MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారానికి సంబంధిచి ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్లు వేయగా.. న్యాయమూర్తి కావేరి బవేజా తోసిపుచ్చారు. రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం ఆమె పిటిషన్లు వేశారు. తాజాగా సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారించింది. కవిత్ బెయిల్ పిటిషన్ పై స్పందించాలని ఢిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు పంపింది. తదుపరి విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది.
ఇది వరకే ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారించింది. కవిత బెయిల్ పై స్పందించాలని మే 10వ తేదీన ఈడీకి హైకోర్టు నోటీసులు పంపింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ పై మే 24వ తేదీన ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది.
Also Read: ఆలస్యం.. అమృతం.. విషం! సాహితీ బాధితుల ఆవేదన
లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కవితను మార్చి 15న అరెస్టు చేసింది. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌పై తిహార్ జైలులో ఉన్నారు. ఇటీవలే ఆమె జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మే 20వ తేదీ వరకు పొడిగించింది.