BJP Shantha Kumar
వరంగల్

BJP | బీసీలను వంచించే కుట్ర -శాంత కుమార్

మహబూబ్‌నగర్, స్వేచ్ఛ: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కుల గణన నివేదిక‌తో కాంగ్రెస్ పార్టీ బీసీలను వంచించే కుట్ర చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంత కుమార్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా‌తో ఆయన మాట్లాడారు. 3 కోట్ల 92 లక్షల జనాభా ఉన్న బీసీలను 3కోట్ల 50 లక్షలు గా తక్కువ చేసి చూపించడంలో ఆంతర్యమేమిటి అని ప్రశ్నించారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేసామని చెప్పుకోవడానికి మాత్రమే ఈ నివేదికను బహిర్గతం చేశారని శాంత కుమార్ అన్నారు. బీసీ కులగణన నివేదిక బాధ్యతను పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ నాయకులకు ఇవ్వకుండా అగ్ర కులస్తుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎలా ఇస్తారన్నారు. బీసీలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు. సమావేశంలో బీజేపీ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అచ్చు గట్ల అంజయ్య, నాయకులు నంబిరాజు తదితరులు పాల్గొన్నారు.