Saturday, May 18, 2024

Exclusive

TPCC : అధికారమే లక్ష్యం, అవిశ్వాసమే ఆయుధం..

– జీహెచ్ఎంసీపై పట్టుకు కాంగ్రెస్ వ్యూహాలు
– 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల్లో పాగాకు రంగం
– నగరంలోని 4 ఎంపీ సీట్లతో బాటు మేయర్ పీఠంపై కన్ను
– ఇప్పటికే హస్తగతమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు
– బయటికొస్తున్న గులాబీ అసంతృప్తుల చేతనే అవిశ్వాసాలు
– నెలాఖరుకు మెజారిటీ స్థానిక సంస్థల్లో పట్టుకు రూట్ మ్యాప్

Congress Strategies To Control GHMC, Route Map: తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి పీసీసీ పెద్దలు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు మద్దతు లభించినప్పటికీ రాజధాని హైదరాబాద్‌ నగర పరిధిలోని సీట్లనే బీఆర్ఎస్ గెలుచుకుంది. దీంతో రాజ్యమంతా చేతిలో ఉన్నా రాజధాని దూరమైందనే భావన ఆ పార్టీ నేతల్లో ఉంది. నగర పరిధిలోని నాలుగు లోక్‌సభ స్థానాలతో బాటు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ పై చేయి సాధించటానికి విస్తరణ వ్యూహమే సరైందనని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం బీఆర్ఎస్ చేతిలో ఉన్న నగర శివార్లలోని స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలు పెడుతూ ఒక్కొక్క ప్రాంతంలో తన పట్టును పెంచుకుంటూ పోతోంది.

హైదరాబాద్ నగర శివారులో మొత్తం ఏడు కార్పొరేషన్లు, 30 మునిసిపాలిటీలున్నాయి. వీటిలో బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ్ పేట్, మీర్ పేట్ కార్పొరేషన్లు. ఇవిగాక 5 జిల్లాల పరిధిలోని 30 మున్సిపాలిటీలున్నాయి. వీటిలో రంగారెడ్డి జిల్లాలోని పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, జల్‌పల్లి, షాద్‌నగర్, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకరపల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలు, మేడ్చల్‌ – మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్‌ మునిసిపాలిటీలుండగా, భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి మునిసిపాలిటీలు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఉన్నాయి. ఇవిగాక, సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగారెడ్డి, బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్, చేర్యాల మున్సిపాలిటీలు, మెదక్‌ జిల్లా పరిధిలోని తూప్రాన్, నర్సాపూర్‌ మునిసిపాలిటీలున్నాయి.

Also Read: కేసీఆర్ టూర్లో‌ జేబుదొంగలు.. స్పందన కరువు..!

కార్పొరేషన్ల విషయానికి వస్తే.. ఇప్పటికే జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌ శాంతి కాంగ్రెస్‌‌లో చేరిపోయారు. అటు.. బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌‌లో అవిశ్వాసం నెగ్గటంతో ఇది కాంగ్రెస్‌ పరమైంది. ఇక్కడ మేయర్‌ ఎన్నికే మిగిలింది. తాజాగా నిజాంపేట మేయర్ నీలారెడ్డి రాకతో ఆ కార్పొరేషన్ కూడా చేజిక్కినట్లే. ఇక మిగిలిన బోడుప్పల్, పీర్జాదిగూడ, మీర్ పేట, బడంగ్ పేట కార్పొరేషన్ల పరిధిలోని నేతలు.. అవిశ్వాస వ్యూహాలు రచిస్తు్న్నారు. ఇదే సమయంలో ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఇప్పటికే అవిశ్వాసాల్లో గెలిచి వాటిని కైవసం చేసుకోగా, నార్సింగి, నాగారం, దమ్మాయిగూడ, పోచారం మున్సిపాలిటీల్లో అవిశ్వాసానికి రంగం సిద్దమవుతోంది. ఈ నెలాఖరు నాటికి మూడొంతుల స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసి, నగర పరిధిలోని లోక్‌సభ స్థానాలను చేజిక్కించుకోవాలనే దిశగా కాంగ్రెస్ వ్యూహాలు సాగుతున్నాయి.

అభివృద్ధి ఎజెండా

బీఆర్‌ఎస్ పరాజయం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో, బీఆర్ఎస్ చేతిలో ఉన్న స్థానిక సంస్థల పాలకవర్గాల్లో మార్పు మొదలైంది. పలు కారణాలతో అసంతృప్త బీఆర్ఎస్ ప్రతినిధులు నెమ్మదిగా తమ గళం విప్పారు. దీనికి తోడు రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులు జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమనే భావనతో మరికొందరు వీరికి తోడవుతూ వచ్చారు. ఇటు కాంగ్రెస్ ఈ పరిస్థితిని చక్కగా వినియోగించుకుని, అవిశ్వాసాల పేరుతో ఒక్కో మున్సిపాలిటీలో జెండా ఎగరేస్తూ వచ్చింది. అటు రాష్ట్ర వ్యాప్తంగా మాజీ మంత్రులు, ఎమ్మె్ల్యేలు కాంగ్రెస్‌లో చేరటంతో స్థానిక సంస్థల్లోనూ ఈ ట్రెండ్ ఊపందుకుంది. స్థానిక నేతలకు బాధ్యతలు అప్పగించి కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో మాట్లాడించటం, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి అనే ప్రచారమూ చేరికల వేగం పెరుగుతోంది.

Also Read: ఓడిపోయినా వాస్తును వదలని కేసీఆర్!.. అప్పుడు సెక్రెటేరియట్, ఇప్పుడు తెలంగాణ భవన్

సీఎం వ్యూహం

ప్రస్తుత కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీ కాలాలు పూర్తయిన వెంటనే వాటికి స్పెషలాఫీసర్లను నియమించి, వాటిని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ఉన్నతాధికారులతో చర్చించారనీ, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న స్థానిక సంస్థలన్నింటినీ జీహెచ్‌ఎంసీలో విలీనం చేసి ఒకే కార్పొరేషన్‌గా మార్చటమా లేక మొత్తం 4 కార్పొరేషన్లుగా చేయటమా అనే దిశగా సర్కారు ఆలోచన చేస్తోన్నట్లు సమాచారం. ప్రస్తుతం జీహెచ్ఎంసీలోని కొన్ని డివిజన్లలో లక్షల జనాభా ఉండగా, కొన్ని డివిజన్లలో కేవలం 30 వేల జనాభాయే ఉంది. కానీ, నిధులు మాత్రం డివిజన్ యూనిట్‌గా జరగటం వల్ల ఎక్కువ జనాభా ఉన్న డివిజన్లకు అన్యాయం జరుగుతోంది.

కనుక వీటిని విలీనం చేసి, సమాన జనాభాగల డివిజన్లు ఏర్పాటు చేయాలని అధికారులు సీఎంకు సూచించినట్లు తెలుస్తోంది. ఇవిగాక, బాగా అభివృద్ధి చెందిన డివిజన్ల స్థానంలో శివారు ప్రాంతాలను అభివృద్ధి చేయటం వల్ల నగరం వేగంగా విస్తరిస్తుందనే దిశగానూ సర్కారు యోచిస్తోంది. ఇదే సమయంలో శివారులోని 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం, సెంట్రల్ అనే 5 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తే పాలన మరింత సులభమవుతుందనే కోణంలోనూ సర్కారు ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ, ముంబై కార్పొరేషన్ల నమూనాలను అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

Publisher : Swetcha Daily

Latest

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

Don't miss

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం...

LS Polls: ఆరో విడతలో 889 మంది అభ్యర్థులు.. 25న పోలింగ్

Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడతకు సంబంధించి నామినేషన్ల...

Bharati Builders: భారతి.. భూముల హారతి!

- అప్పుడు పుప్పాలగూడ.. ఇప్పుడు కొంపల్లి..! - హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ -...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా...

BJP: సీఎం రేవంత్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. ఎందుకు కలిశారు?

CM Revanth: రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వైరం ఎన్నికల వేళ పతాకస్థాయికి చేరుకుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొనడంతో ఈ...

Cabinet Meeting: కేబినెట్‌ భేటీకి ఈసీ ‘నో’.. ‘అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం’

- కేబినెట్ సమావేశానికి బ్రేక్ - పర్మిషన్ ఇవ్వని ఈసీ - భేటీని వాయిదా వేసిన సీఎం రేవంత్ రెడ్డి - అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఈసీని కలవాలని నిర్ణయం - ఇరిగేషన్ శాఖపై...

RGV: సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ ట్వీట్

CM Revanth Reddy: ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ గత కొంతకాలంగా రాజకీయాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బాహాటంగా ప్రకటిస్తున్నారు. చాలా సార్లు ఈ విషయమై ఆయన వివాదాల్లోనూ చిక్కుకున్నారు. రామ్ గోపాల్...