Tuesday, June 18, 2024

Exclusive

Farm Planting: ఫామ్ ప్లాంటింగ్.. పక్కా చీటింగ్

– నిండా ముంచేస్తున్న నీమ్స్ బోరో
– ఐదేళ్లలో రూ.600 కోట్ల బిజినెస్
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే టోపీ
– సాగు మాది, సంపద మీది అంటూ బురిడీ
– ఫామ్ ప్లాంటింగ్‌తో నీమ్స్ బోరో కుచ్చుటోపీ
– తన పేరు మీద లేకుండానే వేల ఎకరాల రిజిస్ట్రేషన్స్
– పొంచి ఉన్న టైటిల్ వివాదం
– వివాదాల్లో ల్యాండ్స్, యాప్‌లోనే ఫిజికల్ పొజిషన్
– ఉద్యోగుల అకౌంట్స్‌లోకి జోరుగా బ్లాక్ మనీ
– ఎవరైనా ప్రశ్నిస్తే.. మూడేళ్ల వరకు ఆగాలంటూ బెదిరింపులు
– ఒక్క నారాయణ్ ఖేడ్‌లోనే వెయ్యి ఎకరాలకు పైగా బిజినెస్
– రియల్ ఎస్టేట్ చీటర్ సుబ్రమణ్యంతో కలిసి దందా?
– మియాపూర్‌లో 18 ప్లాట్స్‌లో ప్రైవేట్ సైన్యం
– నమ్మించి ముంచడమే నీమ్స్ బోరో లక్ష్యం

దేవేందర్ రెడ్డి, 9848070809

Real Estate: 5 లక్షలకే 5 గుంటల ఫామ్ ల్యాండ్. ఆఫర్ అదిరింది కదా. వెంటనే కొనేయాలని అనిపిస్తుంది కదా. కాస్ట్లీ ఏరియాలో ఇంత చీప్‌గా ల్యాండ్ అంటే మామూలు విషయం కాదు. కానీ, ఇక్కడే ఉంది అసలు కిటుకు. ఆఫర్‌ బాగుంది కదా అని టెమ్ట్ అయితే, జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. రెవెన్యూ చట్టంలోని లొసుగుల్ని ఆసరాగా చేసుకున్న నీమ్స్ బోరా చేస్తున్న దందాలో ఇరుక్కుంటే అంతే సంగతులు. ఇప్పటికే వందల కోట్లు కొల్లగొట్టాడు ఈ సంస్థ ఎండీ వెంకట నాగ మురళీ కృష్ణ. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, తన పేరు మీద సెంటు భూమి కూడా ఉండదు. కానీ, అంతా తనదే అంటూ అమ్మేస్తాడు. పదేళ్లు మొక్కలు నాటడం, పెంచడం తనదే బాధ్యతగా నమ్మిస్తాడు. తర్వాత ల్యాండ్ అమ్మేసుకుని డబ్బంతా పట్టుపని పది నెలల్లోనే బిచానా ఎత్తేస్తాడు. నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఈ దందా జరుగుతుండడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు.

మాటలతోనే బురిడీ

నారాయణ్ ఖేడ్‌లో నీమ్స్ బోరో ఫామ్ ల్యాండ్స్ పేరుతో అమ్మకాలు సాగిస్తోంది. సాప్ట్‌గా మీ ప్లాట్ ఇక్కడ ఉందంటూ యాప్‌లోనే సర్వస్వం ఉన్నట్లు చూపిస్తుంది. కానీ, ఆ భూములకు టైటిల్ వివాదం ఎప్పుడైనా రావొచ్చు. ఏదైనా సమస్య వస్తే అప్పటికప్పుడు అన్నీ సద్దుమణిగాయంటూ డబ్బులతో మేనేజ్ చేస్తాడు మురళీ కృష్ణ. 20 ఫీట్ల రోడ్డు అంటాడు. ఎవరి పేరు మీద ఉంటుందో చెప్పడు. కంపెనీ పేరు మీద కనీసం అమ్మే భూమి కూడా ఉండదు. ఒక్క సర్వే నెంబర్ అని చెప్పి మరో సర్వే నెంబర్‌లో రిజిస్ట్రేషన్ చేయడం ఇక్కడ కామన్. మళ్లీ ఏదైనా వివాదం సృష్టించి ఎప్పటికైనా తనకే అమ్ముకునేలా ప్లాన్ బీ ని సిద్ధం చేసుకుని ఉంటాడు. రైతులను పైసలతో కప్పేసి, సిటీలో భూమి లేని ఉద్యోగులను టార్గెట్ చేసుకుని కొనసాగిస్తున్న ఈ దందాతో వెయ్యి ఎకరాలకు పైగా బిజినెస్ చేసి రూ.600 కోట్ల దాకా వెనకేసుకున్నాడని నారాయణ్ ఖేడ్ ప్రజలు, రైతులు ఆరోపిస్తున్నారు.

నారాయణ్ ఖేడ్ కేంద్రంగా దందా

సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్‌లో చేస్తున్న ఇల్లీగల్ రియల్ దందాతో ప్రజలను నిండా ముంచేస్తోంది నీమ్స్ బోరో. మన ఊరు పేరుతో ముక్తాపూర్‌లో 66, 67 సర్వే నెంబర్స్‌లో 30 ఎకరాల లోపు అనుమతులు తీసుకుంది. వెల్లూర్‌లో 12, 26 సర్వే నెంబర్స్‌లో మరో 30 ఎకరాలకు పర్మిషన్ తీసుకొని 300 ఎకరాలు అమ్ముతున్నట్లు ప్రచారం చేసుకొని ఫామ్ ల్యాండ్స్ రూపంలో కొల్లగొడుతోంది. ఇలా నారాయణ్ ఖేడ్‌లోనే 1400 ఎకరాల్లో ఇల్లీగల్ బిజినెస్ చేస్తోంది. నిలువ నీడ ఉండదు. చుక్క నీరు కనిపించదు. కర్నాటక బార్డర్‌లో ఎకరం 5 లక్షలకు మించదు. అలాంటి ప్రాంతంలో వేల ఎకరాలను అక్రమంగా పోగు చేసుకుని ఎకరం 40 నుంచి 60 లక్షలకు అమాయక ప్రజలకు యాప్స్ ద్వారా అమ్మేస్తోంది. ఈ దందానంతా స్వేచ్ఛ/బిగ్ టీవీ పూర్తి ఆధారాలతో వరుస కథనాలు ఇవ్వనుంది.

పేరు ఏదైనా దందా ఒకటే!

హుడ్ ల్యాండ్, నేషరల్ హుడ్, సన్ షైన్, అక్సిరైజ్ పేర్లతో ఫామ్ ల్యాండ్స్, కేవలం 30 ఎకరాల లోపు మాత్రమే అనుమతి తీసుకుని వందల ఎకరాలకు లే అవుట్స్ చేస్తున్నామని ప్రచారం చేసుకొని అమ్మకాలు మొదలు పెట్టారు. భరణి అవెన్యూ, రాజధాని, మన ఊరు అనే పేర్లతో డీటీసీపీ, రెరా అంటూ కొంత పర్మిషన్స్ తీసుకొని సంబంధం లేని లిటిగేషన్ భూములను అమ్మేస్తున్నారు. కొద్ది రోజుల్లో బిచానా ఎత్తేసి లీగల్‌గా ఎక్కడా సంబంధం లేకుండా ఉండేలా ప్లాన్స్ జరుగుతున్నాయి. ఇందులో నీమ్స్ బోరో ఓనర్ వెంకట నాగ మురళీ కృష్ణ పుత్ర రత్నాలు కీలక పాత్ర పోషిస్తున్నారు.

స్వేచ్ఛ/బిగ్ టీవీలో ఇకపై వరుస కథనాలు

తక్కువ పెట్టుబడి పెడితే, అధిక సంపద వస్తుందని ఆశపడే మధ్య తరగతి కుటుంబమే టార్గెట్‌గా రియల్ ఎస్టేట్ మాఫియా కొనసాగుతోంది. చీప్‌గా వస్తుందని కొనుగోలు చేస్తే ఇప్పటికే అగ్రిగోల్డ్, సాహితీ, భువన్ తేజా, ఫార్చునర్, ఇలా చెప్పుకుంటూ పోతే ముంచేసిన కంపెనీలెన్నో, బాధితులు ఎందరో. ఇప్పుడు నీమ్స్ బోరోలో పెట్టుబడి పెడితే ఎలా మోసపోతారో వరుస కథనాలను ప్రాజెక్ట్ వైజ్‌గా సాక్ష్యాధారాలతో స్వేచ్ఛ/బిగ్ టీవీలో కథనాలు రానున్నాయి.

Publisher : Swetcha Daily

Latest

IPS Officers: 28 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

Police Dept: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది....

Vinayaka Chavithi: ఖైరతాబాద్ గణేషుడికి కర్రపూజ

- విగ్రహ నిర్మాణ పనులు షురూ - 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి -...

Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

- మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. అప్పుడే కుండపోత - రాష్ట్రంలో మూడు రోజులు...

Loans: అడ్డగోలు రుణాలు.. రికవరీ తిప్పలు

- రికవరీ టార్గెట్లు ఫిక్స్ చేసిన నిజామాబాద్ డీసీసీబీ - నిబంధనలకు విరుద్ధంగా...

Kakatiya University: కేయూలో మళ్లీ పీహెచ్‌‘ఢీ’

- ఆందోళనబాట పట్టిన విద్యార్థులు - ప్రభుత్వం వేసిన కమిటీ సూచనలకు భిన్నంగా...

Don't miss

IPS Officers: 28 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

Police Dept: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది....

Vinayaka Chavithi: ఖైరతాబాద్ గణేషుడికి కర్రపూజ

- విగ్రహ నిర్మాణ పనులు షురూ - 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి -...

Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

- మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. అప్పుడే కుండపోత - రాష్ట్రంలో మూడు రోజులు...

Loans: అడ్డగోలు రుణాలు.. రికవరీ తిప్పలు

- రికవరీ టార్గెట్లు ఫిక్స్ చేసిన నిజామాబాద్ డీసీసీబీ - నిబంధనలకు విరుద్ధంగా...

Kakatiya University: కేయూలో మళ్లీ పీహెచ్‌‘ఢీ’

- ఆందోళనబాట పట్టిన విద్యార్థులు - ప్రభుత్వం వేసిన కమిటీ సూచనలకు భిన్నంగా...

Hyderabad:కానిస్టేబుల్ కు సీఎం ప్రశంసలు

CM praised Helping nature traffic police upsc exam: యూపీఎస్సీ ప్రిలిమ్స్ కు వెళుతున్న ఓ యువతిని పరీక్ష కేంద్రానికి తరలించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కేవలం...

Hyderabad: డీజే సిద్ధూ.. వీని స్టయిలే వేరు!

- నగరంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం - పోలీసుల విస్తృత తనిఖీలు, నిఘా - డ్రగ్స్ సేవిస్తూ దొరికిపోయిన డీజే సిద్ధార్థ్ - సిద్ధూతోపాటు మరో వ్యక్తికి పాజిటివ్ - ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తింపు - అదుపులోకి తీసుకుని మాదాపూర్...

Hyderabad:పాత కారుకు ‘కొత్త డ్రైవర్’?

పార్టీ సమూల ప్రక్షాళన చేపట్టనున్న కేసీఆర్ పార్టీ అధ్యక్ష పదవిని వేరేవాళ్లకు అప్పగించాలనే యోచన ఈ సారి కుటుంబ సభ్యులను దూరం పెట్టాలనుకుంటున్న కేసీఆర్ దళిత సామాజిక వర్గానికి చెందిన నేతకు...