Tuesday, June 18, 2024

Exclusive

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

– కేబినెట్ సమావేశానికి బ్రేక్
– పర్మిషన్ ఇవ్వని ఈసీ
– భేటీని వాయిదా వేసిన సీఎం రేవంత్ రెడ్డి
– అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఈసీని కలవాలని నిర్ణయం
– ఇరిగేషన్ శాఖపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష

CM Revanth Reddy: రాష్ట్ర మంత్రివర్గం సమావేశానికి బ్రేక్ పడింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఏపీ పునర్విభజనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలపై చర్చ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రధాన కార్యదర్శితోపాటు అన్ని విభాగాల అధికారులు కేబినెట్ భేటీకి సిద్ధం అయ్యారు. శనివారం రాత్రి 7 గంటల వరకు సమావేశం కోసం వేచి చూశారు. కానీ, ఎన్నికల సంఘం నుంచి కేబినెట్ భేటీకి అనుమతి రాలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాన్ని వాయిదా వేశారు. ఈసీ త్వరలో అనుమతి ఇస్తుందని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం లోపు అనుమతి రాకపోతే, అవసరమైతే మంత్రులతో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నట్టు సీఎం చెప్పారు.

రెండు మూడు రోజులుగా కేబినెట్ సమావేశం ఉంటుందని అందరూ ప్రిపేర్ అయ్యారు. అనుమతి ఇవ్వాలని సీఎం శాంతికుమారి ఈసీకి లేఖ రాశారు. కానీ, అందుకు అనుమతించలేదు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. తెలంగాణలో నాలుగో విడత పోలింగ్‌లో భాగంగా ఎన్నికలు ముగిశాయి. చివరి ఏడో విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. అనుమతి లభించకపోవడంతో కేబినెట్ సమావేశం జరగాల్సిన సమయానికి సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో ఎన్‌డీఎస్ఏ రిపోర్టు, కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరిపారు.

Also Read: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

కేబినెట్ సమావేశం జరిగి ఉంటే అందులో చాలా విషయాలపై సమీక్ష చేసేవారు. ముఖ్యంగా ఏపీ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై డిస్కషన్ జరిగేది. ఆస్తుల విభజన, హైదరాబాద్‌లోని ఏపీకి కేటాయించిన భవనాల స్వాధీనం, ఏపీ నుంచి రావాల్సిన బకాయిల వివాదాలపై చర్చ జరిగేది. అలాగే, రైతు రుణమాఫీ, నిధుల సమీకరణ, నూతన ఆదాయ మార్గాలపైనా మంత్రివర్గం నిర్ణయం తీసుకునేది. అదే విధంగా మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోళ్ల తీరునూ సమీక్షించేది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న సందర్భంలో విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫాంల పంపిణీ, విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించేవారు మంత్రులు. కానీ, ఈసీ పర్మిషన్ ఇవ్వలేదు.

Publisher : Swetcha Daily

Latest

IPS Officers: 28 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

Police Dept: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది....

Vinayaka Chavithi: ఖైరతాబాద్ గణేషుడికి కర్రపూజ

- విగ్రహ నిర్మాణ పనులు షురూ - 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి -...

Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

- మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. అప్పుడే కుండపోత - రాష్ట్రంలో మూడు రోజులు...

Loans: అడ్డగోలు రుణాలు.. రికవరీ తిప్పలు

- రికవరీ టార్గెట్లు ఫిక్స్ చేసిన నిజామాబాద్ డీసీసీబీ - నిబంధనలకు విరుద్ధంగా...

Kakatiya University: కేయూలో మళ్లీ పీహెచ్‌‘ఢీ’

- ఆందోళనబాట పట్టిన విద్యార్థులు - ప్రభుత్వం వేసిన కమిటీ సూచనలకు భిన్నంగా...

Don't miss

IPS Officers: 28 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

Police Dept: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది....

Vinayaka Chavithi: ఖైరతాబాద్ గణేషుడికి కర్రపూజ

- విగ్రహ నిర్మాణ పనులు షురూ - 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి -...

Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

- మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. అప్పుడే కుండపోత - రాష్ట్రంలో మూడు రోజులు...

Loans: అడ్డగోలు రుణాలు.. రికవరీ తిప్పలు

- రికవరీ టార్గెట్లు ఫిక్స్ చేసిన నిజామాబాద్ డీసీసీబీ - నిబంధనలకు విరుద్ధంగా...

Kakatiya University: కేయూలో మళ్లీ పీహెచ్‌‘ఢీ’

- ఆందోళనబాట పట్టిన విద్యార్థులు - ప్రభుత్వం వేసిన కమిటీ సూచనలకు భిన్నంగా...

IPS Officers: 28 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం

Police Dept: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది. ఏకకాలంలో 28 మంది ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాత్కాలికంగా...

Vinayaka Chavithi: ఖైరతాబాద్ గణేషుడికి కర్రపూజ

- విగ్రహ నిర్మాణ పనులు షురూ - 70 అడుగుల ఎత్తుతో మహాగణపతి - కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం Khairatabad Ganesh: వినాయక చవితి ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణేషుడి విగ్రహానికి ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ...

Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

- మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. అప్పుడే కుండపోత - రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు - పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ Telangana: హైదరాబాద్‌లో సోమవారం వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు...