Wednesday, October 9, 2024

Exclusive

Hyderabad:ఆపరేషన్ నయీం డైరీ

  • మళ్లీ తెరపై నయీం డైరీ ..కేసు రీ ఓపెన్ కు సన్నాహాలు
  • కేసును నీరుగార్చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం
  • నయీంతో రాజకీయ నేతల సంబంధాలపై ఆరా
  • గ్యాంగ్ స్టర్ ఆస్తులపై తేలని లెక్కలు
  • బినామీలుగా వ్యవహరించిప వారు ఎవరు?
  • మాజీ బీఆర్ఎస్ మంత్రుల పాత్ర ఏమిటి?
  • లోక్ సభ ఫలితాల తర్వాత కేసు రీ ఓపెన్ చేసే అవకాశం

Gangstar Nayeem case re open plan after lok sabha election results congress :
దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన నయీం కేసును కాంగ్రెస్ ప్రభుత్వం రీ ఓపెన్ చేయనుందా?గత ప్రభుత్వ హయాంలో నీరుగార్చిన కేసును ప్రస్తుత ప్రభుత్వం అవకతవకలు వెలికి తీసి బాధ్యులను శిక్షించనుందా? గ్యాంగ్ స్టర్ నయీం ఆస్తులను రికవరి చేస్తుందా? అంటే మళ్లీ నయీం కేసును రీ ఓపెన్ చేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు 2016లో ఎన్ కౌంటర్ అయిన నయీం పేరు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో గట్టిగానే రీ సౌండ్ ఇస్తోంది. తిరిగి ఈ కేసును రీ ఓపెన్ చేయాలంటూ కొందరు నేతలు డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. 40కి పైగా హత్యలు, బెదిరింపు కాల్స్ తో పాటు లెక్కలేనన్ని సెటిల్ మెంట్లు, వందల కోట్ల ఆస్తులు కలిగిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిన నయీం కేసు తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తోంది. ఇప్పుడు హఠాత్తుగా అచ్చంపేట ఎమ్మెల్యే నయీం కేసు రీ-ఇన్వెస్టిగేషన్ డిమాండ్‌ను తెరపైకి తేవడంతో ప్రభుత్వం ఈ దిశగా రానున్న రోజుల్లో అడుగులు వేయనున్నదనే సంకేతం వెలువడినట్లయింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు నయీంతో సంబంధాలున్నాయని, ఈ వ్యవహారం బహిర్గతం కావాలంటే ఆ కేసును ప్రభుత్వం మరోసారి దర్యాప్తు చేయడం అవసరమని డాక్టర్ వంశీకృష్ణ ఇటీవల మీడియాతో వ్యాఖ్యానించారు. నయీం కేసును తిరిగి దర్యాప్తు చేయడం ద్వారా బీఆర్ఎస్ నేతలకు ఎలాంటి సంబంధాలున్నాయన్నది తేటతెల్లమవుతుందని, అందువల్లనే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతానని నొక్కిచెప్పారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేస్తానని, పోలీసు దర్యాప్తుకు ఆదేశించి పూర్తి వివరాలను వెలికి తీయాలని కోరతానని డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు.

నయీం కేసు రీఓపెన్ పై ఒత్తిడి

ఎన్‌కౌంటర్‌ తర్వాత నయీం డైరీలో ఏం దొరికిందన్న ఆంశంపై పట్టుబడుతున్నారు నేతలు. అయితే అప్పట్లో నయీంకి కేవలం ఒక్క హైదరాబాద్‌లోనే 20 ఇళ్ళు ఉన్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. నయీం వాటిని డెన్లుగా వాడుకుని భూదందాలు, సెటిల్‌మెంట్లు చేసినట్లు సిట్‌ తెలిపింది. నయీంకు హైదరాబాద్‌లోనే కాదు, గోవా, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా ఇళ్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. 1993 నుంచి 2016 వరకు నయీం నేరాలు చేయడంలో రెచ్చిపోయాడని, వందల కొద్ది సెటిమెంట్లు, భూదందాలు, హత్యలకు పాల్పడినట్లు తేల్చారు. బ్యాంకుల్లో కాకుండా డబ్బును తన దగ్గరే పెట్టుకునేవాడని, కొందరు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు నయీంతో చేతులు కలిపారన్న వాదనలూ ఉన్నాయి.అయితే ఇప్పుడు ఇవే విషయాలు గుర్తు చేస్తున్నారు వివిధ పార్టీల నేతలు. గత ప్రభుత్వం నయీం కేసును నీరుగార్చిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అసలు నయీం అక్రమ సొమ్మంతా ఎవరి చేతికి వెళ్లింది..? భూదందాలతో వెనకేసుకున్న ఆస్తులన్నీ ఏమయ్యాయి..? నయీంతో చేతులు కలిసిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఎవరు..? ఇలాంటి విషయాలన్ని బయటకు తెలియాలి. నిందితులను పట్టుకోవాలంటూ పట్టుబడుతున్నారు అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ పార్టీ నేతలు.

గ్యాంగ్ స్టర్ ఆస్తులను జప్తు చేస్తుందా?

ఇటు నయీం కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్. నయీం ఆస్తులు చాలా వరకు బీఆర్‌ఎస్ ముఖ్య నేతల చేతుల్లోనే ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. నయీం ఆస్తులను కొందరు నేతలు నొక్కేశారని గతంలో ఆరోపించిన కాంగ్రెస్‌, అధికారంలోకి వచ్చాక కేసును ఎందుకు రీఓపెన్‌ చెయ్యట్లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొన్నటికి మొన్న అధికార పార్టీ నేత వీహెచ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నయీం కేసును బీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చిందని ఆరోపించారు. ఇప్పుడు కేసును మళ్లీ రీఓపెన్ చేసి ఎవరి పాత్ర ఏంటనేది తేల్చాలన్నారు వీహెచ్.
మొత్తంగా..పొలిటికల్‌గా హీట్‌ పెంచుతున్న నయీం కేసును ప్రభుత్వం రీఓపెన్‌ చేస్తుందా…? గతంలో విచారణలో జరిగిన అవకతవకలు వెలికితీసి.. బాధ్యులను శిక్షిస్తుందా? గ్యాంగ్ స్టర్ ఆస్తులను రికవరీ చేస్తుందా లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది.

లోక్ సభ ఎన్నికల తర్వాత

లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం నయీం కేసును మరోసారి దర్యాప్తు చేయిస్తుందా? అప్పటి పోలీసు ఆఫీసర్లతో పాటు బీఆర్ఎస్ నేతలకు ఉన్న సంబంధాలను వెలికితీస్తుందా? నయీం ఎన్‌కౌంటర్ తర్వాత స్వాధీనమైన ఆస్తుల్లో ఎన్ని చేతులు మారాయి? నయీం డైరీలోని అంశాలు ఇప్పటికీ మిస్టరీగా ఎందుకున్నాయి? పూర్తి వివరాలను వెల్లడిస్తే ఎవరి మెడకు చుట్టుకుంటుంది? ఇవన్నీ రానున్న రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్, భట్టి - సింగరేణికి అండగా నిలవండి - పెండింగ్ ప్రాజెక్టులపై తేల్చేయండి - పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి - కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు అవసరం -...

Telangana:పేరు మారనున్న ‘ములుగు’

ములుగు జిల్లా పేరు మార్పు కు కసరత్తు మొదలు పెట్టిన అధికారులు ‘సమ్మక్క సారలమ్మ ములుగు’గా మార్చాలని ప్రతిపాదన మంత్రి సీతక్క విజ్ణప్తితో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...