Mahabubabad: ఆ దంపతులు పెళ్లైన కొత్తలో అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. కిరాణ షాపు పెట్టుకున్నారు. అలాగే.. ఏ పని దొరికినా కూలికి వెళ్లేవారు. కాని, వారి మధ్య ఆర్థిక సమస్యలు చిచ్చుపెట్టాయి. అవి తీవ్ర కుటుంబ కలహాలుగా మారిపోయాయి. ఈ క్రమంలో వారు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. పసిబిడ్డలకు పాలడబ్బాలో విషం కలిపి ఇచ్చారు. ఇద్దరు పసిగుడ్డులు మరణించారు. వారిద్దరిని ఇంటిలోనే వదిలి ఆ భార్య భర్తలు వెళ్లిపోయారు. తాజాగా సమీప అడవిలో విగతజీవులై కనిపించారు. కుళ్లిన శవాలు కనిపించాయి. ఈ ఘటన మహబూబాబాద్‌లో చోటుచేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన కందగట్ల అనిల్, దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. వారు మూడేళ్ల లోహిత, 11నెలల జశ్విత. కుటంబ భారం పెరగడం, ఇతర సమస్యలు తోడవ్వడంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరిగాయి. మార్చి 10వ తేదీన వీరి మధ్య పెద్ద వివాదమే జరిగింది. అదే రోజు తల్లిదండ్రులు వారి ఇద్దరు కూతుళ్లకు పాలల్లో విషం కలిపి తాగించారు. ఇద్దరు బిడ్డలూ చనిపోయారు. ఆ తర్వాత తల్లిదండ్రులు కనిపించలేదు. ఈ విషయం తెలిసిన పోలీసులు తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. వారి ఆచూకీ కోసం గాలింపులు జరిపారు. వారి జాడ దొరకలేదు.
Also Read: ఆధారాలకు విరుద్ధంగా కవిత సమాధానాలు.. ఐదు రోజుల కస్టడీ కావాలి
కానీ, అంకన్నగూడెం శవారులోని అడ్డగుట్ట అడవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చెట్టుకు వేలాడుతూ కుళ్లిపోయిన స్థితిలో కందగట్ల అనిల్ డెడ్ బాడీ కనిపించింది. గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన మృతదేహాలను కిందికి దించి శవపరీక్ష కోసం తరలించారు.