planting: ఫామ్ ప్లాంటింగ్.. పక్కా చీటింగ్

- నిండా ముంచేస్తున్న నీమ్స్ బోరో - ఐదేళ్లలో రూ.600 కోట్ల బిజినెస్ -...

Real Estate: పైసా పైసా కూడబెట్టి వెంచర్‌లో ఫ్లాట్ కొన్నాం.. ఇప్పుడేమో..!!

Ventures: వాళ్లంతా పైసా పైసా కూడబెట్టి రాజధాని నగరానికి సమీపంలో ఉన్నదని...

University VC: వీసీల మార్పు.. సంబురాల్లో విద్యార్థులు

- ముగిసిన యూనివర్సిటీల వీసీల పదవీ కాలం - ఉస్మానియాలో విద్యార్థుల సంబురాలు...

CM Revanth: ప్రపంచంతో పోటీ పడాలి: పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష

CM Revanth Review: దక్షిణ భారతంలో రెండో అతిపెద్ద ఐటీ నగరాల్లో...

Actress Kajal: భయపడ్డ కాజల్‌, కారణం ఎవరంటే..?

Actress Kajal Is Scared, Who Is The Reason?: చందమామ...

Don't miss

Farm Planting: ఫామ్ ప్లాంటింగ్.. పక్కా చీటింగ్

- నిండా ముంచేస్తున్న నీమ్స్ బోరో - ఐదేళ్లలో రూ.600 కోట్ల బిజినెస్ -...

Real Estate: పైసా పైసా కూడబెట్టి వెంచర్‌లో ఫ్లాట్ కొన్నాం.. ఇప్పుడేమో..!!

Ventures: వాళ్లంతా పైసా పైసా కూడబెట్టి రాజధాని నగరానికి సమీపంలో ఉన్నదని...

University VC: వీసీల మార్పు.. సంబురాల్లో విద్యార్థులు

- ముగిసిన యూనివర్సిటీల వీసీల పదవీ కాలం - ఉస్మానియాలో విద్యార్థుల సంబురాలు...

CM Revanth: ప్రపంచంతో పోటీ పడాలి: పరిశ్రమల శాఖపై సీఎం సమీక్ష

CM Revanth Review: దక్షిణ భారతంలో రెండో అతిపెద్ద ఐటీ నగరాల్లో...

Actress Kajal: భయపడ్డ కాజల్‌, కారణం ఎవరంటే..?

Actress Kajal Is Scared, Who Is The Reason?: చందమామ...

Farm Planting: ఫామ్ ప్లాంటింగ్.. పక్కా చీటింగ్

- నిండా ముంచేస్తున్న నీమ్స్ బోరో - ఐదేళ్లలో రూ.600 కోట్ల బిజినెస్ - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే టోపీ - సాగు మాది, సంపద మీది అంటూ బురిడీ - ఫామ్ ప్లాంటింగ్‌తో నీమ్స్ బోరో కుచ్చుటోపీ -...

Real Estate: పైసా పైసా కూడబెట్టి వెంచర్‌లో ఫ్లాట్ కొన్నాం.. ఇప్పుడేమో..!!

Ventures: వాళ్లంతా పైసా పైసా కూడబెట్టి రాజధాని నగరానికి సమీపంలో ఉన్నదని ఓ వెంచర్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. విక్రేతలు ఫ్లాట్ల గురించి వివరించి, మురికినీటి కాల్వలు, పార్కులు, దారుల గురించి వివరించి...

ACB Raids: సెటిల్మెంట్లు.. దందాలు! అవినీతి పోలీస్‌పై ఏసీబీ గురి

- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంట్లో సోదాలు - ఏకకాలంలో ఆరు చోట్ల తనిఖీలు - ఆదాయానికి మించి అక్రమార్జన - పెద్ద మొత్తంలో నగదు, బంగారం, ల్యాండ్ డాక్యుమెంట్ల స్వాధీనం...