– పది ఫలితాల్లో దుమ్మురేపిన ఇందూరు సర్కారీ స్కూళ్లు
– జిల్లా వ్యాప్తంగా 103 మంది విద్యార్థులకు 10/10 గ్రేడ్
– ఫలితాల్లో అబ్బాయిలను వెనక్కి తోసిన అమ్మాయిలు
– కార్పొరేట్ స్కూళ్ల కంటే సర్కారే స్కూళ్లలోనే ఉత్తమ ఫలితాలు
– ప్రభుత్వ స్కూళ్లకు క్యూ కడుతున్న తల్లితండ్రులు
Toppers: గతంలో సర్కారు బడి అంటే అందరికీ చిన్నచూపే. కానీ, నేడు ఆ పరిస్థితి క్రమంగా మారుతోంది. నిరుపేద విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారనే మాటకు భిన్నంగా ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన వర్గాల వారూ తమ పిల్లలను ఈ సర్కారీ బడిలో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించటమే గాక వీరికి ట్రిపుల్ ఐటీ, నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు సాధించేంతటి మంచి మార్కులు రావటమే ఈ సానుకూల మార్పుకు ప్రధాన కారణం. నిజామాబాద్ జిల్లాలో 2024లో విడుదలైన పదవ తరగతి ఫలితాలను గమనిస్తే సర్కారీ స్కూళ్ల పనితీరు ఎంత మెరుగుపడిందో అర్థమవుతుంది. తాజా ఫలితాల్లో జిల్లాలో ఏకంగా 103 మంది బాల బాలికలు 10/10 జీపీఏ సాధించి సత్తా చాటారు. వీరంతా ప్రభుత్వం ఆధ్యర్యంలో నడిచే హైస్కూళ్లు, మహాత్మా జ్యోతీబా పూలే గురుకులాలు(ఎంజేపీ), జిల్లా పరిషత్ స్కూళ్లలో చదివిన వారే కావటంతో వీరిని చూసి కార్పొరేట్ స్కూళ్లు, ప్రవేటు స్కూలు యాజమాన్యాలు నోరెళ్లబెడుతున్నాయి. పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయుల మెరుగైన బోధనా సామర్ధ్యం, తల్లిదండ్రుల చొరవ వెరసి.. ఈ ఫలితాలకు దోహదపడ్డాయి. అన్ని వసతులతో కూడిన ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు క్రీడలలోనూ భాగస్వాములను చేస్తూ, వారి శారీరక, మానసిక అభివృద్ధికి సర్కారీ బడులు దోహదపడుతున్నాయి.
స్కూళ్లు.. 10/10 సాధించిన విద్యార్థులు
బాల్కొండ ఎంజేపీ : ముదావత్ అఖిల, జిందం ప్రీతి, కటకం సాహితీ, కచ్చకాయల సాహితీ,
ఆర్మూర్ రెసిడెన్షియల్ పాఠశాల: తలారి షాలిని,
చిమన్‌పల్లి పాఠశాల: పి.అమూల్య,
సాలూర ఎంజేపీ స్కూల్: డి.అపర్ణ, పి.గౌతమి, పి.హర్షశ్రీ,
ఎడపల్లి బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్: అభ్యుదయ్
రాంపూర్ హైస్కూల్: డి.నిశాంత్ రెడ్డి,
కంజర బాలుర రెసిడెన్షియల్ స్కూల్: ఎన్.సూరజ్ గౌడ్, కొండపల్లి కార్తీక్,
నూత్పల్లి ఎం.జె.పీ పాఠశాల: చరణ్ తేజ, జి.రాఘవేంద్ర, ఎస్.గణేష్, ఎం.భరణి, తాళ్ల బాలు తేజ, గైని శివచరణ్,
కంజర ఎంజేపీ స్కూల్ కు చెందిన కె.కార్తీక్, ఆర్.శ్రీచక్ర,
దాస్ నగర్ ఎంజేపీ: అంకిత, ముదావత్ పల్లవి, గంగుల జీవని, ఎం.మహేశ్వరి, టి.రేణుశ్రీ,
పెర్కిట్ కేజీబీవీకి చెందిన ఎం.సిరి,
ఇందల్వాయి కేజీబీవీ: ఏ.సాత్విక,
డిచ్‌పల్లి మోడల్ స్కూల్: చాట్ల చందన, మెగావత్ పల్లవి, ఎం.అమూల్య,
ధర్పల్లి ఆదర్శ పాఠశాల: లోలం మేఘన, ఎస్.అంకిత, అక్షయ,
జక్రాన్‌పల్లి మోడల్ స్కూల్: ఎం.మాధురి,
మామిడిపల్లి మోడల్ స్కూల్: ఆఫియా ఫిర్దోస్, సయ్యద్ అహ్మద్, జక్కా వాసవి, వేదశ్రీ, అంకం కీర్తి, రోహిణి, సాయి పునీత్,
పోచంపాడ్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్: ఏ.వైష్ణవి, బి.వర్షిత,
ఎడపల్లి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ : కె.నితీష, రమ్య,
బాల్కొండ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్: జి.సింధు, కె.సాహితి,
ఆలూర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్: మహమ్మద్ షానవాజ్, వరుణ్, మాలావత్ అభిషేక్, కె.సంజీవ్ కుమార్, ఎన్.మణికంఠ గౌడ్, కేతావత్ అన్విత్,
బాల్కొండ పాఠశాలకు చెందిన ఎన్.అభిత,
ధర్మారం గర్ల్స్ రెసిడెన్షియల్ హైస్కూల్: పి.వనిత,
పోచంపాడ్ గర్ల్స్ రెసిడెన్షియల్ హైస్కూల్: డి.ఐశ్వర్య, జి.లాస్య, ఎస్.అను, మధునయన, ఎం.అనురాధ, చాట్ల అలేఖ్య, ఎస్.అనన్య,
కంజర బాలికల రెసిడెన్షియల్ స్కూల్: కె.శ్రీవర్ష,
సుద్దపల్లి గర్ల్స్ రెసిడెన్షియల్ హైస్కూల్: పెద్దోళ్ల మానస,
బోర్గామ్ జెడ్పీ హైస్కూల్: చాట్ల దాక్షాయణి,
ముప్కాల్ హైస్కూల్: టి.ప్రశాంత్,
నవీపేట్ గర్ల్స్ హైస్కూల్: ముబషీరా నాజ్, నబీలా నిషాత్,
ఆలూర్ హైస్కూల్: ఏ.సవిత, జి.భవజ్ఞ, దండు శరణ్య, సాయి మాధుర్య, మగ్గిడి రశ్మిత, ఎస్.దేవానంద్,
ఇస్సాపల్లి హైస్కూల్: లక్ష్మీ ప్రసన్న,
వేల్పూర్ హైస్కూల్: నిశిత,
ముప్కాల్ హైస్కూల్: కార్తికేయచారి, రచన,
పోచంపాడ్ స్కూల్: యుస్రాఖాన్,
మోతె హైస్కూల్: రామకృష్ణ,
బాల్కొండ హైస్కూల్: హర్షిక,
కమ్మరపల్లి హైస్కూల్: మొహమ్మద్ ఫైజాన్,
భీంగల్ గర్ల్స్ హైస్కూల్: కె.అపూర్వ,
డొంకేశ్వర్ హైస్కూల్: లవణ్ కుమార్, ప్రణవ్ తేజ్, నిశాంత్,
తొండాకూర్ హైస్కూల్: నాయని ఆకృతి,
తల్వేద హైస్కూల్: తేజస్విని, డి.విష్ణువర్ధన్, డి.శ్రీజ, ఎస్.కృష్ణవి,
ఐలాపూర్ స్కూల్: కె.సాయికిరణ్, మొహమ్మద్ నుమాన్,
పడకల్ హైస్కూల్: కె.హర్షిక, జి.శంకర్,
వెల్మల్ హైస్కూల్: టి.శ్రీనిత, ఎం.ఆకాంక్ష,
ముచ్కూర్ హైస్కూల్: కె.శ్రవణ్య, చేగంటి శివాని, ఎం.శ్రీవల్లి
నా లక్ష్యం.. ఐ.పీ.ఎస్
సివిల్స్ పరీక్షల్లో నెగ్గి, ఐపీఎస్ సాధించటమే నా లక్ష్యం. అమ్మానాన్నలతో బాటు మా టీచర్ల సపోర్టుతో నా కలను నెరవేర్చుకుంటా. పదో తరగతిలో 10/10 గ్రేడ్ రావటంతో ట్రిపుల్ ఐ.టీలో సీటుపై దృష్టి పెట్టాను. మా స్కూల్‌లో అర్ధమయ్యేలా పాఠాలు చెప్పటంతో బాటు పలు క్రీడల్లోనూ మాకు శిక్షణనిచ్చారు. హైస్కూల్‌లో చేరినప్పటి నుంచే చదువులో మంచి ప్రతిభ చూపటంతో కొన్నాళ్లు మా తల్లిదండ్రులు ఐఐటీ సిలబస్ బోధించే పటాన్‌చెరు, ఇంద్రేశంలోని ఎం.జె.పీలో చేర్చారు. పదో తరగతి నాటికి నేను దాస్ నగర్ పాఠశాల నుండే రాశాను. ఇదే స్పూర్తితో ముందుకెళ్తూ, తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తెస్తాను.
– సీ.హెచ్.అంకిత (దాస్ నగర్, మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థిని)
ఇంజనీర్‌గా రాణిస్తా
సిలబస్, పరీక్ష రాసే విధానం, రివిజన్ వంటి అంశాల మీద దృష్టి పెడితే 10/10 జీపీఏ సాధించటం కష్టమేమీకాదు. ఈ విషయంలో మా టీచర్లు మమ్మల్ని బాగా గైడ్ చేశారు. క్రమశిక్షణ, సమయపాలన కూడా మంచి రిజల్ట్ రావటానికి కారణమైంది. మా నాన్న ఆటో డ్రైవర్, అమ్మ గృహిణి. కష్టపడి ఇంజనీరింగ్ చేసి, మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలుస్తా.
– దాక్షాయణి, (బోర్గాం, జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని)
ఇంటర్ కూడా ఇక్కడే చదువుతా
ఇక్కడ మంచి టీచర్లుండటంతో పదో తరగతి ఇక్కడ చదివా. మా టీచర్లు అనుకున్న టైమ్‌కి సిలబస్ పూర్తిచేసి, రివిజన్ చేయించటమే గాక పరీక్షల ప్రజెంటేషన్ మీదా అవగాహన కలిగించారు. దీంతో 10/10 రిజల్ట్ వచ్చింది. ఇక్కడ అన్ని సదుపాయాలుండటంతో ఇంటర్ కూడా ఇక్కడే చదివేందుకు అడ్మిషన్ తీసుకున్నాను. మంచి మార్కులతో ఇంటర్ పూర్తి చేసి, బీ.టెక్ చేయాలనేది నా కల.
జీవని, (దాస్ నగర్, ఎం.జె.పీ పాఠశాల విద్యార్థిని)
ఐ.ఐ.టీలో చేరతా
మాది వ్యవసాయ కుటుంబం. మా టీచర్ల నిరంతర శిక్షణ, పర్యవేక్షణ, బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న మా అన్నయ్య ప్రోత్సాహంతో పదిలో మంచి గ్రేడ్ వచ్చింది. ఐఐటీలో చదవాలన్నదే నా లక్ష్యం. ఇదే స్ఫూర్తితో చదవి నా కల నెరవేర్చుకుంటా.
– పల్లవి (దాస్ నగర్, ఎం.జె.పీ పాఠశాల విద్యార్థిని)