Hamas Commander Killed In Israel Attack : కొన్నిరోజుల క్రితం జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ అగ్రకమాండర్ మార్వాన్ ఇస్సా హతమయ్యారు. ఈ విషయాన్ని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లీవన్ ధృవీకరించారు. మార్చి 11న సెంట్రల్ గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన దాడుల్లో ఇస్సా మరణించారని వెల్లడించారు. ఇంకా మిగిలిన అగ్రనేతలు సైతం సొరంగాల్లో దాక్కున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడానికి ఇస్సానే కారణమని భావిస్తున్నారు. అయితే అమెరికా ప్రకటనపై హమాస్ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా రియాక్ట్ అవ్వలేదు.
అయితే.. మరోవైపు గాజాలోని ఆల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసిన ఘటనలో సుమారు 20 మంది మరణించారు. ఈ క్రమంలో 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు లోకల్ మీడియా వరుస కథనాలను టెలీకాస్ట్ చేశాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహులు సోమవారం ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు సమాచారం. గాజాలో నెలకొన్న పరిస్థితులను ఇరుదేశాల నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.
Read More: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు, నేను అధ్యక్షుడిని కాకపోతే..
ఈ మేరకు వైట్‌హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. గాజాకు వెళ్లే మానవతా సహాయం, బందీలను స్వదేశానికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలతో సహా ప్రధాని నెతన్యాహుతో బైడెన్ సంప్రదింపులు జరిపినట్లు అనంతరం కొద్ది గంటల పాటు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. దీర్ఘకాలిక భద్రతను నిర్దారించడం వంటి పలు విషయాలను ప్రస్తావించారని వైట్ హౌస్ తెలిపింది. ఉత్తర గాజాపై స్పెషల్ సారించాలని సూచించినట్టు తెలిపారు. గాజాలో అమాయక పౌరులు మరణించడం చాలా బాధాకరమని తెలిపింది.