Director Actor Sunder About Baak Movie: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు భారీగా డిమాండ్ పెరిగింది. ప్రపంచంలోని అన్ని భాషల మూవీస్ వెబ్‌సిరీస్‌లు అన్నిరకాల జానర్లు మూవీ ఫ్యాన్స్‌కి దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం సౌత్‌లో హర్రర్ జానర్ మూవీస్ హడావుడి అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి.దీంతో మూవీస్ చూసే విధానంలో భారీ ఛేంజెస్ వచ్చాయి.
రోటీన్‌కి భిన్నంగా ఉన్న మూవీస్‌నే జనం ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు. థియేటర్లలోకి వచ్చే మూవీస్ రెగ్యూలర్‌గా ఉందని తెలిస్తే చాలు అలాంటి మూవీస్‌ని పట్టించుకోవడం మానేశారు పబ్లిక్. దీంతో మూవీ మేకర్స్ కూడా తమస్టైల్‌ను మార్చుకుని క్రమంగా ఆడియెన్స్ నాడిని పట్టుకుంటూ మూవీస్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఈక్రమంలోనే ప్రస్తుతం సౌత్‌లో హర్రర్ జానర్ చిత్రాల హాడావుడి రెట్టింపయింది. ఆడియెన్స్ టేస్ట్‌కు తగ్గట్టు మూవీస్‌ని రూపొందిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు.
Also Read: బికినీలో షాకిచ్చిన సీరియల్ నటి
ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే డజన్‌కు పైగా మూవీస్, వెబ్‌సిరీస్‌లు ఆడియెన్స్ ముందుకు వచ్చాయంటే ఆడియెన్స్ టేస్ట్ ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ యేడాది ఇప్పటికే భ్రమయుగం, భూతద్దం భాస్కర నారాయణ, తంత్ర, వళరి, గీతాంజలి మళ్లీ వచ్చింది, ఓం భూం భుష్, సైథాన్, బాక్, ఊరు పేరు భైరవ కోన, 105 మినిట్స్, ఇంటి నెం 13, టెరోట్ వంటి సినిమాలు డజన్‌కు పైగా థియేటర్లలో రిలీజై ప్రేక్షకాధరణ పొందగా ఇన్‌స్పెక్టర్ రిషి వంటి అరడజన్ వరకు వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ అయి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్‌ని సంపాదించుకున్నాయి.