Cricket Player Manish Pandey Wife Ashrita Shetty Divorce Rumours Goes Viral: ఇటీవల చాలామంది సెలబ్రిటీలు విడాకుల విషయం నేరుగా చెప్పకుండా ఇలా ఫొటోలు డిలీట్ చేసి సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా ఇందులోకి టీమిండియా క్రికెటర్ మనీశ్ పాండే ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తన భార్య, కన్నడ నటి ఆశ్రిత శెట్టితో అభిప్రాయ భేదాలు వచ్చాయని రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ జంట డైవర్స్‌కు రెడీ అవుతున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి ఓ రీజన్ ఉంది. అదేంటంటే మనీశ్ పాండే ఆశ్రిత శెట్టి నెట్టింట తమ పెళ్లి ఫొటోలను తొలగించడమే ఇందుకు ప్రధాన కారణం.
ఈ నేపథ్యంలో మనీశ్ ఆశ్రితల విడాకుల గురించి చర్చ నెట్టింట రచ్చ అవుతోంది. కాగా ఉత్తరాఖండ్‌కు చెందిన మనీశ్ పాండే 2015లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు.34 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ భారత్ తరఫున మొత్తంగా 29 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడి, ఆయా ఫార్మాట్లలో వరుసగా 566,709 రన్స్ చేశాడు. మనీశ్ పాండేకు జాతీయ జట్టులో ఎక్కువగా ఛాన్స్‌లు రాకపోయినా ఐపీఎల్‌లో మాత్రం మంచి రికార్డు ఉంది. ఈ ఏడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్య వహించాడు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ చాంపియన్‌గా నిలవడంలో తన వంతు సాయం చేశాడు.
Also Read: వెస్టిండీస్‌పై విరుచుకుపడ్డ ఇంగ్లండ్
మరోవైపు కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ఆశ్రిత శెట్టి తొలుత మోడల్‌గా రాణించింది. అనంతరం తెలికెడ బొల్లి అనే మూవీతో 2012లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. 2019లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఎప్పటికప్పుడు తమ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకునే ఈ జంట. ఉన్నట్టుండి అకస్మాత్తుగా తమ పెళ్లి ఫొటోలు డిలీట్ చేసి ఇలా షాకిచ్చారు. దీంతో వీరిద్దరి వార్త వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వార్త విన్నవారంతా ఇందులో తప్పేముందని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.