Harish Rao
Politics

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోయేది తెలియదు

Congress: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ వలస పడుతుంటే.. మాజీ మంత్రి హరీశ్ రావు మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ఐదేళ్ల కంటే ఎక్కువ పని చేయదని అన్నారు. కాంగ్రెసోళ్లు వాళ్లకు వాళ్లే సెల్ఫ్ గోల్ చేసుకుంటారని ఆరోపించారు. తెలంగాణలో కూడా ఎప్పుడు అధికారం దిగిపోతారో తెలియదని వ్యాఖ్యానించారు.

సిద్దిపేట నియోజకవర్గస్థాయి యువ విద్యార్థి సోషల్ మీడియా ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ రావు మాట్లాడారు. తెలంగాణ రాదు.. రాదు.. అని అందరూ అంటే కేసీఆర్ చావు నొట్టో తలపెట్టి తెచ్చి చూపించారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనలేదని, జై తెలంగాణ అనలేదని ఆరోపించారు. తెలంగాణ అంటేనే కాల్చేస్తా అని రేవంత్ రెడ్డి తుపాకి పట్టుకుని తిరిగాడని ఫైర్ అయ్యారు. అమరవీరులకు శ్రద్ధాంజలి కూడా ఘటించలేదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీదంతా దుష్ప్రచారమేనని, యువత ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాలని హరీశ్ రావు పిలుపు ఇచ్చారు. యువత ఆపదలో ఉంటే అండగా ఉంటానని హరీశ్ రావు అన్నారు. ఆపద, సంపదలో తోడుగా ఉంటానని, కంటికి రెప్పలా కాపాడుకుంటానని వివరించారు. సోషల్ మీడియాలో కనీసం పది పోస్ట్‌లు పెట్టి ప్రచారం చేయాలని సూచించారు.

Also Read: ప్రశాంత్ కిశోర్ ఇలా అయిపోయాడేంటీ?

రఘునందన్ రావు అలవిగాని హామీలు ఇచ్చి దుబ్బాక ఉపఎన్నికలో గెలిచారని హరీశ్ రావు ఆరోపణలు గుప్పించారు. అవి అమలు చేయక మాట తప్పడంతోనే ప్రజలు ఆయనను ఓడించారని అననారు. దుబ్బాకలోనే ఓడిన వ్యక్తిని మెదక్ ప్రజలు ఎలా ఆదరిస్తారని అడిగారు.