Tuesday, December 3, 2024

Exclusive

England : కోవీషీల్డ్ ప్రాణాంతకమే!

  • ఆక్స్‌ఫర్డ్ కలిసి కోవీషీల్డ్ అభివృద్ధి చేసిన బ్రిటిష్ ఫార్మాస్యూటికల్
  • కోవీషీల్డ్ తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు నిజమేనని అంగీకారం
  • ఈ మేరకు యూకే హైకోర్టుకు తెలిపిన ఆస్ట్రాజెనెకా
  • ఆస్ట్రాజెనెకాపై రూ. 1000 కోట్లకు దావా
  • ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి టీకాను అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా
  • భారత్‌లో కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేసిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్
  • రక్తం గడ్డకట్డడం, ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడానికి వ్యాక్సిన్ కారణం
  • విదేశాలలో పలు కేసులు నమోదు
  • ముందే హెచ్చరించిన భారత నిపుణులు
  • అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన కేంద్రం

Covishield vaccine side effects criminal cases:
ప్రాణాలు కాపాడవలసిన మందులు ప్రాణాలు హరించేవిగా మారుతున్నాయి. కోవిడ్ సమయంలో లక్షలాది మంది నమ్మి వేసుకున్న వ్యాక్సిన్లు నేడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. కరోనా మహమ్మారి అధికంగా విజృంభించిన సమయంలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ‘ఆస్ట్రాజెనెకా’ కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందించింది. అయితే ఆ వ్యాక్సిన్ దుష్ప్రభావానికి కారణమవుతుందని ఇటీవల అంగీకరించింది.
ఆస్ట్రాజెనెకా అందించిన కోవిషీల్డ్ కొన్ని సందర్భాల్లో బ్లాట్ క్లాట్స్, తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌కు దారితీసే అవకాశం ఉందని వ్యాక్సిన్ తయారీదారు వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే ఉత్పత్తి చేసింది. దీనిని దేశంలో విస్తృతంగా ఉపయోగించారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ అనేక సందర్భాల్లో మరణానికి లేదా తీవ్ర గాయాలకు కారణమైందని 51 మంది బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని కోరుతూ యూకే హైకోర్టులో ఇప్పటికే ఫిటిషన్ వేశారు. జామీ స్కాట్ 2021 ఏప్రిల్‌లో న్యాయపోరాటం ప్రారంభించారు. ఆ తరువాత చాలామంది దీనిపై కేసులు వేయడం మొదలుపెట్టారు.

వ్యాక్సిన్ తో దుష్ప్రభావం

ప్రారంభంలో ఆస్ట్రాజెనెకా కంపెనీ క్లెయిమ్‌లను వ్యతిరేకించింది. అయితే ఇటీవల కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో.. టీటీఎస్ (థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్) రక్తం గడ్డకట్టడం, బ్లడ్ ప్లేట్‌లెట్ కౌంట్‌ తక్కువవుతుందని అంగీకరించింది.
కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో గుండె, రక్త సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయనే వార్తలు కలవరపెట్టాయి! వాటికి బలం చేకూర్చేలా ఈ మధ్యకాలంలో పెరుగుతున్న గుండె, మెదడు, రక్త సంబంధిత వ్యాధులకు కరోనా వ్యాక్సిన్లే కారణమని తాజా అధ్యయనం గుర్తించింది. వివిధ దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. ఆ వివరాలను వ్యాక్సిన్‌ అనే సైన్స్‌ జర్నల్‌లో నివేదించారు.

ఎనిమిది దేశాల్లో పరిశోధనలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పరిశోధనా విభాగమైన గ్లోబల్‌ వ్యాక్సిన్‌ డేటా నెట్‌వర్క్‌కు చెందిన పరిశోధకులు గతంలోనే కొన్ని వ్యాక్సిన్లపై అధ్యయనం నిర్వహించారు. ఈ క్రమంలో కొవిడ్‌-19 వ్యాక్సిన్లు 13 రకాల ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేశాయని వారు వెల్లడించారు. భారత్‌ మినహా… అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, న్యూజిలాండ్‌, స్కాట్లాండ్‌ వంటి దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న 9.9 కోట్ల మందిపై వారు అధ్యయనం నిర్వహించారు. ఈ క్రమంలో కొన్ని రకాల ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో గుండె కండరాల వాపునకు కారణమయ్యే మయోకార్డిటిస్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని గుర్తించారు. దీనితోపాటు గులియన్‌ బారె సిండ్రోమ్‌, పెర్కిర్డిటిస్‌, సెరిబ్రల్‌ వీనస్‌ సైనస్‌ థ్రాంబోసిస్‌ వంటి కేసులు 1.5 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు.

అనుమతి ఇచ్చి ఉండకూడదు..

మనం దేశంలో రెండేళ్ల క్రితం కరోనా సెకండ్ ఫేజ్ సమయంలో కోవీషీల్డ్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు ఇచ్చింది. 18 ఏళ్లు నిండిన వారికి రెండు డోసులు ఇవ్వాలని సూచించింది. బూస్టర్ డోసుకు కూడా అనుమతులు ఇచ్చింది. అయితే డాక్టర్ మల్హోత్రా మాత్రం ఈ వ్యాక్సిన్ అనుమతులు ఇచ్చి ఉండకూడదని గట్టిగా వాదిస్తున్నారు. దీనిని ఎన్ని డోసులు వేసుకుంటే అన్ని రెట్ల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని అప్పట్లోనే హెచ్చరించారు.

డాక్టర్ మల్హోత్రా ఆనాడే చెప్పారు

అప్పట్లో డాక్టర్ మల్హోత్రా ఎంఆర్ఎన్ఏ కోవిడ్ 19 వ్యాక్సిన్ ల ప్రభావాలు, తీసుకోవాల్సిన సేఫ్టీ విధానాలపై అధ్యయనం చేస్తున్న బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ అధ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలు పీర్ రివ్యూడ్ జోర్నల్ లో ప్రచురించారు. అందులో ఆయన ఆక్స్ ఫోర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్, ఫైజర్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కన్నా చాలా ప్రమాదకరమని నిర్ధారించినట్లు పేర్కొన్నారు. దీని వల్ల తీవ్ర గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు వివరించారు. అసలు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను యూకేలో నిషేధించినప్పుడు ఇండియాలో అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అలాగే ఈ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్, జర్మనీ వంటి దేశాలు నిషేధించాయి. ఈ వ్యాక్సిన్ వినియోగం కారణంగా రక్తంలో క్లాట్స్ వచ్చినట్లు గుర్తించామని డాక్టర్ మల్హోత్రా వివరించారు. వివిధ దేశాల్లో మొత్తం 9.7 మిలియన్ల డోసులు మనిషులకు వేయగా వారిలో 8,00,000 మందిలో ఈ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని వివరించారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...

Hyderabad: గుండె ‘చెరువు’ అవుతోంది

దురాక్రమణదారుల కబ్జా కోరల్లో నగర చెరువులు టీ.సర్కార్ వెబ్ సైట్ లో కేవలం 19,314 చెరువుల సమాచారం చెరువుల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించిన గత పాలకులు ఉన్న చెరువులనైనా కాపాడుకోవడానిక...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...