CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా రాజకీయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బాహాటంగా ప్రకటిస్తున్నారు. చాలా సార్లు ఈ విషయమై ఆయన వివాదాల్లోనూ చిక్కుకున్నారు. రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా ఏపీ రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. అక్కడి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ కుమార్‌లపై విరుచుకుపడేత ఆర్జీవీ.. వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించేవారు. తాజాగా ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.
సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్ చేశారు. ‘నా మిత్రుడు, ఫైర్ క్రాకర్, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాను’ అని ట్వీట్ చేస్తూ సీఎంతో కలిసిన తన ఫొటోను జత చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దూకుడు స్వభావాన్ని సింపుల్‌గా ఫైర్ క్రాకర్ అంటూ ఆర్జీవీ వర్ణించారు. నా మిత్రుడు అంటూ సాదరంగా గౌరవిస్తూ ట్వీట్ చేయడం గమనార్హం.
Also Read: కిషన్ రెడ్డిపై విజయశాంతి ట్వీట్ వైరల్.. రాములమ్మ ఏం చెప్పాలనుకున్నారు?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ దర్శకులు రామ్‌గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19వ తేదీన డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని వారంతా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వారి విజ్ఞప్తికి సుముఖంగా స్పందించినట్టు తెలిసింది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు ఆహ్వానాల కోసం ఆర్జీవీ వెళ్లడం అరుదు.