Gold And Silver Panipuri Videos Goes Viral On Social Media: చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టపడే చిరుతిండి పానీపూరీ. పానీపూరీని చూస్తే చాలు నోట్లో పానీ ఊరిపోవాల్సిందే. ఎందుకంటే వాటి పేరు విన్నా.. పానీ పూరీ బండిని చూసిన చాలామంది ఇట్టే ఫిదా అయిపోతుంటారు. అందుకే వీటికి మార్కెట్‌లో ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని సరికొత్త రుచులతో, రకరకాల వేరియేషన్స్‌తో పానీపూరీలను తయారుచేస్తుంటారు నిర్వాహకులు.
ఇదే కోవలో ఇప్పుడు కాస్త వెరైటీగా పానీపూరీలను తయారు చేశారు. అదికూడా బంగారు పూతతో చేసిన పానీపూరీలు. అదేంటని ఆశ్చర్యపోకండి. ఇక్కడి పానీపూరీలను మీరు చూస్తే ఖంగు తినక మానరు. ఎందుకంటే ఇక్కడ తయారుచేయబడే పానీపూరి స్పెషల్ అలాంటిది మరి. ప్రస్తుతం ఈ పానీపూరీకి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అదెక్కడో మనం కూడా ఓ లుక్కెద్దాం రండి.
Also Read:‘కేజ్రీవాల్‌కు రూ. 50 కోట్లు ఇచ్చా.. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తా.. ’
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారీ ఈ సరికొత్త పానీపూరీలను అమ్ముతున్నాడు. గోల్డ్, సిల్వర్ పూతతో తయారుచేయబడిన పానీపూరీలను అతడు అమ్ముతున్నాడు. అంతేకాదు ఆ పానీపూరీలను అతడు విక్రయించడం మనం ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఆ పానీపూరీల్లో డ్రైప్రూట్స్, తేనే కూడా వేయడం.. ఈ పానీ పూరీ స్పెషల్ అనే చెప్పాలి. వాటిని బంగారం రంగు ప్లేట్‌లోనే పెట్టి కస్టమర్లకు ఇస్తున్నాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు ఆ వ్యాపారి క్రియేటివిటీని మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇక ఈ పానీపూరీలను గుజరాత్ వీధుల్లో అమ్ముతున్నాడు. దీనికి ఓ నామకరణం కూడా చేశాడట. అదే షరీట్‌గా తెలుస్తోంది. ఇంకేముంది మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే మీరు గుజరాత్‌కి వెళ్లిరావాల్సిందే..
View this post on Instagram