Custody @ 2 Praneet Rao 2nd Day of Trial : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు విచారణ కొనసాగుతోంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అతడ్ని విచారిస్తున్నారు పోలీసులు. రెండో రోజు పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేసి విచారణ జరిపారు. లోపలికి ఎవరినీ అనుమతించకుండా ప్రణీత్ నుంచి కూపీ లాగే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఎస్ఐబీలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ పూర్తయింది.
రీ ట్రైవ్ చేసిన వాట్సాప్ చాటింగ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరితోపాటు మరో ముగ్గురు అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు. ప్రణీత్ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు ప్రమేయంపై దర్యాప్తు అధికారులు ఓ అంచనాకు వచ్చారు.
Read More: మాయం, చేజేతులా నాశనం
నాయకుల ఫోన్స్ ట్యాప్ చేసినట్టు ప్రణీత్ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఏఏ పార్టీలకు చెందిన నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు? ఎంతమంది ఫోన్లను ట్యాపింగ్ లిస్టులో చేర్చారు అనే వివరాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. ప్రణీత్‌కు సహకరించిన పోలీసుల వివరాలను కూడా సేకరిస్తున్నారు.