helicopter crash Iran President Raisi ministers officials died:
హెలికాఫ్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అకాల మరణం చెందారు. రైసీతో పాటు ఆ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్ హియాన్ ఇతర ఉన్నతాధికారులు సైతం మృతి చెందారు. అజర్‌బైజాన్-ఇరాన్ సరిహద్దులోని జోల్ఫా పట్టణం దగ్గరగా ఉన్న పర్వత ప్రాంతంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో హెలికాఫ్టర్‌ను గుర్తించిన ఇరాన్ బలగాలు.. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశాలు లేవని ప్రకటించాయి. ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురయింది. తూర్పు అజర్‌బైజాన్‌లో జరిగింది. ప్రమాదం జరిగి 24 గంటలదాకా ఇబ్రహీం రైసీ ఆచూకీ తెలియలేదు. ప్రమాదం జరగగానే అప్పమత్తమైన రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇరాన్ అధ్యక్షుడి కాన్వాయ్ లో మూడు హెలికాప్టర్లు ఉన్నాయి. వాటిలో రెండింటిలో మంత్రులు, ముఖ్య అధికారులు ప్రయాణిస్తున్నారు. రాష్ట్రపతితో పాటు హెలికాప్టర్‌లో సయ్యద్ మొహమ్మద్-అలీ అల్-హషీమ్, తబ్రిజ్‌కు చెందిన జుమా, జమాత్, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరాబ్దుల్లాహియాన్ కూడా ఉన్నారు.ఇరాన్ మీడియా ప్రకారం, రాజధాని టెహ్రాన్‌కు వాయువ్యంగా 600 కిలోమీటర్ల (375 మైళ్ళు) దూరంలో అజర్‌బైజాన్ సరిహద్దులో ఉన్న జోల్ఫా నగరానికి సమీపంలో దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో అందరూ మృతి చెందినట్లు ప్రకటించారు.
డ్యామ్ ప్రారంభోత్సవానికి
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆదివారం అజర్‌బైజాన్‌లో ఒక డ్యామ్‌ను ప్రారంభించేందుకు అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్‌తో కలిసి వెళ్తున్నారు. అరస్ నదిపై ఇరు దేశాలు నిర్మించిన మూడో డ్యామ్ ఇది. మిడిల్ ఈస్ట్‌లో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయనే వార్తలు వెలువడుతున్న తరుణంలో ఇది ఘటన జరిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.స్థానిక మీడియా ప్రకారం, రెస్క్యూ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకోలేకపోయాయి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఉన్న ప్రాంతంలో గాలులతో పాటు భారీ వర్షం, పొగమంచు కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. దీని వల్ల రాష్ట్రపతి విమానం హార్డ్ ల్యాండింగ్ అయ్యే అవకాశం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలావుంటే, 2021లో ఇరాన్ అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ విజయం సాధించారు. 1988లో, ఇరాన్-ఇరాక్ యుద్ధం తర్వాత, వేలాది మంది రాజకీయ ఖైదీలను ఉరితీసినందుకు ఇబ్రహీం రైసీ సిద్ధమయ్యారు. దీంతో జోక్యం చేసుకున్న అమెరికా ఉరిశిక్షను అడ్డుకుంది.