– 15 ఏండ్లుగా పాతుకుపోయిన రిటైర్డ్ ఆఫీసర్!
– ఆదర్శంగా ఉండాల్సిన ట్రైనింగ్ సెంటర్‌లో అవకతవకలెన్నో!
– తాను లేకపోతే అకాడమీ లేదన్నట్టుగా బిల్డప్
– ఎలాంటి టెక్నికల్ వర్క్ లేని అడ్మినిస్ట్రేషన్‌కే వృధా ఖర్చులు
– మరోసారి పదవీకాలం పొడిగించుకునేందుకు లాబీయింగ్
– రావుల పదవుల కొనసాగింపులో రాఘవరావు రూటే సపరేటు
– ఖమ్మం మంత్రితో తన పదవి సేఫ్ అంటూ ప్రచారం
– గెస్ట్ ఫ్యాకల్టీ పేరుతో మరో అధికారి తిష్ట
– కానీ, రిటైర్డ్ ఆఫీసర్ల వ్యవస్థని కొత్త ప్రభుత్వం కొనసాగిస్తుందా?
– పోలీస్ అకాడమీ లోగుట్టుపై ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనం
Everything In The Academy Is That Retired Officer : బీఆర్ఎస్ పాలనలో రిటైర్డ్ అధికారులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు కేసీఆర్. అదీ, ఇదీ అనే తేడా లేకుండా అన్నిచోట్లా వీళ్ల హవానే కొనసాగింది. ఇందులో తెలంగాణ పోలీస్ అకాడమీ కూడా ఉంది. పదేళ్లుగా పాతుకుపోయి, ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారుల్లో ఒకరు ఇక్కడ ఉన్నారు. ఆయన ఎవరో కాదు ఐ రాఘవరావు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయాక ఈయన పీడ విరగడవుతుందని అనుకుంటే, మళ్ళీ మరో రెండేళ్లు పెంచుకునేందుకు ఫైల్ మూవ్ చేస్తున్నారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీతో పాటు అక్కడ పనిచేసిన డైరెక్టర్ల పరిచయాలతో పైరవీ మొదలు పెట్టారు. పదవీ విరమణ పొంది 15 ఏండ్లు గడుస్తున్నా ఇంకా ఆ పదవిపై యావ చావక, కొనసాగాలని తపనపడుతున్నారు. దీంతో కొత్త అధికారులకు ప్రమోషన్స్ రావడం లేదు. ఒకవేళ వచ్చినా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని డమ్మీ ఆఫీసర్స్‌గా కూర్చుంటున్నారు.
ఓఏస్డీ డీడీగా సంతకాలు
ఏ పోలీస్ అధికారి అయినా రిటైర్డ్ అయితే ఆ పదవికి ఓఎస్డీగా కొనసాగుతారు. కానీ, తన పదవిని బయటపడకుండా ఉండేలా పోలీస్ అకాడమీలో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో సంతకం చేస్తారు ఈ మహానుభావుడు. నిజానికి ఆ హోదా ఎస్పీ అధికారి స్థాయిది. కానీ, ఈయన రిటైర్డ్ అయింది అడిషనల్ సూపరింటెండెంట్ పోలీస్ గా. అంటే రాఘవరావు అర్హతకి, పదవికి, హోదాకి తేడా లేకుండా రిపోర్ట్స్‌పై సంతకాలు చేస్తుంటారని సమాచారం.
Read Also : ఇది జస్ట్ ట్రైలరే..!పిక్చర్ అభీ బాకీ హై..!?
ఆదర్శంగా ఉండాల్సిన చోట అంతా అక్రమాలేనా..?
ఎస్సై, డీఎస్పీ, ఫోరెన్సిక్ సైంటిస్ట్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌తో పాటు కస్టమ్స్, ఎక్సైజ్, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్స్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్‌కు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఔట్ డోర్, ఇన్ డోర్, కంప్యూటర్ కోర్సులతో పాటు సెమినార్స్, వర్క్ షాపులు నిర్వహిస్తారు. అయితే, రాష్ట్రానికే ప్రతిష్టాత్మకంగా, రోల్ మోడల్‌గా ఉండాల్సిన ఈ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్‌లోనే నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. సరైన అధికారులకు సౌకర్యాలు కల్పించకుండా, తాను అనుకునే వారికి మాత్రమే పవర్స్ ఇస్తూ, డైరెక్టర్స్‌కి అత్యంత సన్నిహితంగా ఉంటూ అకాడమీలో జరుగుతున్న లోపాలు ఎక్కడా బయటకు కనపడకుండా మేనేజ్ చేస్తున్నారు. 15 మంది హోంగార్డ్స్‌ని తన ఇంటి వద్ద సొంత పనులు చేసుకుంటూ మీడియాకు దొరికారు ఈ రాఘవరావు. దీంతో ఆ ఫోటోలు తీసిన హోంగార్డ్స్‌ని చిత్రహింసలు పెట్టి, డ్యూటీకి వచ్చినా రాలేదని చెప్పి ఉద్యోగాలు తీయించారు. ఇలా ట్రైనింగ్ సెంటర్ కాస్తా అక్రమాలకు భీజం పడే స్థలంగా కొనసాగుతోంది. ట్రైనింగ్ అయ్యే ఆఫీసర్స్‌కి ఈ విషయాలు తెలిస్తే ప్రతిచోటా ఇంతేనా అనేది నాటుకుపోతోంది. ఇక్కడే నిజాయితీగా, నిబద్దతతో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు ఉండాల్సిన అవసరం ఉంది. అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రతీది ఫైల్ ఉంటుంది. ఇందుకు ఎలాంటి టెక్నికల్ ప్రాముఖ్యత, నైపుణ్యత ఈ అధికారికి ఏమీ లేకపోయినా 15 ఏండ్లుగా కొనసాగించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పుటిదాకా చేసింది చాలదన్నట్టు మళ్లీ పదవిలో కొనసాగేందుకు లాబీయింగ్ కొనసాగిస్తున్నారు.
అందరికీ అక్కడి నుంచే సేవలు
అడ్మిన్ డిప్యూటీ డైరెక్టర్‌గా కొనసాగుతున్న రాఘవరావు రిటైర్డ్ అధికారులను ప్రసన్నం చేసుకోవడంలో దిట్ట. ఎప్పుడూ వాహనాలు అడిగినా, సిబ్బందిని అడిగినా అకాడమీ నుంచే పంపిస్తారు. దీంతో అందరి నోళ్లలో రాఘవరావు పేరు నానుతుంటుంది. కానీ, వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని గుర్తించడం లేదు. అడ్మిన్‌తో పాటు, మినిస్టర్ స్టాఫ్, అకౌంట్స్, మాస్టర్ వింగ్, ఆర్ఐ అడ్మిన్ క్యాంటీన్, ఆర్ఐ మోటర్ వెహికిల్, ఇలా అన్నీ తన గుప్పిట్లోనే ఉంచుకున్నారు. కొత్తగా వచ్చిన అధికారులకు వాహనాలు ఆఫీస్ ఏరియాను కేటాయించకుండా తానే అంతా ఇక్కడ నడిపించేది అనే పవర్ చూపిస్తారు. తన వద్ద పనిచేసే వారందరికీ టూ వీలర్స్ ఇప్పిస్తారు. ఎస్సైలకు కనీసం సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బంది పెడతారనే ఆరోపణలున్నాయి. డైరెక్టర్‌కి ఏ విషయం చేరవేయాలన్నా తను పవర్ సెంటర్‌గా ఉంటూ మరో రెండేడ్లు కొనసాగించేందుకు పావులు కదుపుతున్నారు. మెస్‌లకు ఇంచార్జీలుగా ఉండే అధికారులు అంతా ఈయన చెప్పినట్లే నడ్చుకోవాలి. ఫుడ్ ప్రీ గా వండి కొన్నిచోట్లకు పార్సిల్స్ పంపించిన ఘనత ఈయనకే దక్కుతుంది.
Read Also : వీసా కోసం విద్యార్థుల గోస
రిటైర్డ్ అయినా కూడా గెస్ట్ ఫ్యాకల్టీ పేరుతో తిష్ట
12 ఏండ్లు మాత్రమే సర్వీస్ చేసి ఈ ఏడాది ఫిబ్రవవరిలో కంఫర్డ్ ఐపీఎస్‌గా రిటైర్డ్ అయ్యారు అకాడమీలో కోచ్ డైరెక్టర్ అనసూయ. పదవీ విరమణ కాగానే గెస్ట్ ఫ్యాకల్టీగా కొనసాగిస్తూ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో అమె పాత హోదాలోనే సంతకాలు చేస్తున్నారు. ఈమె ఆఫీస్ చైర్, సౌకర్యాలు చూస్తుంటే గతం కంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. పదవి పొడిగించేందుకు ఫైల్ డిఫ్యూటీ సీఏం వద్దకు వెళ్లింది. ఇంతలోనే ఎలక్షన్ కోడ్ రావడంతో అది అక్కడే ఆగిపోయింది. కానీ, ఆమె పొజిషన్‌లో సంతకాలు ఎక్కడా మార్పు లేదు. గెస్ట్ ఫ్యాకల్టీ అంటూ ఇచ్చిన ఉత్తర్వులతోనే అకాడమీలో ట్రైనింగ్ ఎస్సైలకు సెలవులు ఇవ్వాలన్న ఆమెనే ఇవ్వాలి. షెడ్యూల్ ఆమే వేస్తున్నట్లు చెప్పుకుంటున్నా దానికి ఎప్పటి నుంచో ఓ వ్యవస్థ ఉంది. ఈ హోదాలో ముగ్గురు ఎస్పీలు ఉన్నా వారికి కనీసం వాహనాలు కూడా అరేంజ్ చేయని స్థితి పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో కొనసాగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
-దేవేందర్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్)