Do You Know Om Bheem Bush OTT Streaming Somewhere : టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, కమెడియన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మెయిన్ రోల్స్ పోషిస్తున్న లేటెస్ట్ మూవీ.. ఓం భీం బుష్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైన్‌గా వచ్చిన ఈ మూవీ యంగ్ అంగ్ డైనమిక్ డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కించబోతున్నారు. నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాఫ్షన్‌తో వచ్చిన ఈ మూవీ మార్చి 22న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. క్యాఫ్షన్‌కు తగ్గట్టుగానే లాజిక్స్‌కి చాలా దూరంగా ఓన్లీ మ్యాజిక్ వర్కౌట్ అయిన ఈ మూవీ తగ్గట్టుగానే ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటోంది. ఫస్ట్ హాఫ్ కామెడీ, సెకండ్ హాఫ్ హారర్ అండ్ కామెడీ ఎలిమెంట్స్‌తో సాగిన ఈ మూవీకి ఆడియెన్స్ నుండి పాజిటివ్ టాక్‌ని మూటకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌ని సొంతం చేసుకుని కలెక్షన్లను రాబడుతోంది.
ఇదిలా ఉంటే… తాజాగా ఓం భీం బుష్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం మీకు తెలిసిందే. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఓం భీం బుష్ థియేట్రికల్ రిలీజ్ తరువాత కనీసం నెలరోజుల గ్యాప్ తరువాత ఓటీటీలో రిలీజ్ చేయాలని… ఆ దిశగా చూసుకుంటే ఓం భీం బుష్ మూవీ ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే ఛాన్స్ ఉంది.
Read Also : గుడ్‌న్యూస్, ఓటీటీలోకి ఫైటర్
అయితే.. ఈ మధ్య చాలా సినిమాలు నెలరోజుల కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చి ఆడియెన్స్‌ని అలరిస్తున్నాయి. అదేవిధంగా ఓం భీం బుష్ మేకర్స్ కూడా అనుకున్న డేట్ కన్నా ముందే ఓటీటీలో రిలీజ్ చేశారా లేక నెలరోజుల తరువాత స్ట్రీమింగ్ చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఫస్ట్ పార్ట్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఓం బీం బుష్ మూవీ రానున్న రోజుల్లో మంచి కలెక్షన్లను రాబట్టే ఛాన్స్ ఉంది. మార్చి 29 వరకు వేరే మూవీలు కూడా లేవు కాబట్టి ఈ మూవీకి అదే ప్లస్ కానుంది.