Double Ismart Mass Lyrical Song Is Out Now:టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాంఛైజీ ప్రాజెక్ట్ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది.
ఈ మూవీ నుంచి ఫస్ సింగిల్ స్టెప్పామార్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా ఈ సాంగ్ నిలిచిపోనుందని తాజా విజువల్స్‌తో క్లారిటీ ఇచ్చేసింది ఇస్మార్ట్ టీం. మాస్ మ్యూజిక్ జాతర ఉండబోతుంది, వేచి ఉండండి.. అంటూ డబుల్ ఇస్మార్ట్ గెటప్‌లో స్టైలిష్‌గా నడుచుకుంటూ వెళ్తున్న రామ్ లుక్‌తో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇస్మార్ట్ శంకర్‌కు స్పీకర్ దద్దరిల్లిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేసినట్టు తెలుస్తోంది.
Also Read: విక్రమ్ మూవీపై సాలిడ్ అప్‌డేట్
డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్ విలన్‌గా యాక్ట్ చేస్తున్నాడు. ఆగస్టు 15న వరల్డ్‌వైడ్‌గా పాన్ ఇండియా రేంజ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ధిమాక్కిరికిరి డబుల్ ఇస్మార్ట్ అంటూ ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇది చూసిన రామ్ ఫ్యాన్స్ మళ్లీ తన ఖాతాలో హిట్ ఖాయమంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.