Venkatesh
Politics

Venky: ఎనీ సెంటర్.. సింగిల్ ‘హ్యాండ్’

– ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ ఎన్నికల ప్రచారం
– కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలకు వినతి
– వియ్యంకుడు రఘురాం రెడ్డి కోసం రోడ్ షో

Venkatesh election campaign(Political news in telangana): కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. తమకు తెలిసిన ప్రముఖులతో ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి తన వియ్యంకుడు, హీరో వెంకటేష్‌ను రంగంలోకి దింపారు. మంగళవారం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ జెడ్పీ సెంటర్ రోడ్ షోలో వెంకటేష్ పాల్గొన్నారు. జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. ప్రజలకు వెంకటేష్ అభివాదం చేస్తుంటే యువత కేరింతలు కొట్టారు.

ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, రఘురాం రెడ్డి గుర్తు గుర్తుందా హస్తం గుర్తుపెట్టుకోండి అని అన్నారు. ఈవీఏంలో 3వ నెంబర్‌పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ కాంగ్రెస్ అంటూ సినిమా డైలాగులను మిక్స్ చేసి ప్రసంగించారు. భద్రాచలంలో రాముడు, ఖమ్మంలో ఈ రఘురాముడు ఉన్నాడని అన్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు వెంకటేష్.

Also Read: అది నీకు.. ఇది నాకు..! పార్టీ ఫండ్ దండుకుంటున్న గులాబీలు?

ఇటు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, విక్టరీ వెంకటేష్‌ను అభిమానించే వాళ్ళు, కాంగ్రెస్‌ని అభిమానించే వాళ్ళు హస్తం గుర్తుపై ఓటు వేసి రఘురాం రెడ్డిని గెలిపించాలని కోరారు. మనందరి అభిమాన నాయకుడు ఖమ్మం ఎందుకు వచ్చాడో అందరికీ తెలుసు కదా, రఘురాం రెడ్డి గెలవాలని చెప్పారు.