Monday, July 22, 2024

Exclusive

America : ఈ ఆట ‘ప్రాణాలతో సయ్యాట’

  • యువకుల ప్రాణాల మీదకు తెస్తున్న ఆన్ లైన్ డెత్ గేమ్
  • వరుస మరణాలకు కారణం అవుతున్న బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్
  • అమెరికాలో ఎన్ఆర్ఐ విద్యార్థుల వరుస మరణాలు
  • మొదట్లో సులభమైన టాస్కులు ఇచ్చే క్యూరేటర్
  • 50 రోజుల్లో ఆటగాడి మానసిక స్థితి పై ప్రభావం
  • 16 మంది యువకుల ఆత్మహత్యకు ప్రేరేపించిన గేమ్
  • నేరం అంగీకరించిన గేమ్ సృష్టికర్త బుడెకిన్ అరెస్ట్
  • స్మార్ట్ ఫోన్ వాడే చిన్నపిల్లలపై పేరెంట్స్ ఫోకస్ పెట్టాలి

Dangerous Bluewhale game kills Youth : ఆటలు రెండు రకాలు ఒకటి శారీరక శ్రమతో ఆడేది ఇంకొకటి ఇండోర్ గేమ్..అయితే నేటి యువతకు ఈ రెండింటినీ మించిన ఆట తెలుసు అదే ఆన్ లైన్ గేమ్. ఇదొక జాఢ్యం..పట్టుకుంటే వదలని వ్యసనం. పర్యవసానం మరణం. అప్పట్లో పబ్జీ గేమ్ ఆడిన యువత దాని ఫలితంగా వచ్చిన దుష్ఫలితాలను చవిచూసింది. భారత ప్రభుత్వం ఈ ఆటను నిషేదించింది. అయితే వాటి స్థానంలో వేరే గేమ్స్ పుట్టుకొస్తునే ఉన్నాయి. అయితే అత్యంత ప్రమాదకర ఆన్ లైన్ గేమ్స్ కూడా మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒకటి బ్లూవేల్‌ ఛాలెంజ్‌ గేమ్.

అమెరికాలో చదువుకుంటున్న భారతీయ, భారత సంతతి విద్యార్థులు వరసగా ప్రాణాలు కోల్పోతుండటం కలకలం రేపుతోంది. మసాచుసెట్స్‌ యూనివర్సిటీకి చెందిన భారత విద్యార్థి గత నెల ప్రారంభంలో శవమై కనిపించాడు. ఆ ఆత్మహత్యకు ‘బ్లూవేల్‌ ఛాలెంజ్‌’ అనే గేమ్‌ కారణమని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనిని ఆత్మహత్య కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. ఓ గేమ్‌ కారణంగా అతడు మృతి చెంది ఉంటాడా? అని ప్రశ్నించగా.. ‘‘దానిపై మాకు ఎలాంటి సమాచారం లేదు. ఈ కేసును మూసివేయడానికి ముందు వైద్య పరీక్షల తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం’’ అని చెప్పారు. చనిపోవడానికి ముందు ఆ విద్యార్థి రెండు నిమిషాల పాటు ఊపిరి బిగపట్టినట్లు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ మీడియా పేర్కొంది. ఈ తరుణంలో ఈ సూసైడ్‌ గేమ్‌ గురించి మరోసారి చర్చ మొదలైంది.

అసలేంటీ బ్లూవేల్‌ ఛాలెంజ్‌..?

మొదట్లో సులభమైన టాస్క్ లను ఇస్తారు. అది వ్యసనంగా మారిపోతుంది. ఇలా 50 రోజుల్లో మానసిక స్థితి మారిపోతుంది. గేమ్ ఆడేవారు స్వతహాగా ప్రాణాలు తీసుకునే స్థాయికి ప్రేరేపించబడతారు. దుర్భలమైన మానసిక స్థితి గల ప్లేయర్లను ఎంచుకోవడం ద్వారా ఈ గేమ్ నడుస్తుంది. సోషల్ మీడియాలో క్యూరేటర్లు ఇలాంటి ప్లేయర్లను ఎంచుకుంటారు. 16 మంది యువకుల ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలతో ఈ గేమ్ సృష్టికర్త బుడెకిన్ ను అరెస్ట్ చేశారు. అతను నేరాన్ని అంగీకరించాడు. బుడెకిన్ ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. మొదట రష్యాలో మొదలైన ఈ ఆన్‌లైన్‌ గేమ్‌.. ఆటగాళ్లను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. దీనివల్ల పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు గతంలో కథనాలు వెలువడ్డాయి. కానీ ఆ కేసులు అధికారిక ధ్రువీకరణకు నోచుకోలేదు. దాంతో అనుమానిత బ్లూవేల్‌కు సంబంధించిన నెట్‌వర్క్‌లను పలు దేశాలు మూసివేశాయి.

ప్రమాదకరమైన టాస్కులు

ఈ ఆటలో సుమారు 50 రోజుల పాటు ఒక క్యూరేటర్‌ ఆటగాళ్లకు పలు ప్రమాదకర టాస్క్‌లను ఇస్తుంటాడు. అందులో మొదటి టాస్క్‌ల్లో భాగంగా మధ్య రాత్రిలో నిద్ర లేవడం, భయానక దృశ్యాలు వీక్షించడం వంటివి ఉండొచ్చు. ఆ తర్వాత ఆ టాస్క్‌ల తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఎత్తైన టవర్ల అంచున నిల్చోవడం, చేతులపై గాయాలు చేసుకోవడం వంటివీ ఉంటాయి. చివరిగా ఆటగాళ్లను ప్రాణాలు తీసుకోమని అడగొచ్చు. ఒకసారి ఈ గేమ్‌లోకి ప్రవేశిస్తే తర్వాత బయటపడటం దాదాపు అసాధ్యం. బెదిరించి, మానసికంగా తప్పుదోవ పట్టించి టాస్క్‌లు పూర్తిచేసేలా చూస్తుంటారు. ఉద్దేశపూర్వకంగా నీటి నుంచి ఒడ్డుకు వచ్చి, ప్రాణాలు తీసుకునే తిమింగలం (బ్లూవేల్‌) ప్రవర్తన ఆధారంగానే ఈ గేమ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. 2015 చివర్లో రష్యా టీనేజర్‌ ఆత్మహత్యతో ఇది ప్రచారంలోకి వచ్చింది.

తల్లిదండ్రులూ ఓ కంట కనిపెట్టండి..!

బ్లూవేల్‌ ఛాలెంజ్‌ కొత్తదేమీ కాదు. ఐదారేళ్ల క్రితం కూడా దీని గురించి పెద్దఎత్తున చర్చ జరిగింది. తాజాగా అమెరికాలోని మరణాలతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఒక్క బ్లూవేల్‌ అనే కాదు. ఇలాంటి కొత్త కొత్త ఛాలెంజులు నెట్టింట ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తుంటాయి. ముఖ్యంగా యువత వీటికి బాధితులవుతున్నారు. వారిని ఇలాంటి ఛాలెంజులకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ వినియోగంపై నిత్యం కన్నేసి ఉంచాలి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాల్లో వారు ఎలాంటి పోస్టులను షేర్‌ చేస్తున్నారో పరిశీలిస్తూ ఉండాలి. వాళ్ల మనసులోని భావాలను స్వతంత్రంగా మీతో పంచుకోగలిగే స్వేచ్ఛనివ్వాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. దూరంగా కూర్చొని ఏడవడం, బాధపడటం లాంటివి చేస్తుంటే వాళ్లతో మాట్లాడి విషయం తెలుసుకోవాలని సూచిస్తున్నారు. పిల్లలతో ప్రేమగా మెలగడం ద్వారా ఇలాంటి బారిన పడకుండా చూడొచ్చని చెబుతున్నారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

International :ఛాన్స్ ఇస్తే మారణహోమం ఆపేస్తా

రష్యా -ఉక్రెయిన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఎంతమాత్రం సాధ్యం కాదంటున్న రష్యా ఉక్రెయిన్ సమస్య ఒక్క రోజుతో పరిష్కారమయ్యేది కాదన్న రష్యా బలమైన అధ్యక్షుడు ఉంటే యుద్ధం జరిగేది...

International news:కిమ్ అరాచకం

దక్షిణ కొరియా పాటలు విన్నాడని బహిరంగంగా ఉరి మితిమీరిపోయిన కిమ్ నియంతృత్వ ధోరణి దక్షిణ హ్వాంగ్‌హే ప్రావిన్స్‌‌‌కు చెందిన వ్యక్తికి కఠిన శిక్ష శతృదేశాలకు చెందిన సినిమాలు, పాటలపై నిషేధం మానవహక్కుల...

International: భారతీయులూ.. బయటకు రావద్దు

అలర్ట్ జారీ చేసిన కెన్యా లోని భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ పన్నుల పెంపునకు నిరసనగా కెన్యాలో దేశవ్యాప్త ఆందోళనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్న ఆందోళనలు పార్లమెంట్ ప్రాంగణంలో మిన్నంటిన గొడవలు ...